SIPకోసం నా మొదటి పేమెంట్ ఎప్పుడు చేయబడుతుంది?
మీ SIP పెట్టుబడి కోసం మీరు ఎంచుకున్న తేదీ మరియు పేమెంట్ పద్ధతి ఆధారంగా మీ మొదటి ఆటో పేమెంట్ చేయబడుతుంది.
- పేమెంట్ పద్ధతిగా మీరు UPIను ఎంచుకుంటే, మీ మొదటి ఆటో పేమెంట్ మీరు SIP సెటప్ చేసిన తేదీన చేయబడుతుంది. అయినప్పటికీ, మీ రెండో ఆటో పేమెంట్ ఆటోపే సెటప్ తేదీ నుండి 30 రోజుల తర్వాతే చేయబడుతుంది. గమనిక: ఇది మీ రాబోయే ఆటో పేమెంట్లను ప్రభావితం చేయదు. మీరు ఎంచుకున్న SIP తేదీన అవి చేయబడుతాయి.
- పేమెంట్ పద్ధతిగా మీరు డెబిట్ కార్డును లేదా నెట్ బ్యాంకింగ్ ను ఎంచుకుంటే, మీ మొదటి ఆటో పేమెంట్ మీరు ఎంచుకున్న తేదీపై ఆధారపడి ఉంటుంది. మీ SIP తేదీ ఆటోపే సెటప్ లేదా సవరణ తేదీ నుండి 6 రోజుల్లోపు ఉంటే, మీ మొదటి ఆటో పేమెంట్ తర్వాతి నెల చేయబడుతుంది. మీరు షెడ్యూల్ చేసిన SIP తేదీ ఆటోపే సెటప్ తేదీ నుండి 7 రోజుల తర్వాత ఉంటే , SIP పేమెంట్ అదే నెలలో జరుగుతుంది.
ఈ విషయంపై మరింత సమాచారం కోసం దయచేసి పట్టికను చెక్ చేసుకోండి:
పేమెంట్ పద్ధతి | సెట్-అప్ తేదీ | SIP తేదీ | మొదటి పేమెంట్ | రెండో పేమెంట్ | మూడు & తర్వాతి పేమెంట్లు |
UPI | మార్చ్ 5 | ప్రతినెలా 7న | మార్చ్ 5 | ఏప్రిల్ 7న | మే 7 నుండి |
UPI | మార్చ్ 15 | ప్రతినెలా 7న | మార్చ్ 15 | మే 7న | జూన్ 7 నుండి |
నెట్ బ్యాంకింగ్ /డెబిట్ కార్డు (SIP తేదీ ఆటోపే సెట్-అప్ తేదీ నుండి 6 రోజుల్లోపు) |
మార్చ్ 5 | ప్రతినెలా 7న | ఏప్రిల్ 7 | మే 7న | జూన్ 7 నుండి |
నెట్ బ్యాంకింగ్ /డెబిట్ కార్డ్ (SIP తేదీ ఆటోపే సెటప్ తేదీనుండి 7 రోజుల తర్వాత అయితే) |
మార్చ్ 5 | ప్రతినెలా 7న | ఏప్రిల్ 7 | మే 7న | జూన్ 7 నుండి |
షెడ్యూల్ చేసిన పెట్టుబడి తేదీ వారాంతం లేదా బ్యాంక్ సెలవు రోజు అయినా, మీ SIP కోసం డబ్బు మీ ఖాతా నుండి తీసివేయబడుతుంది..
SIPను సెటప్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.