నా ATM పిన్‌‌, MPINతో పోల్చితే  UPI పిన్‌ ఎలా భిన్నంగా ఉంటుంది?

ఒక ATM పిన్ అనేది 4-అంకెల కోడ్. సాధారణంగా దీనిని బ్యాంక్ అందిస్తుంది. డెబిట్ కార్డు పేమెంట్లను ప్రమాణికీకరించేందుకు మరియు ATMల నుండి నగదు ఉపసంహరణలకు ఇది ఉపయోగించబడుతుంది.

ఒక MPIN అనేది IMPS మరియు NEFT పేమెంెట్లు  లాంటి మొబైల్ బ్యాంకింగ్ పేమెంట్లు మరియు జాతీయ ఏకీకృత USSD వేిదికలో జరిపే పేమెంట్లను ప్రమాణీకరించేందుకు మీరు ఉపయోగించగల పాస్ కోడ్.

ఒక UPI పిన్ అనేది 4 లేదా 6- అంకెల పాస్ వర్డ్. ఏ పేమెంట్ల యాప్ లో అయినా UPI పేమెంట్లను చేసేందుకు మీరు దీనిని ఉపయోగించవచ్చు. ఇప్పటికే లేకుంటే, PhonePeలో చేర్చే ఏ బ్యాంక్ ఖాతాకైనా మీరు ఒక విశిష్ఠ UPI పిన్‌ను మీరు సెట్ చేయాల్సి ఉంటుంది. 

ముఖ్య గమనిక: దయచేసి, మీ UPI పిన్, ATM పిన్, మరియు MPIN‌ను ఎవ్వరితోనూ పంచుకోవద్దు. PhonePe లేదా బ్యాంకులు ఈ పిన్‌ల కోసం ఎన్నడూ అడగవు.