వినియోగ నియమాలు

1. పరిచయం
1.1 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 నియమాలు, అలాగే ఈ చట్టం అమలుకు రూపొందిన నిబంధనల ప్రకారం ఈ డాక్యుమెంట్‌‌ను ఎలక్ట్రానిక్ రికార్డ్‌గా పరిగణించాలి. ఇది కంప్యూటర్ సిస్టమ్ ద్వారా జెనరేట్ అయింది. దీనికి ఎటువంటి ఫిజికల్ సంతకాలు (నేరుగా చేసిన సంతకాలు) గానీ, డిజిటల్ సంతకాలు గానీ అవసరం లేదు.
1.2 ఈ డాక్యుమెంట్‌, "ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తుల మార్గదర్శకాలు) నిబంధనలు, 2011"లోని నిబంధన 3(1)లో ఉన్న ప్రొవిజన్స్‌కు అనుగుణంగా పబ్లిష్‌ అయింది. నిర్దిష్ట ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేయడానికి లేదా వినియోగించడానికి సంబంధించిన నియమ, నిబంధనలను, గోప్యతా విధానాన్ని, వినియోగ నియమాలను ప్రచురించాలని నిబంధన 3(1) నిర్దేశిస్తోంది. 
1.3 ఈ వినియోగ నిబంధనలలోని Iవ భాగం, 2వ భాగాన్ని కలిపి సమిష్టిగా 'నిబంధనలు' అని రెఫర్ చేయబడతాయి. వీటిని ఎల్లప్పుడూ కలిపే చదవాలి.
1.4 ప్లాట్‌ఫామ్‌ను బ్రౌజ్ చేయడం ద్వారా లేదా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా, మీరు ఈ నియమాలతో పాటు వర్తించే ఏవైనా అదనపు నిబంధనలను జాగ్రత్తగా చదివి, వాటికి కట్టుబడి ఉంటామని గుర్తించటమే కాక, వాటికి అంగీకారం తెలుపుతున్నారు. మీరు ఈ నిబంధనలను పాటించని సందర్భంలో, ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేయకూడదు.


2. నిర్వచనాలు

2.1 ఈ నియమాల ఉద్దేశాన్ని సందర్భానుసారం అర్థం చేసుకోవడానికి, ఆ పదానికి ఉన్న అసలైన అర్థాన్ని కింద వివరించాము:

2.1.1 "కస్టమర్" అంటే ప్లాట్‌ఫామ్‌లో, CaratLane వద్ద డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేసే వ్యక్తి, (కింద నిర్వచించిన ప్రకారం), లేదా డిజిటల్ గోల్డ్‌ను తిరిగి CTPLకు విక్రయించే వ్యక్తి, లేదా CaratLane ఆభరణాల కొనుగోలు కోసం బ్యాలెన్స్ బదిలీకి అనుమతి ఇచ్చే వ్యక్తి అని అర్థం.
2.1.2 "కస్టమర్ అభ్యర్థన" అనేది ‘కస్టమర్  CaratLane డిజిటల్ గోల్డ్ బ్యాలెన్స్‌’కు సంబంధించి మీరు చేసిన కొనుగోలు అభ్యర్థనను, విక్రయ అభ్యర్థనను లేదా మార్పిడి అభ్యర్థనను సూచిస్తుంది.
2.1.3 “CaratLane డిజిటల్ గోల్డ్ ఖాతా సమాచారం” అంటే CaratLane డిజిటల్ గోల్డ్ ఖాతాను క్రియేట్ చేయడం కోసం మీరు ఇచ్చిన సమాచారం.
2.1.4 "CTPL ప్లాట్‌ఫామ్" అనేది www.caratlane.comలో CaratLane అందిస్తున్న, నిర్వహిస్తున్న వెబ్‌సైట్‌ను లేదా మొబైల్ అప్లికేషన్‌ను సూచిస్తుంది.
2.1.5 "CL డిజిటల్ గోల్డ్" అంటే CTPL అందిస్తున్న డిజిటల్ గోల్డ్ అని అర్ధం. ఈ డిజిటల్ గోల్డ్‌లోని ప్రతి యూనిట్‌లో 99.9% స్టాండర్డ్ 24 క్యారెట్ల బంగారం ఉంటుందని హామీ ఇస్తుంది.
2.1.6 "ఫోర్స్ మెజర్ ఈవెంట్" అంటే CaratLane మరియు/లేదా ప్లాట్‌ఫామ్ వారి సహేతుకమైన నియంత్రణలోని ఏదైనా సంఘటన. ఇందులోకి విద్రోహక చర్య, అగ్నిప్రమాదం, వరద, పేలుడు, దేవుని చర్య, ప్రజా అల్లకల్లోలం, సమ్మెలు, అన్ని రకాల లాకౌట్‌లు లేదా పారిశ్రామిక చర్యలు, అల్లర్లు, తిరుగుబాటు, యుద్ధం, ప్రభుత్వ చర్యలు, కంప్యూటర్ హ్యాకింగ్, పౌర అవాంతరాలు, కంప్యూటర్ డేటాను, స్టోరేజ్ పరికరాన్ని అనధికారికంగా యాక్సెస్ చేయడం, కంప్యూటర్ క్రాష్‌లు, కంప్యూటర్‌పై వైరస్ అటాక్‌లు, సెక్యూరిటీ & ఎన్‌క్రిప్షన్ ఉల్లంఘన, మహమ్మారి (ప్యాండమిక్) లేదా అంటువ్యాధి (ఎపిడమిక్), ప్లాట్‌ఫామ్ మరియు/లేదా CTPL నియంత్రణలో లేని ప్యాండమిక్‌తో పాటు ఏదైనా కారణం చేత ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌లు లేదా పరిమితులు వంటివి వస్తాయి.
2.1.7 "పేమెంట్ సాధనం" అనేది డబ్బు బదిలీ కోసం లేదా పేమెంట్ కోసం ఉపయోగించే ఎలక్ట్రానిక్ పేమెంట్ పద్ధతిని సూచిస్తుంది.
2.1.8 “వ్యక్తి” అంటే ఒక వ్యక్తి, ఒక కార్పొరేషన్, ఒక భాగస్వామి సంస్థ, ఒక జాయింట్ వెంచర్, ఒక ట్రస్ట్, లీగల్‌గా రిజిస్టర్ కాని ఒక ఆర్గనైజేషన్, ఏదైనా ఇతర చట్టపరమైన సంస్థ అని అర్థం.
2.1.9 "ప్లాట్‌ఫామ్" అంటే  PhonePe ప్రైవేట్ లిమిటెడ్ అందిస్తున్న మొబైల్ అప్లికేషన్ మరియు/లేదా వెబ్‌సైట్. ఇది, CL డిజిటల్ గోల్డ్ లావాదేవీలకు పేమెంట్లను జరపడానికి / ప్రాసెస్ చేయడానికి పేమెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌ను అందిస్తుంది.
2.1.10 "CaratLane గోల్డ్" అంటే 99.9% స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల బంగారం అని అర్థం. "CaratLane డిజిటల్ గోల్డ్" బ్రాండ్ పేరుతో CaratLane, ఈ బంగారాన్ని కస్టమర్‌కు అందిస్తుంది.
2.1.11 "CaratLane డిజిటల్ గోల్డ్ ఖాతా" అంటే ఈ నియమాలకు అనుగుణంగా మీరు ఈ ప్లాట్‌ఫామ్‌లో రూపొందించిన ఖాతా అని అర్థం.
2.1.12 "బదిలీ" అనే పదం, CaratLane డిజిటల్ గోల్డ్ ఖాతా నుండి మరొక గోల్డ్ ఖాతాకు బంగారాన్ని బదిలీ చేసే సదుపాయాన్ని సూచిస్తుంది.
2.1.13 “CTPL భాగస్వామి” అనే పదబంధం PhonePe Pvt. Ltd.ను (PhonePeని) సూచిస్తుంది. ఈ PhonePe ఎంటిటీ, ప్లాట్‌ఫామ్‌లో CTPLకు పేమెంట్ సేవలను అందిస్తుంది. అలాగే CTPL ఆఫర్ చేసే బంగారానికి సంబంధించిన పేమెంట్లను అందుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.
సెక్షన్ 2.1లో నిర్వచించిన నియమాలతో పాటు, ఇక్కడ ఉపయోగించిన అదనపు పదాలకు, ఇకపై వాటికి సంబంధించిన విభాగాలలోనే, వాటి అర్థాలకు వివరణ ఉంటుంది.

