ఈ పాలసీ దేనికి రక్షణ ఇస్తుంది?
గ్రూప్ ఆరోగ్య సంజీవని పాలసీ కింది వాటికి రక్షణ ఇస్తుంది:
- ఆసుపత్రిలో చేరక ముందు ఖర్చులు - మీరు ఆసుపత్రిలో చేరడానికి 30 రోజుల ముందు మీరు భరించే వైద్య ఖర్చులకు నియమ, నిబంధనల ప్రకారం రక్షణ ఇస్తుంది.
- ఆసుపత్రి ఖర్చులు - మీరు లేదా మీ కుటుంబ సభ్యులు 24గంటలు ఆసుపత్రిలో ఉన్నప్పుడు, మీ పాలసీ షెడ్యూల్ లో పేర్కొన్న బీమా మొత్తం మరియు సంచిత బోనస్ ల ఆధారంగా కింది వాటికి రక్షణ ఇస్తుంది:
- గది అద్దె, బోర్డింగ్, ఆసుపత్రి లేదా నర్సింగ్ హోమ్ లచే వసూలు చేయబడిన నర్సింగ్ ఖర్చులు: ఇది బీమా మొత్తంలో 2% వరకు రక్షణ ఇస్తుంది. మీరు రోజుకు గరిష్ఠ మొత్తం ₹5,000 క్లెయిమ్ చేసుకోవచ్చు.
- ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్ (ICCU)ఖర్చులు: బీమా మొత్తంలో 5% వరకు ఈ ఖర్చులకు రక్షణ ఇస్తుంది. మీరు రోజుకు గరిష్ఠ మొత్తం ₹10,000 క్లెయిమ్ చేసుకోవచ్చు.
- ఇతర ఖర్చులు
- వ్యాధి లేదా గాయం కారణంగా దంత చికిత్స అవసరమైతే
- వ్యాధి లేదా గాయం కారణంగా ప్లాస్టిక్ సర్జరీ అవసరమైతే
- ఆల్ డే సంరక్షణ చికిత్సలు
- ఆసుపత్రినుంచి బయటకు వచ్చిన తర్వాతి ఖర్చులు -ఆసుపత్రిలో చేరినపుడు కింది వాటికైన ఖర్చులు
డిశ్చార్జ్ అయినప్పటి నుంచి 60 రోజుల కాలంవరకు నియమ, నిబంధనల ప్రకారం రోగి సంరక్షణకు అవసరమయ్యే ఖర్చుల నుంచి రక్షణ ఇస్తుంది. - అంబులెన్స్ ఖర్చులు - రోడ్డు అంబులెన్స్ సేవలకు మీరు భరించిన ఖర్చుల నుంచి రక్షణ ఇస్తుంది.
ఒకసారి ఆసుపత్రిలో చేరడానికి గరిష్ఠంగా ₹2,000 మీరు అందుకోవచ్చు. - బీమా మొత్తంలో 50% వరకు ఆసుపత్రిలో ఇన్ పేషేంట్ లేదా డే కేర్ చికిత్సలో భాగంగా కింది ప్రక్రియలకు రక్షణ ఇస్తుంది (వైద్యం అవసరమైతే):
- యుటెరిన్ ఆర్టరీ ఎంబాలిశషన్ అండ్ హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ ఆల్ట్రాసౌండ్ (HIFU)
- బెలూన్ సినుప్లాస్టీ
- తీవ్రమైన మెదడు ఉద్దీపన
- నోటి ద్వారా కీమోథెరపీ
- ఇమ్యునోథెరపీ - ఇది ఇంజెక్ట్ చేయాలంటే మోనోక్లోనల్ యాంటీబాడీని కలిగి ఉంటుంది
- ఇంట్రా విట్రియల్ ఇంజెక్షన్ లు
- రోబోటిక్ శస్త్రచికిత్సలు
- స్టీరియోటాసిటిక్ రేడియో శస్త్రచికిత్సలు
- బ్రోంచియల్ థర్మోప్లాస్టీ
- వాపోరిసాటిన్ అఫ్ ది ప్రోస్టేట్ (గ్రీన్ లేజర్ చికిత్స లేదా హోల్మియం లేజర్ చికిత్స)
- ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ (IONM)
- మూల కణ చికిత్స - బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ కోసం మూల కణల హేమాటోపోయిటిక్ కు రక్షణ ఇస్తుంది
ఈ పాలసీ దేనికి రక్షణ ఇవ్వదు అనే విషయం గురించి మరింత తెలుసుకోండి.