ఈక్విటీ ఫండ్స్
లార్జ్ క్యాప్ ఫండ్స్

<style type="text/css"><!--td {border: 1px solid #ccc;}br {mso-data-placement:same-cell;}--> </style> ఇది భారతదేశంలో భారీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన 100 అగ్రశ్రేణి కంపెనీలు మరియు దేశంలోని కొన్ని అతిెపెద్ద బ్రాండ్ లలో ఒకటిగా నిలిచే కంపెనీలలో పెట్టుబడి పెట్టే ఈక్విటీ ఫండ్ రకం. 3 ఏళ్లు మరియు అంతకన్నా ఎక్కువ కాలానికి ఈ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలని సూచించబడుతోంది.

ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్

<style type="text/css"><!--td {border: 1px solid #ccc;}br {mso-data-placement:same-cell;}--> </style> ఈ ఫండ్స్ ఒకే ఫండ్ ద్వారా భారీ, మధ్య, చిన్న స్థాయి పరిశ్రమల్లో పెట్టుబడి పెడుతాయి. తద్వారా వివిధ రంగాలు, మార్కెట్ క్యాపిటలైజేషన్ లలో వైవిధ్య భరితమైన పోర్ట్ ఫోలియోను నిర్మించేలా మీకు వీలు కల్పిస్తాయి. మూడేళ్లు మరియు అంతకుపైగా కాలానికి ఈ ఫండ్లలో మదుపు చేయడం మంచిదని సిఫార్సు చేయబడుతుంది.

వేల్యూ ఫండ్స్

<style type="text/css"><!--td {border: 1px solid #ccc;}br {mso-data-placement:same-cell;}--> </style> ఇది దీర్ఘ కాలంలో అధిక రిటర్న్ లను అందించే సామర్థ్యం కలిగిన తక్కువ విలువ ఫండ్లలో పెట్టుబడి పెట్టే ఈక్విటీ ఫండ్ రకం. మూడేళ్లు మరియు అంతకుపైగా కాలానికి ఈ ఫండ్లలో మదుపు చేయడం మంచిదని సిఫార్సు చేయబడుతుంది.

మిడ్ క్యాప్ ఫండ్స్

<style type="text/css"><!--td {border: 1px solid #ccc;}br {mso-data-placement:same-cell;}--> </style> మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 101 నుండి 250 మధ్య ఉన్న మధ్య స్థాయి కంపెనీలలో ఈ ఫండ్లు పెట్టుబడి పెడుతాయి. ఐదేళ్లు మరియు అంతకుపైగా కాలానికి ఈ ఫండ్లలో మదుపు చేయడం మంచిదని సిఫార్సు చేయబడుతుంది.

స్మాల్ క్యాప్ ఫండ్స్

<style type="text/css"><!--td {border: 1px solid #ccc;}br {mso-data-placement:same-cell;}--> </style> ఇది వేగంగా వృద్ధి చెందే సామర్థ్యం కలిగిన చిన్న స్థాయి కంపెనీలలో పెట్టుబడి పెట్టే ఈక్విటీ ఫండ్ రకం. ఐదేళ్లు మరియు అంతకుపైగా కాలానికి ఈ ఫండ్లలో మదుపు చేయడం మంచిదని సిఫార్సు చేయబడుతుంది.

ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్క్రీమ్ (ELSS) అని చెప్పే ఈ ఫండ్స్ 3 ఏళ్ల తక్కువ స్థాయి లాక్-ఇన్ కాలాన్ని కలిగి ఉంటుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద నిర్వచించిన విధంగా పన్ను ప్రయోజనాలను ఆస్వాదించేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది.
<style type="text/css"><!--td {border: 1px solid #ccc;}br {mso-data-placement:same-cell;}--> </style>

పన్ను ఆదా ఫండ్స్ లో పెట్టిన పెట్టుబడిలో గరిష్ఠంగా ₹1,50,000 వరకు సెక్షన్ 80 సి కింద మీరు పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ, మీ పూర్తి పన్ను ఆదా మీ పన్ను బ్రాకెట్ పైన ఆధారపడి ఉంటుంది.