3. CTPL అందిస్తున్న  సేవల యొక్క నియమ, నిబంధనలు

3.1. CaratLane ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ అనేది కంపెనీల చట్టం, 1956 కింద స్థాపితమైన సంస్థ. దీని రిజిస్టర్డ్ ఆఫీస్: 727, అన్నా సలై, పఠారి రోడ్ థౌజండ్ లైట్స్, చెన్నై, తమిళనాడు, భారత్ - 600006 అడ్రస్‌లో ఉంది. CTPL ప్లాట్‌ఫామ్, CaratLane భాగస్వామి ఆపరేట్ చేస్తున్న ప్లాట్‌ఫామ్‌లో కస్టమర్లకు బంగారాన్ని విక్రయించడం, కొన్న బంగారాన్ని సురక్షితంగా ఉంచడం/వాల్ట్‌లో భద్రపర్చడం, డెలివరీ చేయడం/ఫుల్‌ఫిల్‌మెంట్‌ చేయడంతో పాటు సంబంధిత సేవలను ("CTPL") అందిస్తుంది.


3.2. CTPL, తన బ్రాండ్ అయిన “CL డిజిటల్ గోల్డ్” ద్వారా బంగారాన్ని కొనడానికి మరియు/లేదా అమ్మడానికి అవకాశం కల్పిస్తోంది. ఈ సేవలను CTPL అందిస్తోంది. CTPL భాగస్వామి బాధ్యత, కేవలం తన ప్లాట్‌ఫామ్‌లో CTPL సేవలకు సంబంధించిన లావాదేవీలను జరుపుకునేందుకు, చెల్లింపులను కలెక్ట్ చేసుకునేందుకు అవకాశం కల్పించడానికే పరిమితం. అలాగే CTPLతో విడిగా ఒప్పందాలు కుదుర్చుకున్న మధ్యవర్తులతో (అంటే అడ్మినిస్ట్రేటర్‌తో, వాల్ట్ కీపర్‌తో) కలిసి CTPL అందించే సేవలకు సంబంధించిన ఏదైనా లావాదేవీకి(లకు) ఈ నిబంధన వర్తిస్తుంది.

3.3. బంగారానికి సంబంధించి, కస్టమర్ ఈ నియమాలకు కట్టుబడి ఉండాలి. ప్లాట్‌ఫామ్‌లోని ఏవైనా ఇతర నియమ, నిబంధనలకు అదనంగా ఈ నియమాలు వర్తిస్తాయని స్పష్టంగా తెలియజేస్తున్నాము. కస్టమర్‌లు, ఇక్కడి సేవలను వినియోగించుకునే ముందు ఈ నియమాలను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలని సూచిస్తున్నాము.

3.4.  CTPL మరియు / లేదా CTPL భాగస్వామి, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ వ్యక్తికి అయినా CTPL సేవలకు సంబంధించి పూర్తి చేసిన ఏవైనా లావాదేవీలపై ఏ రూపంలోనైనా గ్యారంటీ రాబడి అనే హామీ ఇవ్వరు. కస్టమర్‌గా (ఇకపై "మీరు" అని పిలుస్తాము, దానికి తగినట్లుగా "మీ" అనే పదాన్ని కూడా వినియోగిస్తాము) ఈ నియమాలకు అనుగుణంగా ఏదైనా లావాదేవీలను చేసే ముందు వాటిపై శ్రద్ధగా, అర్థవంతమైన విశ్లేషణలు చేసి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా మీపైనే ఉంది. ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి మీరు చేసే కొనుగోలుకు లేదా ఇతర నిర్ణయాలకు CTPL మరియు/లేదా CTPL భాగస్వామి, అలానే CTPL అధికారులు, డైరెక్టర్‌లు, ఉద్యోగులు, ఏజెంట్‌లు, అనుబంధ సంస్థలకు ఎటువంటి బాధ్యత ఉండదని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు.

3.5. CTPL సేవలు, CaratLane డిజిటల్ గోల్డ్ ఖాతాను క్రియేట్ చేసిన తేదీ నుండి ప్రారంభమయ్యే కాల వ్యవధిలో అందుతాయి.

3.6. సేవలు అందుతున్నాయని, అలానే “ఉన్నది ఉన్నట్లుగా” అనే ప్రాతిపదికన సేవలు అందుబాటులో ఉంటాయని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌లో లోపాలు, పొరపాట్లు, తప్పిదాలు ఉండే/దొర్లే అవకాశం ఉంది. అవి మీ పరికరం మరియు/లేదా ప్లాట్‌ఫామ్‌కు కనెక్ట్ చేయడానికి మీరు ఉపయోగించే ఏదైనా పరికరం, అలానే పైన పేర్కొన్న పరికరాలకు కనెక్ట్ చేసిన పెరిఫెరల్స్‌ (వీటిలో సర్వర్లు, కంప్యూటర్లతో పాటు మరికొన్ని కూడా ఉండవచ్చు) విఫలం అవ్వడానికి, పాడవ్వడానికి లేదా దానిలోని డేటా లాస్‌కు మరియు/లేదా సమాచారం నష్టానికి కారణం కావచ్చు. కాబట్టి ప్లాట్‌ఫామ్‌ను, అందులోని సేవలను ఉపయోగించడం వల్ల కలిగే రిస్క్‌లకు, సంబంధిత ఖర్చులకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాము. మీ పరికరాన్ని వినియోగించడం వల్ల తలెత్తే ఏవైనా ఖర్చులు; ఎక్విప్‌మెంట్‌కు, సాఫ్ట్‌వేర్‌కు, లేదా డేటాకు కలిగే ఏదైనా డ్యామేజ్ కూడా ఇందులో ఉంటాయి. ఇవే కాకుండా ఇతరత్రా రిస్క్‌లు కూడా ఉండవచ్చు.

