PhonePeలో నా డెబిట్ కార్డు/క్రెడిట్ కార్డును సేవ్ చేయడం ఎలా?

వేగవంతమైన పేమెంట్ అనుభవాన్ని ఎనేబుల్ చేసేందుకు PhonePeలో డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డును మీరు సేవ్ చేయవచ్చు.

గమనిక: వీసా, మాస్టర్ కార్డు, మేస్ట్రో, డైనర్స్, అమెరికన్ ఎక్స్ ప్రెస్, రుపే జారీ చేసిన అన్ని స్వదేశీ డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులకు మేము మద్ధతు ఇస్తాము. 

అలా చేయడం కోసం:  

  1. PhonePe యాప్ హోమ్ స్క్రీన్‌లో మీ ప్రొఫైల్ చిత్రాన్ని ట్యాప్ చేయండి.
  2.  పేమెంట్ పద్ధతులు/ Payment Methods విభాగం కింద  అన్ని పేమెంట్ పద్ధతులను చూడండి/View All Payment Methodsను ట్యాప్ చేయండి. 
  3. క్రెడిట్ కార్డులు లేదా డెబిట్ కార్డుల/Credit Cards/Debit Cards కింద కార్డును చేర్చండి లేదా కొత్త దానిని చేర్చండి /Add Card or Add Newని ట్యాప్ చేయండి. 
  4. మీ కార్డు నెంబర్‌ను ప్రవేశపెట్టి, మీ కార్డు, CVV నెంబర్‌ను ప్రవేశపెట్టండి.
  5. మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌లో మీరు అందుకున్న OTPని ప్రవేశపెట్టండి.
    గమనిక: PhonePeలో మీరు అందుకుంటున్న SMS అనుమతులను ఎనేబుల్ చేయడం ద్వారా OTPని స్వయం చాలకంగా నింపేందుకు PhonePe అనుమతించేలా చేసుకోవచ్చు. దీనిని మీరు ఫోన్ సెట్టింగ్‌లు/Phone Settings >> యాప్‌లు & నోటిఫికేషన్లు/Apps&Notifications >> PhonePe >> అనుమతులు /Permissions ద్వారా చేయవచ్చు.
  6. నిర్ధారించండి/Confirmని ట్యాప్ చేయండి. 

ముఖ్య గమనిక: మీరు యాప్‌లో సేవ్ చేసే ప్రతి కార్డుకు ప్రమాణికీకరణ ప్రయోజనాలకోసం PhonePe ₹2 తీసివేస్తుంది. ఈ మొత్తం తనంతతానుగా మీ ఖాతాకు రీఫండ్ చేయబడుతుంది.