SIP మదుపు కోసం మదుపు మొత్తం లేదా తేదీని మార్చడం ఎలా?
మదుపు మొత్తం లేదా తేదీని మార్చడానికి,
- మీ PhonePe యాప్ హోమ్ స్క్రీన్ కింది భాగాన ఉన్న Wealth/సంపదను ట్యాప్ చేయండి..
- స్క్రీన్ పైభాగాన ఉన్న My Portfolio/నా పోర్ట్ఫోలియో ను ట్యాప్ చేయండి.
- My SIPs/నా SIPలు ను ట్యాప్ చేయండి.
- సంబంధిత SIPను ఎంచుకోండి.
- Modify/సవరించును ట్యాప్ చేయండి. .
- పెట్టుబడి మొత్తాన్ని మార్చి లేదా కొత్త తేదీని సెట్ చేసి, Continue/కొనసాగించును ట్యాప్ చేయండి.
- పాప-అప్లో Confirm/నిర్ధారించును ట్యాప్ చేయండి.
ముఖ్య గమనిక: మీరు సరిచేసే వివరాలు
- ప్రస్తుతమున్న, నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు (NACH ప్రామాణికీకరణ) ద్వారా ధృవీకరించబడిన SIPకి సంబంధించినవి అయితే, మీరు మళ్లీ ధృవీకరణ జరపాల్సిన అవసరం లేదు.
- ప్రస్తుతమున్న, UPI ద్వారా ధృవీకరించిన SIPకు సంబంధించినవి అయితే, ధృవీకరణను మళ్లీ పూర్తి చేసేందుకు మీరు మీ UPI పిన్ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
గమనిక: ₹2 మొత్తం ఈ ధృవీకరణ కోసం మీ బ్యాంక్ నుండి తీసివేయబడింది. ఈ మొత్తం 1 గంటలోపు రీఫండ్ చేయబడుతుంది. ధృవీకరణ లేదా పేమెంట్ పురోగతిలో ఉన్నప్పుడు SIP వివరాలు మార్చబడవు. - ప్రస్తుతం ఉన్న SIP అయితే, AMC జారీ చేసే స్టేట్ మెంట్ లో ఒక కొత్త SIPగా గుర్తు పెట్టబడుతుంది.