3.7. మీరు సరకులు, సేవల పన్ను చట్టం(GST), 2017 కింద రిజిస్టర్ చేసుకోలేదని, CTPLతో మీరు సంబంధాలు కొనసాగించే విషయంలో, ఒకవేళ మీరు సరకులు, సేవల పన్ను చట్టం, 2017 కింద రిజిస్టర్ చేసుకున్నట్లయితే, ఈ విషయాన్ని మీరు CTPLకు వెంటనే తెలియచేయాల్సి ఉంటుందని, అలానే ఏదైనా సమాచారాన్ని మిమ్మల్ని అభ్యర్థించినట్లయితే, ఆ సంబంధిత సమాచారాన్ని, పత్రాలను మీరు అందిస్తారని నిర్ధారిస్తున్నారు.

3.8. CaratLane అందించే డిజిటల్ గోల్డ్‌కు సంబంధించిన సేవలను ఆకృతి స్టార్, MIDC సెంట్రల్ రోడ్, ముంబై, ముంబై సబర్బన్, మహారాష్ట్ర, 400093 వారు అందిస్తున్నట్లుగా కస్టమర్‌కు సమాచారాన్ని అందించాము.

4. అడ్మినిస్ట్రేటర్, మధ్యవర్తులు, బంగారం భద్రతా ఏర్పాట్లు


4.1. మధ్యవర్తుల నియామకం

4.1.1. CTPL మీకు సేవలను అందించే విషయంలో సహాయం పొందేందుకు థర్డ్ పార్టీ సంస్థలతో CTPL ఒప్పందాలను కుదుర్చుకుంటుంది. 
"మధ్యవర్తులు" అనే పదం అడ్మినిస్ట్రేటర్‌ను, వాల్ట్ కీపర్‌ను సూచిస్తుంది. వీరి‌తో పాటు (సందర్భాన్ని బట్టి) CTPL లేదా అడ్మినిస్ట్రేటర్ నియమించిన ఎవరైనా ఒక వ్యక్తిని లేదా అందరు వ్యక్తులను కూడా సూచిస్తుంది. ఒక కస్టమర్‌గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు (ఇందుకోసం విజయవంతంగా డబ్బులు చెల్లించనప్పుడు), ఈ నియమాలకు అనుగుణంగా కస్టమర్‌గా మీరు చేసిన అభ్యర్థనను పూర్తి చేసే దాకా CTPL లేదా అడ్మినిస్ట్రేటర్ నియమించిన వారు మధ్యవర్తులుగా ఉంటారు. మీ తరపున అటువంటి మధ్యవర్తులను CTPL లేదా అడ్మినిస్ట్రేటర్ (సందర్భానుసారం) నియమించడానికి మీరు స్పష్టంగా సమ్మతిని తెలియచేస్తున్నారు.

4.1.2. ఈ నియమాలకు అనుగుణంగా మీ కస్టమర్ ఆర్డర్‌లు/కస్టమర్ అభ్యర్థనలు సక్రమంగా పూర్తి అవుతున్నాయని నిర్ధారించుకోవడం కోసం ఈ మధ్యవర్తులను నియమించారనే విషయాన్ని మీరు గుర్తించి, అర్థం చేసుకున్నారు. ఈ మధ్యవర్తుల అపాయింట్‌మెంట్‌తో పాటు వాటికి/వారికి సంబంధించిన సేవల కోసం నిర్దిష్ట పేమెంట్లు చేయాల్సి ఉంటుందని కూడా మీరు అంగీకరిస్తున్నారు. ఈ నియమాలలో ఆ పేమెంట్లు గురించి సూచించకపోతే వాటిని మీ తరఫున CTPL భరిస్తుంది.

4.2. అడ్మినిస్ట్రేటర్ అపాయింట్‌మెంట్

4.2.1. మీ కస్టమర్ ఆర్డర్‌లు/కస్టమర్ అభ్యర్థనలు ఏ పరిస్థితుల్లో అయినా పూర్తవుతాయని నిర్ధారించుకోవడానికి, మీ CL డిజిటల్ గోల్డ్ బ్యాలెన్స్‌కు సంబంధించి మీ తరఫున తగు చర్యలు తీసుకునేందుకు అడ్మినిస్ట్రేటర్‌కు అధికారం ఉంటుందని మీరు ఇందుమూలంగా గుర్తించి, అంగీకరిస్తున్నారు.

