లింక్ చేసిన PhonePe గిఫ్ట్ కార్డును రిడీం చేసుకోవడం ఎలా?

మీ PhonePe గిఫ్ట్ కార్డును మీరు లింక్ చేసిన వెంటనే, మీరు పేమెంట్ చేస్తున్న సమయంలో అది పేమెంట్ పద్ధతిగా తనంతతానుగా ఎంచుకోబడుతుంది.

వాలెట్లు లేదా గిఫ్ట్ రశీదుల బ్యాలెన్స్‌గా కూడా అది ప్రదర్శించబడుతుంది. పేమెంట్ స్క్రీన్‌లో  వివరాలను చూడండి ని ట్యాప్ చేసి, కోరుకున్న పేమెంట్ పద్ధతిని ఎంచుకోవడం ద్వారా లావాదేవీకి గిఫ్ట్ కార్డు బ్యాలెన్స్‌ను ఉపయోగించనివ్వకుండా చేసుకోవచ్చు.

ముఖ్య గమనిక: పేమెంట్ పద్ధతిగా PhonePe గిఫ్ట్ కార్డును ఎంచుకుంటే, లావాదేవీకి అవసరమైనంత గరిష్ఠ స్థాయి వరకు అందుబాటులో ఉన్న గిఫ్ట్ కార్డు బ్యాలెన్స్ పూర్తిగా ఉపయోగించబడుతుంది. కాబట్టి, మీరు ఒక నిర్ధిష్ఠ బ్యాలెన్స్ మొత్తాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలని ఎంచుకోలేరు. 

గమనిక: విధానపరంగా ప్రీపెయిడ్ పద్ధతిని నిషేధించిన చోట్ల లావాదేవీలకు PhonePe గిఫ్ట్ కార్డును ఉపయోగించడం అనుమతించబడదు. ఉదాహరణకు, వాలెట్ టాప్-అప్, మరో PhonePe గిఫ్ట్ కార్డును కొనుగోలు చేయడం తదితరాలు.

మీ PhonePe గిఫ్ట్ కార్డును లింక్ చేయడం లేదా రిడీం చేసుకోవడం వల్ల ఎదురయ్యే సమస్యలు గురించి మరింత తెలుసుకోండి