నేను కొనుగోలు చేసిన బంగారంపై ఏవైనా లాభాలు వచ్చాయా అని తెలుసుకోవడం ఎలా?
ప్రస్తుత బంగారం కొనుగోలు ధర ఆధారంగా లాకర్లో మీరు నిల్వ చేసిన బంగారం విలువ పెరిగితే, లాభం విలువ, దాని % పోర్ట్ ఫోలియో విలువ కింద పచ్చ రంగులో ప్రదర్శించబడుతుంది.
PhonePeలో మీరు బంగారం కొనుగోలు చేసిన సమయం నుండి బంగారం ధర తగ్గుముఖం పడితే, ఆ తేడా ఎరుపు రంగులో హైలైట్ చేయబడుతుంది.
ఉదాహరణకు,
మీరు 1.5295 గ్రాముల బంగారాన్ని గ్రాముకు ₹4,895.88 ధరతో (కొనుగోలు సమయంలో బంగారం ధర GST కాకుండా) కొనుగోలు చేస్తే, మీరు పెట్టుబడి పెట్టిన విలువ ₹7,488.25 (1.5295 గ్రాము x గ్రాముకు ₹4,895.88)
నేటి బంగారం తాజా కొనుగోలు ధర గ్రాముకు ₹4,918.78గా ఉంటే, మీ పోర్ట్ ఫోలియో విలువ ₹7,523.27 (గ్రాముకు ₹4,918.78 x 1.5295 గ్రాములు)గా ఉంటుంది. అలాగే మీ లాభాలు ₹35 (పోర్ట్ ఫోలియో విలువ - పెట్టుబడి విలువ = ₹7,523.27 - ₹7,488.25) గానూ, లాభం % 0.15% (లాభం/పెట్టుబడి విలువ x 100).
PhonePeలో మీ బంగారం బ్యాలెన్స్/పోర్ట్ ఫోలియో విలువను చెక్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.