4.2.2. ఈ నియమాలను మీరు అంగీకరించడం ద్వారా, అడ్మినిస్ట్రేటర్‌ ఏర్పాటు నియమాలను కూడా (అన్నింటినీ కలిపి, "అడ్మినిస్ట్రేటర్ ఒప్పందాలు"గా పిలుస్తారు) అంగీకరిస్తూ మీ సమ్మతిని తెలుపుతున్నారు. "నేను అంగీకరిస్తున్నాను"పై క్లిక్ చేయడం ద్వారా, మీరు అడ్మినిస్ట్రేటర్ ఒప్పందాలను (ఆ తేదీన) యాక్సెప్ట్ చేస్తున్న ఒరిజినల్ పార్టీగా మీ పేరును చేర్చటమే కాక, అటువంటి ప్రతి అడ్మినిస్ట్రేటర్ ఒప్పందాన్ని అమలు చేయడానికి సమ్మతిని తెలుపుతున్నారు; అలానే అడ్మినిస్ట్రేటర్ ఒప్పందాలలోని అన్ని నియమాలకు, షరతులకు కట్టుబడి ఉండేందుకు అంగీకరిస్తున్నారు.
4.2.3. ఏవైనా ఖర్చులను లేదా ఛార్జీలను ఎవరైనా మధ్యవర్తులకు చెల్లించాల్సి ఉన్నట్లయితే లేదా ఏదైనా కారణం వల్ల మీ కస్టమర్ ఆర్డర్‌లు/కస్టమర్ అభ్యర్థనలను డెలివరీ చేసే వరకు లేదా వాటిని ఫుల్‌ఫిల్‌మెంట్‌ చేసే వరకు అయ్యే ఖర్చుల కోసం, (ఈ ఖర్చులను లేదా ఛార్జీలను CTPL, ఏ కారణం చేతనైనా చెల్లించలేని పరిస్థితులు కూడా ఇందులోకి వస్తాయి), అలాగే మీ కస్టమర్ ఆర్డర్‌లు/కస్టమర్ అభ్యర్థనలను పూర్తి చేయడంపై ప్రతికూల ప్రభావం పడినప్పుడు లేదా పూర్తిగా ఆటంకం ఏర్పడినప్పుడు, కస్టమర్ గోల్డ్‌లో కొంత భాగాన్ని విక్రయించడానికి అడ్మినిస్ట్రేటర్‌కు అర్హత ఉంటుంది. అడ్మినిస్ట్రేటర్ ఒప్పందాలతో కలిపి ఈ నియమాలకు అనుగుణంగా అవసరమైనటువంటి బకాయి ఖర్చులను లేదా ఛార్జీలను అడ్మినిస్ట్రేటర్‌ చెల్లిస్తారు. మీకు మరియు/లేదా కస్టమర్ CLకు చెల్లించాల్సిన, డెలివరీ చేయాల్సిన (సందర్భానుసారంగా) డిజిటల్ గోల్డ్ బ్యాలెన్స్ మొత్తాలను, పైన పేర్కొన్న ఛార్జీలను వసూలు చేసుకున్న తర్వాత, అడ్మినిస్ట్రేటర్ ఒప్పందాలతో కలిపి ఈ నియమాలకు అనుగుణంగా సెటిల్ చేస్తాము.
4.2.4.  ఈ నియమాల ద్వారా, మీ ప్రయోజనాలకు తగిన భద్రత ఉందని నిర్ధారించుకోవడం కోసం, మీ తరఫున పని చేయడానికి మీరు, అడ్మినిస్ట్రేటర్‌కు అధికారం ఇస్తున్నారు.
4.3. బంగారాన్ని భద్రపరచడం/వాల్ట్‌లో దాయడం
4.3.1 కస్టమర్ ఆర్డర్‌ ప్రకారం మీరు కొనుగోలు చేసిన CL డిజిటల్ బంగారాన్ని 48 గంటలలోపు కొనుగోలు చేసి మీ తరపున (“వాల్ట్ కీపర్”) వాల్ట్‌లోని సంరక్షకుని వద్ద నిల్వ చేయాలి.
4.3.2. మీరు ఇక్కడ పేర్కొన్న విషయాలకు సమ్మతిని తెలుపుతున్నారు (i) కొనుగోలు చేసిన బంగారాన్ని సురక్షితంగా ఉంచడానికి వాల్ట్ కీపర్‌ను నియమించేందుకు మీరు అధికారం ఇస్తున్నారు; అలానే (ii) మీరు కొనుగోలు చేసిన ఆ CL డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులను (ఇక్కడ ఉత్పత్తులు అంటే సందర్భాన్ని బట్టి బులియన్ కావచ్చు, లేదా నాణేలు కావచ్చు. అయితే ఈ రెండు రకాలు మాత్రమే కాకుండా ఇతరత్రా కూడా ఉండొచ్చు) మీ తరపున (“కస్టమర్ గోల్డ్”) సురక్షిత వాల్ట్‌లో నిల్వ చేయడానికి CTPLకు అనుమతి ఇస్తున్నారు. కస్టమర్ ఆర్డర్‌కు సంబంధించిన మీ బంగారం కొనుగోలు పూర్తయినట్లుగా, దానికి సంబంధించిన టైటిల్, కొనుగోలుదారు మీదకు మారినట్లుగా పరిగణించబడుతుంది. అలా ధృవీకరించుకున్న తర్వాత లేదా వర్తించే చట్టాలకు లోబడి, ఈ నిబంధనలకు అనుగుణంగా CTPL ఫైనల్ ఇన్‌వాయిస్‌ను జారీ చేసిన తర్వాత, వాల్ట్‌ కీపర్ ఉన్న వాల్ట్‌లో కస్టమర్ బంగారంలోని సంబంధిత భాగాన్ని మీ తరఫున నిల్వ చేస్తామని ఇక్కడ స్పష్టం చేశాము. 
4.3.3. ఆ వాల్ట్‌లో నిల్వ చేసిన కస్టమర్ బంగారానికి తగిన రక్షణ కల్పిస్తున్నామని వాల్ట్ కీపర్ నిర్ధారించడానికి అవసరమైన, కావాల్సిన మేరకు బీమా పాలసీ/పాలసీలను పొందారు. వీటిని పొందడానికి అయ్యే ఖర్చును వాల్ట్ కీపర్ భరిస్తారు. అటువంటి బీమా పాలసీకి/పాలసీలకు అనుగుణంగా, వాల్ట్‌లో నిల్వ చేసిన కస్టమర్ గోల్డ్‌కు ఏదైనా నష్టం లేదా హాని జరిగితే, బీమా పాలసీ/పాలసీల కింద మీ లబ్ధిదారుడిగా వ్యవహరించడానికి, మీ ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన చర్యలు అన్నింటినీ తీసుకోవడానికి అడ్మినిస్ట్రేటర్‌కు మీరు మరింత అధికారం ఇస్తారు.
4.3.4. వాల్ట్ కీపర్ తీసుకున్న బీమా పాలసీ/పాలసీలు గ్లోబల్ ఇండస్ట్రీ ప్రాక్టీసులకు అనుగుణంగా ఉంటాయి. అగ్ని ప్రమాదం, మెరుపు, దొంగతనం, తుఫాను, భూకంపం, వరద, మొదలైన ఘటనల వల్ల కలిగే నష్టాలను కవర్ చేస్తాయి. అయితే యుద్ధం, విప్లవం, యుద్ధ ఆయుధాల వైఫల్యం, న్యూక్లియర్ రేడియేషన్ మొదలైన  ఘటనల వల్ల కలిగే నష్టాలను కవర్ చేయవు. ఏదేమైనా, వాల్ట్ కీపర్ అవసరమైన బీమా పాలసీ/పాలసీలు తీసుకున్నప్పటికీ, అటువంటి బీమా పాలసీ/పాలసీలో కవర్ చేయని ఘటన సంభవించినట్లయితే, కస్టమర్ గోల్డ్ ప్రమాదంలో పడవచ్చు.
5. CL డిజిటల్ గోల్డ్ బ్యాలెన్స్ బదిలీ

5.1. మీ బంగారాన్ని మరొక గ్రహీతకు, "గిఫ్ట్" ఫీచర్  ద్వారా బదిలీ చేసే అవకాశాన్ని CTPL కల్పిస్తుంది. లేదా ప్లాట్‌ఫామ్‌లో కొనుగోలు చేసిన మీ CL డిజిటల్ గోల్డ్ బ్యాలెన్స్‌ను బదిలీ చేసి, దానికి బదులుగా మరొక ఉత్పత్తిని తీసుకునే ప్రక్రియలో భాగంగా ఆభరణాలు పొందే అవకాశాన్ని కూడా CTPL కల్పిస్తుంది.

5.2. ప్లాట్‌ఫామ్‌లో కొనుగోలు చేసిన మీ CL డిజిటల్ గోల్డ్ బ్యాలెన్స్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం లేదా ఆభరణాల కోసం మార్చుకోవడం వంటి ప్రక్రియ కేవలం CaratLane ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (CaratLane)‌ అనుమతి ఉన్న రిటైల్ దుకాణాలలో లేదా ప్లాట్‌ఫామ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టంగా వివరిస్తున్నాము.

5.3. అటువంటి బంగారాన్ని మీ నుండి మరొక గ్రహీతకు బదిలీ చేయడం అనేది CTPL అనుసరించే పద్ధతిలో లేదా ప్రక్రియ ద్వారా అమలు అయినప్పుడు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.


