నా లోన్ రీపేమెంట్ ఎందుకు పెండింగ్ లో ఉంది?
PhonePeలో లోన్ రీపేమెంట్లు సాధారణంగా తక్షణమే జరుగుతాయి. కానీ అరుదుగా అవి పూర్తయ్యేందుకు కాస్త ఎక్కువ సమయం తీసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో, మీ లోన్ రీపేమెంట్ యొక్క తుది స్టేటస్ కోసం దయచేసి కొన్ని గంటల పాటు వేచి చూసి, మీ PhonePe యాప్ లోని చరిత్ర విభాగాన్ని చెక్ చేయండి.
పెండింగ్ లోన్ రీపేమెంట్ విఫలమయ్యే పక్షంలో, డెబిట్ చేసిన డబ్బు మీకు రీఫండ్ చేయబడుతుంది. మీరు UPI ద్వారా పేమెంట్ చేసి ఉంటే, మీ డబ్బు 3 నుండి 5 రోజుల్లోపు మీకు రీఫండ్ చేయబడుతుంది. డెబిట్ మరియు క్రెడిట్ కార్డు పేమెంట్ల విషయంలో, మీ డబ్బు 7 నుండి 9 రోజుల్లో రీఫండ్ చేయబడుతుంది. అలాగే వాలెట్ మరియు గిఫ్ట్ కార్డు పేమెంట్లు చేసి ఉంటే, 24 గంటల్లో పూర్తవుతుంది.