PhonePeలో మీ రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్‌ను మీరు మార్చాలనుకుంటే, మీ ప్రస్తుత అకౌంట్ నుండి లాగ్ అవుట్ చేసి, కొత్త నంబర్‌ను రిజిస్టర్ చేయడం ద్వారా మీ కొత్త అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.
మీరు మాకు అభ్యర్థనను పంపి కూడా మీ మునుపటి అకౌంట్‌ను డియాక్టివేట్ చేయవచ్చు. అలా చేయడానికి ముందు, దయచేసి కింది అంశాలను నిర్ధారించుకోండి:
- మీ యాక్టివ్ ఆటోపేలను తొలగించారు/డిలీట్ చేశారు
- మీ PhonePe వాలెట్ బ్యాలెన్స్‌ను పూర్తిగా పేమెంట్ల కోసం ఉపయోగించారు లేదా బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేశారు, వర్తించినట్లయితే
గమనిక: మీరు కనీస-KYC యూజర్ అయి ఉండి, మీ విత్‌డ్రా చేసుకోగల వాలెట్ బ్యాలెన్స్‌ను మీ బ్యాంక్ అకౌంట్‌కు విత్‌డ్రా చేయాలనుకుంటే, PhonePe వాలెట్‌ను క్లోజ్ చేయాల్సి ఉంటుంది. మీ వాలెట్‌ను క్లోజ్ చేయడం కోసం, మీ వద్ద కనీసం ₹1 బ్యాలెన్స్ ఉండాలి. - మీరు PhonePeలో కొనుగోలు చేసిన ఏదైనా గోల్డ్‌ను విక్రయించారు లేదా డెలివరీ చేయించుకున్నారు
- UPI Lite క్లోజ్ చేశారు
- మీ PhonePe గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్‌ను పూర్తిగా ఉపయోగించారు
మీ ఫోన్ నంబర్‌ను మార్చేటప్పుడు, మీ వ్యక్తిగత వివరాలను సురక్షితంగా ఉంచుకోవడం కూడా ముఖ్యం. దీని కోసం కింది దశలను పూర్తి చేయండి:
- మీ పేమెంట్ రిమైండర్లు, సేవ్ చేసిన చిరునామాలు, సేవ్ చేసిన కార్డ్ వివరాలను తొలగించండి
- మీ బ్యాంక్ అకౌంట్‌ను అన్‌లింక్ చేయండి
డియాక్టివేషన్ అభ్యర్థనను పంపడం కోసం, దయచేసి కింది బటన్‌ను నొక్కండి.