5.4. గోల్డ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం:
5.4.1. కస్టమర్ కొనుగోలు చేసిన బంగారాన్ని తనకు నచ్చిన వ్యక్తికి గిఫ్ట్‌గా ఇచ్చే అవకాశాన్ని  CTPL కల్పిస్తుంది. దీన్ని "గిఫ్ట్ గోల్డ్" ఫీచర్ ("CL డిజిటల్ గోల్డ్ గిఫ్ట్") రూపంలో అందిస్తుంది.
5.4.2. CL డిజిటల్ గోల్డ్ బహుమతిని ఉద్దేశించిన గ్రహీత స్వీకరించడానికి లేదా తిరస్కరించడానికి లేదా ఉద్దేశించిన గ్రహీతకు సంబంధించి కస్టమర్ పేర్కొన్న మొబైల్ నంబర్ లేదా ఇతర గుర్తింపు సమాచారం ఖచ్చితత్వాన్ని ధృవీకరించడానికి CTPL గానీ CTPL భాగస్వామి గానీ బాధ్యత వహించదు.
5.4.3. CL డిజిటల్ గోల్డ్ గిఫ్ట్‌లను ఫైనల్‌గా భావించాలి. కస్టమర్ చేసిన ఏదైనా తప్పిదం కారణంగా అనుకోని గ్రహీతకు గిఫ్ట్ డెలివరీ అయితే, ఆ లావాదేవీని సవరించడం, మార్చడం లేదా వెనక్కి తీసుకురావడానికి CTPL బాధ్యత వహించదు.
5.4.4. అయితే, నిర్దేశిత గ్రహీత, నిర్ణీత సమయంలోగా CL డిజిటల్ గోల్డ్‌ను స్వీకరించనట్లయితే, కస్టమర్ డిజిటల్ గోల్డ్ బ్యాలెన్స్, తిరిగి కస్టమర్ CaratLane డిజిటల్ గోల్డ్ అకౌంట్‌కు చేరుకుంటుంది.

5.5. ఆభరణాలకు బదులుగా మార్పిడీ
5.5.1. కస్టమర్లు తమ CL డిజిటల్ గోల్డ్ బ్యాలెన్స్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా CTPL ద్వారా, అంటే CaratLane అనుమతి ఉన్న రిటైల్ స్టోర్‌లు లేదా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మాత్రమే ఆభరణాల కోసం మార్పిడీ చేసుకోగలరు. "ఆభరణాల మార్పిడీ" ఫీచర్‌లో భాగంగా ఈ సౌలభ్యం అందుబాటులో ఉంటుంది.
5.5.2.  CTPL అందిస్తున్న ప్లాట్‌ఫామ్‌లో వివరించిన విధానాన్ని అనుసరించడం ద్వారా కస్టమర్‌లు ఈ ప్రక్రియను ఎంచుకోవచ్చు. CTPLకు కస్టమర్ ఇచ్చే స్పష్టమైన సూచనల మేరకు మాత్రమే లావాదేవీని ప్రారంభిస్తారు.
5.5.3. కస్టమర్‌లు లావాదేవీని ధృవీకరించడంతో పాటు, CL డిజిటల్ గోల్డ్ బ్యాలెన్స్‌ను CTPLకు బదిలీ చేయాలనుకుంటున్నారు అన్నది నిర్ధారించుకోవడానికి CTPL వారికి OTPని పంపిస్తుంది.  CTPLకు ఆ OTPని కమ్యూనికేట్ చేయడం ద్వారా, మీరు ఎంచుకున్న ఆభరణాల ప్రోడక్ట్‌ కొనుగోలుకు అవసరమైన మేరకు మీ డిజిటల్ గోల్డ్ అకౌంట్ బ్యాలెన్స్‌ను డెబిట్ చేయడానికి CTPLకు అనుమతిచ్చేందుకు మీరు అంగీకరిస్తారు.
5.5.4. ఎంచుకున్న ఆభరణాల ప్రోడక్ట్‌కు ఏవైనా అదనపు ఛార్జీలు పడితే వాటిని కస్టమర్ భరించాలి.
5.5.5. CaratLane రిటైల్ స్టోర్‌లలో లేదా ప్లాట్‌ఫామ్‌లలో వర్తించే బంగారం ధర, ఆభరణాల కొనుగోలుకు వర్తిస్తుందని మీరు గమనించాలి. దీంతో పాటు, ఆభరణాల కొనుగోలుకు సంబంధించి ఇతరత్రా కొనుగోలు నియమాలను, షరతులను కూడా CTPL వర్తింపచేయవచ్చు.
5.5.6. ఒకసారి లావాదేవీ సంపూర్ణంగా పూర్తయిందని భావించి, లావాదేవీకి సంబంధించిన ఇన్‌వాయిస్‌ను జనరేట్ చేసిన తర్వాత, CTPL ప్రత్యేకంగా ఇచ్చిన అనుమతి ఏదైనా ఉంటే తప్ప, కస్టమర్‌లు ఆ లావాదేవీని రద్దు చేయలేరు లేదా రీఫండ్ కావాలని అభ్యర్థించలేరు.
5.5.7. CTPL తన సొంత విచక్షణాధికారం మేరకు ఆభరణాల కొనుగోలుకు అందిస్తున్న డిస్కౌంట్‌లను పొడిగించవచ్చు.
5.5.8. ఒకసారి లావాదేవీ సంపూర్ణంగా పూర్తయిందని భావించినట్లయితే, ఎంచుకున్న ఆభరణాల ప్రోడక్ట్‌కు సంబంధించి ఏవైనా వివాదాలు తలెత్తితే వాటిని CTPL, కస్టమర్‌ నేరుగా పరిష్కరించుకోవాలి.

