SMS వెరిఫికేషన్ విఫలమైతే ఏం చేయాలి?
PhonePeలో మీ బ్యాంక్ అకౌంట్‌ను చేర్చుతున్నప్పుడు కింది కారణాలతో SMS వెరిఫికేషన్ విఫలం కావచ్చు. మళ్లీ ప్రయత్నించే ముందు కింది వాటిని సరిచూసుకోవాలని మేము కోరుతున్నాము:
- వెరిఫికేషన్ కోసం SMS పంపేందుకు బ్యాంక్ అకౌంట్‌తో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్లో తగినంత బ్యాలెన్స్ లేదు.
- SMSను పంపేందుకు ప్రయత్నించే సమయంలో సరైన SIM స్లాట్‌ను మీరు ఎంచుకోలేదు. దీనిని మీరు మీ ఫోన్ సెట్టింగ్‌లు >> SIM & నెట్వర్క్ >> డిఫాల్ట్ SMSలో సరిచూసుకోవచ్చు.
- PhonePe యాప్‌కోసం SMS అనుమతులను మీరు ఎనేబుల్ చేయలేదు. మీ ఫోన్ సెట్టింగ్‌లు >> యాప్‌లు & నోటిఫికేషన్లు >> PhonePe >> అనుమతులకు వెళ్లడం ద్వారా దీనిని మీరు చెక్ చేసుకోవచ్చు.
- మీ నెట్వర్క్ లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీ బలహీనంగా ఉండవచ్చు.
గమనిక: SMS వెరిఫికేషన్ విఫలం కావడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా సరైన ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడాన్ని చెప్పవచ్చు. - మీ యాప్ తాజా వెర్షన్‌కు అప్డేట్ చేయబడింది.
గమనిక: మీరు ఒక డ్యుయల్ సిమ్ సాధనాన్ని ఉపయోగిస్తుంటే, దయచేసి, PhonePeతో రిజిస్టర్ చేయని మొబైల్ నంబర్ సిమ్ స్లాట్‌ను డిసేబుల్ చేయండి.