UPI ఐడి (VPA)కి డబ్బు పంపడం ఎలా?

PhonePeలో ఒక స్నేహితుడి UPI ఐడికి నగదు పంపించడానికి: 

  1. యాప్ హోమ్ స్క్రీన్‌లో నగదు బదిలీలు విభాగంలోని పరిచయాలు విభాగాన్ని ట్యాప్ చేయండి.
  2. శోధన పట్టీ కింద ఉన్న UPI ఐడిని ట్యాప్ చేయండి. 
  3. మీ పరిచయాలలో ఏదైనా ఒక UPI ఐడిని ఎంచుకోండి లేదా ఐడీని ప్రవేశపెట్టిన తర్వాత ధృవీకరించండిని ట్యాప్ చేయండి. 
  4. నగదు మొత్తాన్ని ప్రవేశపెట్టండి. 
  5. పంపించండిని ట్యాప్ చేయండి. 

మీరు పంపిన నగదు స్వీకర్త యొక్క UPI ఐడికి లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకు జమ చేయబడుతుంది.

ముఖ్య గమనిక: డబ్బు పంపే సమయంలో, మీరు డబ్బును పంపించాలనే కోరుకుంటున్న బ్యాంకు ఖాతాను ఎంచుకుంటే సరిపోతుంది. మీ UPI ఐడీ అవసరం లేదు.

గమనిక: కొన్ని సందర్భాల్లో, అంతర్గత సాంకేతిక సమస్య కారణంగా, మీరు ప్రవేశపెట్టిన UPI ఐడీ సరిగ్గానే ఉన్నప్పటికీ అది ధృవీకరించబడని కారణంగా ఇది జరగవచ్చు. ఇలాంటి సందర్బాల్లో, కాసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించండి.

మీ UPI ఐడీలలో ఎవరైనా డబ్బు పంపిస్తే మీరు దానిని ఎక్కడ అందుకోవాలనే విషయం గురించి మరింత తెలుసుకోండి.