6. గోల్డ్ నిల్వ చేయడం
మీ కస్టమర్ గోల్డ్‌ను 10 సంవత్సరాల పాటు మీరు ఉచితంగా నిల్వ చేసుకోవచ్చు, లేదా CTPL తన సొంత అభీష్టానుసారం ప్రత్యేకంగా నిర్దేశించిన కాలం పాటు (“ఉచిత నిల్వ కాలం”) నిల్వ చేసుకోవచ్చు. అయితే ఈ నిర్దిష్ట కాలాన్ని CTPL ప్లాట్‌ఫామ్‌ ద్వారా కస్టమర్‌లకు ఎప్పటికప్పుడు తెలియజేయబడుతుంది.
6.1. డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసినప్పటి నుండి నిర్దిష్ట గరిష్ట వ్యవధిలోగా అప్పటిదాకా ఉన్న ప్రతి డిజిటల్ గోల్డ్ యూనిట్ బంగారాన్ని డెలివరీ చేయించుకోవాలి. అయితే, ఆ గరిష్ఠ వ్యవధిని ప్లాట్‌ఫామ్‌లో ఎప్పటికప్పుడు CTPL ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఆ గరిష్ఠ వ్యవధిని 10 సంవత్సరాలకు పరిమితం చేసింది. దీనికి సంబంధించిన నియమాలను, షరతులను కాలానుగుణంగా సవరించడానికి CTPLకు హక్కు ఉంది. అంతేకాక తదనుగుణంగా అవి అమలులోకి వస్తాయి. 
6.2. మీకు గోల్డ్‌ను డెలివరీ చేసేందుకు ప్లాట్‌ఫామ్‌లోని CTPL మరియు/లేదా CTPL భాగస్వామి పేర్కొన్న విధంగా చెల్లుబాటు అయ్యే చిరునామాను మరియు/లేదా ఏదైనా ఇతర పత్రాలు/సమాచారం/ బయోమెట్రిక్ గుర్తింపును మీరు అందించాలి.
6.3. గరిష్ట నిల్వ వ్యవధిలో ఎప్పుడైనా మీరు ఆ చిరునామాను అందించవచ్చు. గరిష్ఠ నిల్వ వ్యవధిలో మీరు చెల్లుబాటు అయ్యే చిరునామా ఏదీ ఇవ్వనట్లయితే, గరిష్ట నిల్వ వ్యవధి ముగిసే తేదీ నుండి 1 సంవత్సరం పాటు (ఈ కాలాన్ని "గ్రేస్ పీరియడ్" అని అంటారు) మీరు గతంలో ఇచ్చిన సంప్రదింపు సమాచారాన్ని ఉపయోగించి (i) CaratLane బ్యాలెన్స్‌ను బట్టి మీకు డిజిటల్ బంగారాన్ని డెలివరీ చెయ్యాల్సిన చిరునామా తెలుసుకునేందుకు లేదా (ii) కస్టమర్ బంగారాన్ని అమ్మడం ద్వారా వచ్చిన సొమ్మును డిపాజిట్ చెయ్యాల్సిన అకౌంట్ వివరాలు తెలుసుకునేందుకు CTPL మరియు/లేదా CTPL భాగస్వామి కనీసం ఒక్కసారైనా ప్రయత్నిస్తారు 
6.4. మీరు అందించిన సంప్రదింపు సమాచారాన్ని ఉపయోగించి, వర్తించే గ్రేస్ వ్యవధిలోగా CTPL మరియు/లేదా CTPL భాగస్వామి మిమ్మల్ని సంప్రదించకపోయినా లేదా గ్రేస్ పీరియడ్‌లో మీరు చిరునామా తెలపడంలో విఫలమైతే:
(a) ఏదైనా కారణాన్ని (అటువంటి బంగారాన్ని డెలివరీ చేయడానికి మీరు ఎటువంటి చిరునామాను అందించని కారణంతో సహా) తెలిపి వివాదంలో ఉన్న గోల్డ్‌ డెలివరీని పొందండి; లేదా
(b) ఆ కస్టమర్ గోల్డ్ అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని డిపాజిట్ చెయ్యడం కోసం చెల్లుబాటు అయ్యే బ్యాంక్ అకౌంట్ వివరాలను అందించండి;
వివాదంలో ఉన్న కస్టమర్ గోల్డ్‌కు వర్తించే గ్రేస్ పీరియడ్ గడువు ముగిసిన తర్వాత, CTPL ఆ కస్టమర్ గోల్డ్‌ను CaratLane నుండి అప్పటి వర్తించే ధర ఆధారంగా కొనుగోలు చేస్తుంది. ఈ ధర, కస్టమర్‌ల నుండి డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేసేటప్పుడు ప్లాట్‌ఫామ్‌లో ప్రదర్శించే “ప్రస్తుత ధర”గా ఉంటుంది. ఆ తర్వాత CTPL ఆ గోల్డ్‌ను విక్రయిస్తుంది.
6.5. ఉచిత నిల్వ వ్యవధి ముగిసిన తర్వాత, ఆ బంగారాన్ని నిల్వ చేయడానికి CTPLకు ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అందుకే, ఆ గోల్డ్‌ను అమ్మగా వచ్చిన ఆదాయం (“తుది విక్రయ ఆదాయం”) నుంచి ఆ ఛార్జీలను డిడక్ట్ చేసుకుంటారు. ఆపై మిగిలిన మొత్తాన్ని సంతకం చేసే అధికారం ఉన్న ఒక వ్యక్తి / అడ్మినిస్ట్రేటర్ నిర్వహించే బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.
6.6. వర్తించే గ్రేస్ పీరియడ్ గడువు ముగిసిన తేదీ నుండి 3 సంవత్సరాల వ్యవధిలో (ఆ పీరియడ్‌ను “ఫైనల్ క్లెయిమ్ పీరియడ్” అని అంటారు) CTPLకు, CTPL భాగస్వామికి లేదా అడ్మినిస్ట్రేటర్‌కు మీరు తుది విక్రయ ఆదాయాలను క్లెయిమ్ చేస్తున్నామని తెలియచేయాలి, అప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఆ తుది విక్రయ ఆదాయాన్ని మీరు అందించిన బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయడానికి తగిన సూచనలను జారీ చేస్తారు.
6.7. తుది విక్రయ ఆదాయాన్ని క్లెయిమ్ చేయడానికి మీరు చెల్లుబాటు అయ్యే బ్యాంక్ ఖాతా వివరాలను అందించాల్సి ఉంటుందని, ఆ వివరాలు లేకపోతే తుది విక్రయ ఆదాయాలు బదిలీ చేయరని దయచేసి గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తుది విక్రయ ఆదాయాన్ని మీకు నగదు రూపంలో చెల్లించరు.
6.8. ఒకవేళ మీరు ఫైనల్ క్లెయిమ్ పీరియడ్ లోపు మీ తుది విక్రయ ఆదాయాన్ని క్లెయిమ్ చేయని పక్షంలో, గ్రేస్ పీరియడ్ గడువు ముగిసే లోపు ఎప్పుడైనా తుది విక్రయ ఆదాయాన్ని  ప్రధానమంత్రి సహాయ నిధికి లేదా దీన్ని పంపించాలని మీరు నిర్దేశించిన ఇతర నిధికి బదిలీ చేస్తారు.

7. అనూహ్యంగా సంభవించే విపత్తు
కార్మిక వివాదాలు, సమ్మెలు, దేవుని చర్యలు, వరదలు, మెరుపులు, తీవ్రమైన వాతావరణం, మెటీరియల్స్ కొరత, కోటా పద్ధతిని అమలు చేయడం, ఏదైనా వైరస్‌ వ్యాప్తి, మహమ్మారి (ప్యాండమిక్), ప్రభుత్వం విధించే తప్పనిసరి లాక్‌డౌన్, ట్రోజన్ వైరస్ లేదా ఇతర విఘాతం కలిగించే మెకానిజమ్‌లు, ప్లాట్‌ఫామ్ హ్యాకింగ్ లేదా అక్రమ వినియోగం, యుటిలిటీ లేదా కమ్యూనికేషన్ వైఫల్యాలు, భూకంపాలు, యుద్ధం, విప్లవం, తీవ్రవాద చర్యలు, పౌర కల్లోలం, ప్రజా శత్రువుల చర్యలు, దిగ్బంధనం, నిషేధం లేదా ఏదైనా చట్టం, ఆర్డర్, ప్రభుత్వ ప్రకటన, నియంత్రణ, ఆర్డినెన్స్, ఏదైనా ప్రభుత్వం లేదా ఏదైనా న్యాయపరమైన అధికారి లేదా అటువంటి ప్రభుత్వ ప్రతినిధి చట్టపరమైన ప్రభావంతో కూడిన డిమాండ్ లేదా ఆవశ్యకత, అంటువ్యాధి (ఎపిడమిక్), మహమ్మారి (ప్యాండమిక్), ప్రభుత్వం విధించిన వ్యాపారాల షట్‌డౌన్ లేదా లాక్‌డౌన్‌లు, లేదా ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే ఏదైనా పరికరం విఫలం అవ్వడం, లేదా CTPL మరియు/లేదా CTPL భాగస్వామి సహేతుకమైన నియంత్రణకు మించిన, సహేతుకమైన జాగ్రత్తలతో నిరోధించలేని, ఈ విభాగంలో సూచించిన వాటికి సారూప్యమైన లేదా భిన్నమైన ఏదైనా ఇతర చర్యల  కారణంగా, ఈ నిబంధనల ప్రకారం పనితీరు నిరోధానికి గురైనా, పరిమితంగా అందుతున్నా, ఆలస్యం అయినా లేదా జోక్యం చేసుకున్నప్పుడు, CTPL మరియు/లేదా CTPL భాగస్వామిని ఈ తరహా ఫోర్స్ మెజర్‌ ఈవెంట్ జరిగిన కాలవ్యవధిలో, అలానే ఆ సమయంలో బాధ్యులుగా పరిగణించలేరు. అలానే ఏ విధంగానూ, ఇక్కడ ప్రస్తావించిన బాధ్యతలను ఉల్లంఘించినట్లుగా చూడరాదు.