ఇండెక్స్ ఫండ్స్

<style type="text/css"><!--td {border: 1px solid #ccc;}br {mso-data-placement:same-cell;}--> </style> ఈ ఫండ్స్ నిఫ్లీ 50, సెన్సెక్స్ లాంటి వాటి లిస్టింగ్ లో ఉన్న అగ్రశ్రేణి కంపెనీలలో పెట్టుబడి పెడుతాయి. మూడేళ్లు మరియు అంతకుపైగా కాలానికి ఈ ఫండ్లలో మదుపు చేయడం మంచిదని సిఫార్సు చేయబడుతుంది.

<style type="text/css"><!--td {border: 1px solid #ccc;}br {mso-data-placement:same-cell;}--> </style> ఉదాహరణకు, ఒక నిఫ్లీ 50 ఇండెక్స్ ఫండ్ నిఫ్లీ 50 సూచీలో భాగమైన 50 స్టాక్ లలో పెట్టుబడి పెట్టి ఉంటుంది.

లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్స్

<style type="text/css"><!--td {border: 1px solid #ccc;}br {mso-data-placement:same-cell;}--> </style> ఈ ఫండ్స్ భారీ మరియు మధ్య స్థాయి స్టాక్ లలో పెట్టుబడి పెడతాయి. తద్వారా భారీ కంపెనీల స్థిరత్వం మరియు మిడ్ క్యాప్ కంపెనీల నుండి దక్కగల అధిక రిటర్న్ లను ఆస్వాదించేందుకు మీకు వీలు కల్పిస్తాయి. మూడేళ్లు మరియు అంతకుపైగా కాలానికి ఈ ఫండ్లలో మదుపు చేయడం మంచిదని సిఫార్సు చేయబడుతుంది.

ఫోకస్డ్ ఫండ్స్

<style type="text/css"><!--td {border: 1px solid #ccc;}br {mso-data-placement:same-cell;}--> </style> ఈ ఫండ్స్ వివిధ రకాలకు చెందిన భారీ, మధ్య, చిన్న స్థాయి కంపెనీలకు చెందిన గరిష్ఠంగా 30 అగ్రశ్రేణి స్టాక్ లలో పెట్టుబడి పెడుతాయి. మూడేళ్లు మరియు అంతకుపైగా కాలానికి ఈ ఫండ్లలో మదుపు చేయడం మంచిదని సిఫార్సు చేయబడుతుంది.

మల్టీ క్యాప్ ఫండ్స్

<style type="text/css"><!--td {border: 1px solid #ccc;}br {mso-data-placement:same-cell;}--> </style> దీర్ఘకాలంలో వైవిధ్యభరితమైన పెట్టుబడుల నుండి ప్రయోజనం అందుకునేలా సహాయపడేలా భారీ, మధ్య, తక్కువ విలువ కలిగిన స్టాక్ ల సమాన మిశ్రమాన్ని ఈ ఫండ్స్ కలిగి ఉంటాయి.మూడేళ్లు మరియు అంతకుపైగా కాలానికి ఈ ఫండ్లలో మదుపు చేయడం మంచిదని సిఫార్సు చేయబడుతుంది.

సెక్టోరల్ ఫండ్స్

<style type="text/css"><!--td {border: 1px solid #ccc;}br {mso-data-placement:same-cell;}--> </style> థీమేటిక్ ఫండ్స్ అని పిలిచే ఈ ఫండ్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్, ఫార్మాష్యూటికల్స్ లాండి ఒకే రంగం లేదా పరిశ్రలో భాగమైన కంపెనీల స్టాక్ లలో పెట్టుబడి పెడుతాయి.

డివిడెంట్ యీల్డ్ ఫండ్స్

<style type="text/css"><!--td {border: 1px solid #ccc;}br {mso-data-placement:same-cell;}--> </style> ఇది విస్తృత మార్కెట్ కన్నా ఎక్కువ డివిడెండ్ పే చేసే స్టాకుల్లో పెట్టుబడి పెట్టే స్టాకుల్లో పెట్టుబడి పెట్టే ఈక్విటీ ఫండ్ రకం. ఈ ఫండ్ స్థిరమైన క్యాష్ ఫ్లోలు కలిగిన నిలకడైన వ్యాపార సంస్థల్లో పెట్టుబడి పెడుతుంది. లాభదాయకంగానూ ఉంటుంది.