రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) అంటే ఏమిటి?

రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) అనేది మీ కారు రిజిస్ట్రేషన్‌ను ధ్రువీకరించే ఒక అధికారిక డాక్యుమెంట్ (స్మార్ట్ కార్డ్ కూడా అయ్యుండొచ్చు). దీనిపై కారు యజమాని పేరు, కారు రిజిస్ట్రేషన్ నంబర్, రిజిస్ట్రేషన్ తేదీ, గడువు తేదీ, ఇంజన్ & ఛాసిస్ నంబర్, కారు తయారీదారు పేరు, మోడల్, క్లాస్, ఇంధనం రకం, పన్ను వివరాలు, ఉద్గార నియమాలు, ఇంకా మరెన్నో వివరాలు ఉంటాయి.

గమనిక: ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అనేది స్మార్ట్ కార్డ్ అయ్యుంటే, మీరు వరుసగా RC1, RC2 ఫోటోలను ముందువైపు, వెనకవైపు ఫోటోలుగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉదాహరణ ఫోటోలు

RC ఫ్రంట్

RC స్మార్ట్ కార్డ్

నేను డూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందడం ఎలా?

ఒకవేళ మీకు మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ డూప్లికేట్ అవసరమైతే, మీకు ఒరిజినల్ RCని జారీ చేసిన RTOకు కింద తెలిపిన డాక్యుమెంట్‌లతో పాటుగా ఫిర్యాదును సబ్మిట్ చేయండి:

  • సరిగా నింపిన ఫారమ్ 26
  • కోల్పోయిన RCకి సంబంధించి పెట్టిన FIR కాపీ
  • గడచిన 1 ఏడాది నాటి పన్ను చెల్లింపు వివరాలు
  • ఇన్సూరెన్స్ సర్టిఫికెట్
  • ఒకవేళ మీ కారు కొనడానికి లోన్ తీసుకొని ఉంటే, లోన్ ప్రొవైడర్ జారీ చేసిన NOC
  • చెల్లుబాటయ్యే పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్

గమనిక: వాహన్ జాన్‌కారీ యాప్‌లో మీ వాహన రిజిస్ట్రేషన్ సమాచారం, దాని వివరాలు, స్టేటస్‌ను మీరు చెక్ చేయవచ్చు.