8. CTPL అందిస్తున్న సేవల రద్దు
8.1. ఈ నిబంధనలలో దేనినైనా ఉల్లంఘించినందుకు లేదా ‘కస్టమర్ ఈవెంట్ ఆఫ్ డిఫాల్ట్‌’ సందర్భంలో లేదా ప్రైవసీ పాలసీ ఉల్లంఘన సహా ఏదైనా కారణంతో ఏ సమయంలోనైనా CTPL భాగస్వామి స్వయంగా లేదా CTPLతో చర్చలు జరిపిన అనంతరం యాక్సెస్‌ను సవరించవచ్చు, నిలిపివేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు. లేదా CTPL ప్లాట్‌ఫామ్‌లో లభిస్తున్న మొత్తం సేవలను లేదా కొన్ని విభాగాలను యాక్సెస్ చేసేందుకు మీకు ఉన్న అనుమతులను సవరించాలని, సస్పెండ్ చేయాలని లేదా రద్దు చేయాలని CTPL భాగస్వామిని అభ్యర్థించవచ్చు. 
8.2. "కస్టమర్ ఈవెంట్ ఆఫ్ డిఫాల్ట్" అనే పదానికి అర్థం ఏంటంటే, అడ్మినిస్ట్రేటర్ ఒప్పందాల ప్రకారం, అడ్మినిస్ట్రేటర్‌కు కట్టుబడిన బాధ్యతలను కస్టమర్ నెరవేర్చకుండా పోవడం.
8.3. ఈ కింద పేర్కొన్న సందర్భాలలో ఇకపై ఈ నియమాలు రద్దు అవుతాయి:
8.3.1. CTPL దివాలా తీసినా లేదా దివాలా తీసినట్లు ప్రకటించినా;
8.3.2. CTPL తన వ్యాపారాన్ని కొనసాగించడం మానేసినా లేదా తన వ్యాపారాన్ని మూసివేయాలనే ఉద్దేశం ఉందని అడ్మినిస్ట్రేటర్‌కు తెలియజేసినా;
8.3.3. అడ్మినిస్ట్రేటర్ ఒప్పందాలలో లేదా నియమాల్లో ఉన్న ఏవైనా నియమ, నిబంధనలను CTPL ఉల్లంఘించినా, అలాగే అడ్మినిస్ట్రేటర్ సమాచారం ఇచ్చినప్పటికీ 90 (తొంభై) రోజుల లోపు దాన్ని CTPL పరిష్కరించని సందర్భంలో;
8.3.4. ఏదైనా కార్పొరేట్ చర్య (ఏదైనా థర్డ్ పార్టీ కార్పొరేట్ చర్య మినహా), లీగల్ ప్రొసీడింగ్స్‌ లేదా ఇతర ప్రొసీజర్లు లేదా CTPL చెల్లింపుల నిలుపుదల, మూసివేత, డిజల్యూషన్‌, అడ్మినిస్ట్రేషన్, తాత్కాలిక పర్యవేక్షణ లేదా పునర్వ్యవస్థీకరణ లేదా పునర్నిర్మాణానికి (స్వచ్ఛందంగా చేసిన ఏర్పాటు ద్వారా, స్కీమ్ ఆఫ్‌ అరేంజ్‌మెంట్ లేదా ఇతరత్రా పథకం) సంబంధించి తీసుకున్న చర్యల కారణంగా;
8.3.5. ఏదైనా వర్తించే దివాలా, అప్పులు చెల్లించలేని స్థితి, మూసివేత లేదా వీటికి సమానమైన వర్తించే ఇతర చట్టాల కింద ఇప్పుడు లేదా ఆ తర్వాత ఎప్పుడైనా CTPL  స్వచ్ఛందంగా చర్యలు అమలు చేయాలనుకున్నప్పుడు, లేదా అటువంటి వర్తించే చట్టం ప్రకారం స్వచ్ఛందంకాని ప్రక్రియలో ఉపశమనం కోసం ఆర్డర్‌లోకి ఎంటర్ అవ్వడానికి అంగీకారం పొందడం, లేదా దాని మొత్తం ఆస్తిని లేదా అందులో గణనీయమైన భాగాన్ని తీసుకోవడానికి అపాయింట్‌మెంట్ పొందే విషయంలో లేదా స్వాధీనం చేసుకోవడం లేదా దాని పునర్వ్యవస్థీకరణ, లిక్విడేషన్‌ లేదా డిజల్యూషన్‌పై ఏదైనా చర్య తీసుకోవడానికి రిసీవర్, లిక్విడేటర్, అసైనీ (లేదా తత్సమానమైన అధికారి) సమ్మతిని పొందిన తర్వాత;
8.3.6. CTPL మూసివేత, దివాలా లేదా డిజల్యూషన్‌ కోసం ఆర్డర్ జారీ అయిన తర్వాత, లేదా వర్తించే చట్టం ప్రకారం CTPLపై ఏదైనా కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించేందుకు చేసిన దరఖాస్తు ఆమోదం పొందినప్పుడు;
8.3.7. CTPL ఆస్తి మొత్తం లేదా గణనీయమైన భాగాన్ని చట్టబద్ధంగా తన అధీనంలోకి తెచ్చుకునేందుకు రుణభారం మోసే వ్యక్తి ముందుకొచ్చినా, లేదా CTPL ఆస్తులు లేదా ఆస్తిలో పూర్తి మొత్తం లేదా గణనీయమైన భాగాన్ని పర్యవేక్షించేందుకు లిక్విడేటర్, జ్యుడీషియల్ కస్టోడియన్, రిసీవర్, అడ్మినిస్ట్రేటివ్ రిసీవర్ లేదా ట్రస్టీ లేదా సమాన అధికారం ఉన్న ఎవరైనా అధికారిని నియమించినా,   లేదా CTPL ప్రాపర్టీ లేదా ఆస్తుల మొత్తం లేదా వాటిలో కొంత భాగాన్ని అటాచ్‌ చేసినా, సీక్వెస్ట్రేషన్, డిస్ట్రెస్ లేదా స్వాధీన ప్రక్రియ అమలు (లేదా ఆ తరహా ప్రక్రియ), లేదా CTPLను అమ్మి నగదును పొందడం లేదా దాన్ని రద్దు చేయడం లేదా ఆ తరహాలోనే పునర్వ్యవస్థీకరణ దిశగా ఏవైనా చర్యలు తీసుకున్నా; లేదా
8.3.8. CTPLకు లిక్విడేటర్ లేదా ప్రొవిజనల్ లిక్విడేటర్‌ నియమితులైనప్పుడు, లేదా CTPL లేదా దాని ఆస్తులలో ఏదైనా కొంత భాగానికి, లేదా అలాంటి ఈవెంట్‌కు సంబంధించి రిసీవర్, రిసీవర్ - మేనేజర్, ట్రస్టీ లేదా అలాంటి అధికారి నియమితులైనప్పుడు.
8.4. సెక్షన్ 8.3లో ప్రస్తావించిన ఏవైనా ఈవెంట్‌లు జరిగినప్పుడు, అలానే మీ డిజిటల్ బంగారాన్ని సూచించే, భద్రపర్చిన గోల్డ్‌ను డెలివరీ చేయడానికి సంబంధించి ఏవైనా ఖర్చులు, ఛార్జీలు చెల్లించేందుకు కావాల్సిన నిధులు CTPL వద్ద సరిపోయేంత లేకపోతే, అప్పుడు అలాంటి సందర్భంలో, ఆ ఖర్చులు, ఛార్జీలను భరించడానికి అవసరమైన మొత్తాన్ని పొందేందుకు కస్టమర్ గోల్డ్‌లోని ఏదైనా భాగాన్ని విక్రయించడానికి మీరు అడ్మినిస్ట్రేటర్‌కు అధికారం ఇస్తున్నారు.
8.5. అడ్మినిస్ట్రేటర్ ఒప్పందాల ప్రకారం, CTPL కస్టమర్ల ప్రయోజనం కోసం ఈ కింద ప్రస్తావించిన సందర్భాలలో, అడ్మినిస్ట్రేటర్‌కు అనుకూలంగా హైపోథెకేషన్ పద్ధతిలో  బాధ్యతను క్రియేట్ చేసింది: (a) ఎప్పటికప్పుడు కలెక్షన్ ఖాతాలో జమ అయి ఉన్న డబ్బు; ఇంకా (బి) ఎప్పటికప్పుడు CTPL కొనుగోలు చేసిన, వాల్ట్ కీపర్ వద్ద ఉన్న లేదా రవాణా చేస్తున్న బంగారం(ఇది CTPL ఆస్తి); (సమిష్టిగా "సెక్యూరిటీ" అని అంటారు).
8.6. సెక్షన్ 8.1, 8.2లో వివరించిన ఏవైనా సంఘటనలు సంభవించినప్పుడు, అడ్మినిస్ట్రేటర్ ఒప్పందాల ప్రకారం అడ్మినిస్ట్రేటర్ ఇక్కడ వివరించినట్లుగా చేయాలి: (i) బకాయి ఉన్న మొత్తాలన్నింటిని అడ్మినిస్ట్రేటర్‌కు చెల్లించాలని ప్రకటించాలి; అలానే (ii) బాధ్యతలు తీసుకోవడం మరియు/లేదా స్వాధీనం చేసుకోవడం, సీజ్ చేయడం, రికవర్ చేయడం, స్వీకరించడం, సెక్యూరిటీని తొలగించడం చేయాలి, అలాగే ఆ మొత్తాన్ని కస్టమర్లకు CTPL బకాయి పడిన మేరకు ఇచ్చేందుకు ఉపయోగించాలి. ఏది ఏమైనప్పటికీ, సెక్యూరిటీ అమలు అనేది ఎల్లప్పుడు కూడా వర్తించే చట్టంలోని నిబంధనలకు లోబడి ఉంటుందని మీరు స్పష్టంగా అర్థం చేసుకున్నారు, అంగీకరిస్తున్నారు. కాబట్టి:
(i) అటువంటి పంపిణీని చేయడానికి అవసరమైన సమయాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం సాధ్యం కాదు; మరియు/లేదా 
(ii) అటువంటి పంపిణీ ద్వారా మీరు అందుకున్న మొత్తం మీకు CTPL చెల్లించాల్సిన బకాయిలను పూర్తిగా తీర్చడానికి సరిపోకపోవచ్చు;
తత్ఫలితంగా, పైన పేర్కొన్న వాటికి సంబంధించి అడ్మినిస్ట్రేటర్‌ పైన ఎటువంటి లయబిలిటీ ఉండదు.
8.7. CTPL మీకు నోటీసు ఇచ్చి గానీ, ఇవ్వకుండా గానీ, ప్లాట్‌ఫామ్‌లో సేవలను అందుబాటులో లేకుండా నిలిపివేయవచ్చు. అలాంటి సందర్భంలో మీ CaratLane డిజిటల్ గోల్డ్ అకౌంట్ మూసివేయబడుతుంది, ఈ నియమాలలోని సెక్షన్ 16.2లో పేర్కొన్న పద్ధతిలో తదుపరి చర్యలు ఉంటాయి.

