సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) అనేది ప్రతినెలా మ్యూచువల్ ఫండ్స్ లో ఒక నిర్ధిష్ఠ మొత్తంలో డబ్బును మదుపు చేయడం ద్వారా మీ సంపదను రూపొందించి, నిర్వహించడానికి అనుగుణమైన ఒక మదుపు ఆప్షన్. SIPలు మార్కెట్ బలపడడం, బలహీనపడడం గురించి కానీ, రిస్క్ లు గురించి కానీ ఆందోళన చెందకుండా మీ డబ్బును క్రమం తప్పకుండా మదుపు చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది.
SIP ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి.
తక్కువ మొత్తంతో ప్రారంభించండి: సంపదను సృష్టించడానికి ప్రతినెలా ₹100ను పెట్టుబడిగా పెట్టడం ద్వారా తక్కువ మొత్తంతోనే ప్రారంభించవచ్చు.
రూపాయి ఖర్చు సరాసరి: ధర తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లను కొనవచ్చు. ధర ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ యూనిట్లను కొనవచ్చు.
కలుపుకుంటూ పోయే శక్తి: మీరు పెట్టుబడి పెట్టగల ప్రాథమిక అసలు మొత్తంపై మాత్రమే కాక దానికి అదనంగా చేరుతున్న వడ్డీపై కూడా వడ్డీని సంపాదించవచ్చు.