నా KYCని మళ్లీ ఎందుకు సమర్పించాలి?

SEBI నియంత్రణల ప్రకారం, తప్పుడు మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడి వల్ల మీ KYC మలి-ధృవీకరణ విఫలమైతే, PhonePe ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం కొనసాగించేందుకు మీ KYCని మీరు మళ్లీ సమర్పించాల్సి ఉంటుంది. 

అలా చేసేందుకు, మీ యాప్ లోని సంపద విభాగంలోని Submit KYC/ KYCని సమర్పించండిని నొక్కండి.

మీ KYCని మళ్లీ సమర్పించిన తర్వాత వెంటనే మీరు పెట్టుబడి పెట్టవచ్చు. అయినప్పటికీ, KYC ధృవీకరణ పూర్తయిన తర్వాత మాత్రమే ఫండ్స్ ను మీరు ఉపసంహరించుకోవచ్చు. దీనికి ఒకరోజు వరకు సమయం పట్టవచ్చు.

ముఖ్య గమనిక: 18 ఆగస్టు 2023 లోపు మీరు మీ KYC డాక్యుమెంట్లను మళ్లీ సమర్పించకుంటే, మీ KYC స్థితి ‘ఆపి వేయబడింది’కి మారుతుంది. అంటే మీ KYC మళ్లీ ధృవీకరించబడే వరకు మీరు ఇక ఎంత మాత్రమూ నిధులను పెట్టుబడి పెట్టడం కానీ, ఉపసంహరించుకోవడం కానీ లేదా మీ ఆటోపే సెట్టింగ్ లను అప్ డేట్ చేయడం కానీ చేయలేరు.