కొత్త UPI ఐడిలను నేను ఎందుకు యాక్టివేట్ చేయాలి?

పేమెంట్ వైఫల్యాలు లేదా జాప్యాలు లాంటి సమస్యలను తగ్గించడం కోసం, మీ బ్యాంకు ఖాతాలు ఒక్కోదానికి ఒకటికి పైగా UPI ఐడి హ్యాండిళ్లను (@ybl, @ibl, @axl) యాక్టివేట్ చేసుకోవాలని సూచిస్తున్నాము. 

ఒకటికి పైగా UPI IDలను యాక్టివేట్ చేసుకున్నప్పుడు, ఒక హ్యాండిల్‌కు సంబంధించిన PSP  బ్యాంకులో సమస్య ఏర్పడినా, మరో ప్రత్యామ్నాయ హ్యాండిల్ ద్వారా PhonePe మీ పేమెంట్‌ను పంపుతుంది. ఈ రకంగా, PhonePe ఎలాంటి వైఫల్యం లేకుండా త్వరితగతిన మీ పేమెంట్‌ వెళ్లేలా చూడగలదు. కాబట్టి, ఆ సమయంలో సంబంధిత బ్యాంకు పనితీరు ఆధారంగా యాక్టివేట్ చేసిన UPI  ఐడి హ్యాండిళ్లలో దేని ద్వారా అయినా మీ పేమెంట్‌ను PhonePe పూర్తి చేయగలదు.

గమనిక:  UPI ద్వారా ఏదైనా పేమెంట్ చేసినప్పుడు, మీ UPI ఐడి కాకుండా మీరు మొత్తాన్ని చెల్లించాలని కోరుకుంటున్న బ్యాంకు ఖాతాను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. యాక్టివేట్ చేసిన UPI ఐడి హ్యాండిళ్లలో దేని ద్వారా అయినా PhonePe తనంత తానుగా పేమెంట్‌ను పూర్తి చేస్తుంది.

కొత్త UPI ఐడి హ్యాండిళ్లను యాక్టివేట్ చేస్తున్నప్పుడు SMS ధృవీకరణ విఫలమైతే ఏం జరుగుతుందనే విషయం గురించి మరింత తెలుసుకోండి.