నా UPI పిన్ సెట్ చేయడం లేదా రీసెట్ చేయడం ఎలా?

డెబిట్ కార్డు లేదా మీ ఆధార్ కార్డును ఉపయోగించి, మీ UPI పిన్ ను సెట్ చేయవచ్చు లేదా రీసెట్ చేయవచ్చు: 

మీ డెబిట్ కార్డును ఉపయోగించడం

మీరు మీ డెబిట్ కార్డును ఉపయోగించాలనుకుంటే,

1. PhonePe యాప్ హోమ్ స్క్రీన్ లోని మీ ప్రొఫైల్ చిత్రాన్ని ట్యాప్ చేయండి.
2. బ్యాంక్ ఖాతాలను ట్యాప్ చేసి, మీరు UPI పిన్‌ని రీసెట్ చేయాలనుకుంటున్న లేదా మార్చాలనుకుంటున్న బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి.
3. కింద చూపిన విధంగా UPI పిన్ పక్కన ఉన్న Reset/Set/రీసెట్ చేయి లేదా సెట్ చేయిని ట్యాప్ చేయండి.,

4. ఆ ఖాతాకు మీ డెబిట్ కార్డు/ATM కార్డు వివరాలను ప్రవేశపెట్టండి.
5. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌లో SMS ద్వారా మీరు అందుకున్న 6-అంకెల OTPని ప్రవేశపెట్టండి.
గమనిక: SMS అనుమతులను మీరు ఎనేబుల్ చేస్తే, PhonePe OTPని తనంతతానుగా అందుకుంటుంది. మీ ఫోన్ సెట్టింగ్‌లు >>యాప్‌లు & నోటిఫికేషన్లు >> PhonePe >> అనుమతుల్లో మీ OTPని తనంతతానుగా పొందేలా మీరు PhonePeను ఎనేబుల్ చేయవచ్చు.
6. మీ డెబిట్ కార్డు లేదా ATM కార్డు కోసం 4-అంకెల ATM పిన్‌ను ప్రవేశపెట్టండి.
7. కొత్త 4 లేదా 6-అంకెల UPI పిన్‌ను ప్రవేశపెట్టండి.
8. నిర్ధారించడానికి UPI పిన్‌ను మళ్లీ ప్రవేశపెట్టండి.
9. Confirm/నిర్ధారించును ట్యాప్ చేయండి.

వీటిని కూడా చూడండి:

నాకు OTP ఎందుకు అందలేదు?
నా వద్ద డెబిట్ కార్డు లేదా ATM కార్డు లేకుంటే ఏం చేయాలి?
నా ATM పిన్‌ను మరచిపోతే ఏం చేయాలి?

మీ ఆధార్ కార్డును ఉపయోగించడం

 

మీ ఆధార్ నెంబర్‌ను మీరు ఉపయోగించాలనుకుంటే, 

1. PhonePe యాప్ హోమ్ స్క్రీన్‌లో మీ ప్రొఫైల్ చిత్రాన్ని ట్యాప్ చేయండి.
2. Bank Accounts/బ్యాంక్ ఖాతాలను ట్యాప్ చేసి, మీ బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి. 
3. ఆ ఖాతా కింద ఉన్న UPI PIN/UPI పిన్ పక్కన ఉన్న Set or Reset/సెట్ చేయి లేదా రీసెట్ చేయిని ట్యాప్ చేయండి.
4. Sబ్యాంక్ ఆప్షన్‌తో లింక్ చేసిన ఆధార్ నెంబర్ ఎంచుకుని, Proceed/ముందుకెళ్లండిని ట్యాప్ చేయండి.
5. మీ ఆధార్ నెంబర్ యొక్క మొదటి 6 అంకెలను ప్రవేశపెట్టండి.
గమనిక: మీరు రెండు OTPలను అందుకుంటారు. మీ బ్యాంక్ నుండి ఒకటి, UIDAI. 
6.OTPలు రెండింటినీ ప్రవేశపెట్టండి.
7. కొత్త 4 లేదా 6-అంకెల UPI పిన్‌ను ప్రవేశపెట్టండి.
8. నిర్ధారించడం కోసం UPI పిన్‌ను మళ్లీ ప్రవేశపెట్టండి
9. Confirm/నిర్ధారించును ట్యాప్ చేయండి.

వీటిని కూడా చూడండి:

తప్పుడు ఆధార్ నెంబర్‌ను రెండుసార్లు ప్రవేశపెడితే, ఏం చేయాలి?
నా ఆధార్‌తో లింక్ చేసిన నెంబర్ మరియు PhonePe రిజిస్టర్డ్ నెంబర్ వేర్వేరుగా ఉంటే, ఏం చేయాలి?
నా UPI పిన్‌ను సెట్ చేసేందుకు ఆధార్ ఆప్షన్‌ను నేను ఎందుకు చూడలేకున్నాను?
నాకు OTP ఎందుకు అందలేదు?