PhonePeలో ఒక బ్యాంకు ఖాతాను చేర్చడం ఎలా? 

UPI పేమెంట్లు చేసేందుకు, ఇతరుల నుంచి నగదు అందుకోవడానికి PhonePeలో మీ ప్రస్తుత బ్యాంకు ఖాతాను చేర్చవచ్చు. అలా చేసే క్రమంలో మీరు కింది వాటిని నిర్ధారించుకోవాలి: 

    PhonePeలో ఒక బ్యాంకు ఖాతాను చేర్చేందుకు:

  1. నా డబ్బు/My Moneyను ట్యాప్ చేసి, పేమెంట్ పద్ధతులు/Payment Methods విభాగం కింద బ్యాంకు ఖాతాలు/Bank Accountsను ట్యాప్ చేయండి.
  2. కొత్త బ్యాంకు ఖాతాను చేర్చండి/Add new Bank Accountని ట్యాప్ చేయండి.
  3. జాబితా నుంచి మీ బ్యాంకును ఎంచుకోండి. శోధన పట్టీలో బ్యాంకు పేరును ప్రవేశపెట్టడం ద్వారా  మీ బ్యాంకును శోధించవచ్చు.
    గమనిక: మీ బ్యాంకు జాబితాలో లేకుంటే, స్క్రీన్ కింది భాగాన లబ్ధిదారు బ్యాంకును లింక్ చేయండి/Link Benificiery Accountని క్లిక్ చేసి, మాన్యువల్‌గా ప్రవేశపెట్టండి. జాబితాలో మీ బ్యాంకు లేకుంటే ఏం చేయాలనే విషయం గురించి మరింత తెలుసుకోండి. 
  4. ధృవీకరణ కోసం మీరు రిజిస్టర్ చేసుకున్న నెంబర్‌ నుంచి ఒక SMS పంపించబడుతుంది. మిమ్మల్ని అభ్యర్థించినప్పుడు, SMS అనుమతులను తప్పక ఇవ్వండి.                                                                                                                          
    గమనిక: మీ PhonePe ఖాతా ఉన్న మొబైల్ నెంబర్‌తోనే మీ బ్యాంకు ఖాతాను రిజిస్టర్ చేసి ఉంటే, అది ఆటోమేటిక్ గా తీసుకోబడుతుంది.  
  5. గతంలో మరే ఇతర యాప్‌లోనూ బ్యాంకు ఖాతాకోసం UPI పిన్‌ను అమర్చకుంటే, UPI పిన్‌ను అమర్చండి/Set UPI Pinని ట్యాప్ చేయండి. ఇప్పటికే ఈ ఖాతాకు మీరు UPI పిన్‌ను కలిగి ఉంటే, లింక్‌/Linkను ట్యాప్ చేయండి.

SMS ధృవీకరణ విఫలమైతే చేయాల్సినవి మరియు మీ బ్యాంకు వద్ద మీ మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానం గురించి మరింత తెలుసుకోండి.