నా PhonePe ఖాతాలో వివరాలు మార్చడం లేదా తొలగించడం

మీ PhonePe ఖాతాలో మీ వివరాలు దేనినైనా మీరు మార్చాలని లేదా తొలగించాలని కోరుకుంటే, దయచేసి కింది సమాచారాన్ని చూడండి.

నా PhonePe మొబైల్ నెంబర్‌ను మార్చడం ఎలా?

PhonePeలో మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌ను మీరు మార్చలేరు. PhonePeలో మీరు మరో నెంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలని కోరుకుంటే, మీరు మీ ప్రస్తుత PhonePe ఖాతాను తొలగించి, కొత్త నెంబర్‌తో కొత్త ఖాతాను రూపొందించుకోవచ్చు. 

మీ PhonePe ఖాతాను తొలగించడం గురించి మరింత తెలుసుకోండి.

PhonePeలో నా బ్యాంకు ఖాతాను అన్‌లింక్ చేయడం ఎలా?

ఒక బ్యాంకు ఖాతాను అన్‌లింక్ చేయాలని కోరుకుంటే, దయచేసి కింది దశలను అనుసరించండి:

  1. PhonePe హోమ్ స్క్రీన్‌లో మీ ప్రొఫైల్ చిత్రాన్ని ట్యాప్ చేయండి. 
  2. మీ కుడి వైపునకు స్క్రోల్ చేయడం ద్వారా పేమెంట్ పద్ధతులు/Payment Methods విభాగంలో బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి. PhonePeలో లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలను చూసేందుకు అన్ని పేమెంట్ పద్ధతులు చూడండి/View All Payment Methodsను ట్యాప్ చేయండి.
  3. బ్యాంక్ ఖాతాను అన్‌లింక్ చేయి/Unlink Bank Accountను ట్యాప్ చేయండి.  

ఒక కొత్త బ్యాంకు ఖాతాను చేర్చడం గురించి మరింత తెలుసుకోండి.

నేను సేవ్ చేసిన కార్డు వివరాలను తొలగించడం ఎలా?

మీరు సేవ్ చేసిన ప్రస్తుత కార్డు వివరాలు వేటినైనా మీరు తొలగించాలని కోరుకుంటే, దయచేసి, కింది దశలను అనుసరించండి: 

  1. PhonePe హోమ్ స్క్రీన్‌లో మీ ప్రొఫైల్ చిత్రాన్ని ట్యాప్ చేయండి.
  2. పేమెంట్ పద్ధతులు /Payment Devices విభాగం కింద అన్ని పేమెంట్ పద్ధతులను చూడండి/ View All Payment Methodsని ట్యాప్ చేయండి.
  3. డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల విభాగం కింద డెబిట్ లేదా క్రెడిట్ కార్డును ఎంచుకుని, కార్డును అన్‌లింక్ చేయి/Unlink Cardని ట్యాప్ చేయండి.

ఒక కొత్త కార్డును చేర్చడం గురించి మరింత తెలుసుకోండి.

PhonePeలో నా UPI ఐడిలు మార్చడం ఎలా?

PhonePeలో మీ UPI ఐడిలను ఒకసారి రూపొందించిన తర్వాత వాటిని మార్చడం లేదా అనుకూలింపజేసుకునే ఆప్షన్ మీకు ఉండదు. 

PhonePeలో UPI ఐడిలు గురించి మరింత తెలుసుకోండి.

PhonePeలో నా లావాదేవీల చరిత్ర వివరాలను నేను పూర్తిగా తొలగించవచ్చా?

RBI మార్గదర్శకాల ప్రకారం, ఏ పేమెంట్ యాప్ వినియోగదారులు అయినా వారి యాప్ నుంచి ఏవైనా లావాదేవీ చరిత్ర వివరాలను తొలగించడానికి అనుమతించబడరు.

గమనిక: దయచేసి, PhonePeలో మీ పేమెంట్ వివరాలు అత్యంత సురక్షితంగా ఉంటాయి, బయటి పక్షాలు ఎవరితోనూ అవి పంచుకోబడవు.