80G ధృవపత్రం అంటే ఏమిటి?
80G ధృవపత్రం అనేది రిజిస్టర్ చేసిన ఛారిటబుల్ ట్రస్టులు, NGOలు, సంస్థలకు విరాళాలు అందించిన వ్యక్తులకు అందించే పన్ను మినహాయింపు ధృవపత్రం. PhonePeలోని జాబితాలో ఉన్న NGOలు లేదా సేవా కార్యక్రమాలు వేటికైనా మీరు విరాళాలు అందిస్తే, మీరు విరాళం అందించిన NGO లేదా GiveIndia నుంచి 80G ధృవపత్రం అందుకుంటారు. తద్వారా మీరు విరాళం అందించిన మొత్తం నుంచి 50%ను పన్ను మినహాయింపుగా అందుకోవచ్చు.
ముఖ్య గమనిక: 80G ధృవపత్రం మీరు NGOకు లేదా సేవా కార్యక్రమానికి అందించిన విరాళం పూర్తి మొత్తానికి జారీ జేయబడుతుంది. మత సంస్థలకు అందించే విరాళాలకు 80G ధృవపత్రం అందించబడదు.