బంగారాన్ని స్టోర్ చేసినందుకు గాను MMTC-PAMP,Safegold మరియు Caratlane నాకు ఏవైనా ఛార్జీలు విధిస్తాయా?
PhonePeలో మీరు బంగారాన్ని కొనుగోలు చేసిన తేదీ నుండి 5 ఏళ్ల వరకు అదనపు ఛార్జీలు ఏవీ విధించకుండా MMTC మీ బంగారాన్ని బ్యాంక్-గ్రేడ్ సురక్షిత డిజిటల్ లాకర్లో స్టోర్ చేస్తాయి. అయితే, 5 ఏళ్ల తర్వాత స్టోర్ మరియు కస్టడీ ఫీజు వసూలు చేయబడుతుంది. ఈ ఫీజు చెల్లించడం మీకు సమ్మతం కాకపోతే, ఆ బంగారాన్ని విక్రయించవచ్చు లేదా మీ వద్దకు డెలివరీ పొందవచ్చు.
PhonePeలో మీరు బంగారాన్ని కొనుగోలు చేసిన తేదీ నుండి 5 ఏళ్ల వరకు అదనపు ఛార్జీలు ఏవీ విధించకుండా Safegold మీ బంగారాన్ని బ్యాంక్-గ్రేడ్ సురక్షిత డిజిటల్ లాకర్లో స్టోర్ చేస్తాయి. ఒక్కో కస్టమర్ కు కొనుగోలు తేదీ నుండి గరిష్ఠంగా పదేళ్ల వరకు స్టోరేజ్ సమయం కేటాయించబడుతుంది. అయినప్పటికీ, ఐదేళ్ల తర్వాత స్టోరేజ్ మరియు కస్టడీ ఫీజును (Safegold ద్వారా ఏడాదికి 0.3%) వసూలు చేస్తుంది. ఈ ఫీజు చెల్లించడం మీకు సమ్మతం కాకపోతే, ఆ బంగారాన్ని విక్రయించవచ్చు లేదా మీ వద్దకు డెలివరీ పొందవచ్చు.
Caratlane మీ బంగారాన్ని 10 సంవత్సరాల పాటు ఎటువంటి ఫీజు లేకుండా సురక్షితమైన ఖజానాలో నిల్వ చేస్తుంది. ఈ వ్యవధి తర్వాత మీరు మీ డిజిటల్ బంగారాన్ని రిడీమ్ చేయాలి లేదా విక్రయించాలి.
PhonePeలో మీరు కొనే బంగారం కోసం గరిష్ఠంగా భద్రపరచుకునే కాలం గురించి మరింత తెలుసుకోండి.