9. CTPL సేవలను రద్ద చేయడం వల్ల జరిగే పరిణామాలు
9.1. ఏదైనా కారణం చేత సేవలు రద్దు అయితే, ఈ నియమాలను, అడ్మినిస్ట్రేటర్ ఒప్పందాలతో కలిపి అన్వయించాలి:
9.1.1. CTPL డిజిటల్ గోల్డ్ బ్యాలెన్స్ హోల్డింగ్‌లలో 1 (ఒకటి) గ్రాము కంటే తక్కువ ఉన్న గోల్డ్ మొత్తాలను విక్రయించి, వాటిని అమ్మగా వచ్చిన నగదు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తారు. అయితే మధ్యవర్తుల నియామకానికి అవసరమైన ఛార్జీలను డిడక్ట్ చేసుకున్న తర్వాత (మధ్యవర్తులకు బకాయిపడిన, అలాగే చెల్లించాల్సిన ఛార్జీలు, ఇంకా ఏవైనా ఇతర చిన్న ఖర్చులు, కస్టడీ ఛార్జీలు, మింటింగ్, డెలివరీ ఛార్జీలు వీటిలో ఉంటాయి. ఇవి కాకుండా ఇతరత్రా ఛార్జీలు కూడా ఉండవచ్చు) ("ఛార్జీలు") మిగిలిన మొత్తాన్ని మీ ఖాతాలో క్రెడిట్ చేస్తారు.
9.1.2. CL వద్ద ఉన్న డిజిటల్ గోల్డ్ బ్యాలెన్స్ 1 గ్రాము లేదా అంత కంటే ఎక్కువ  ఉన్నప్పుడు, మీ CTPL డిజిటల్ గోల్డ్‌లో కొంత భాగాన్ని విక్రయించి, మధ్యవర్తులు అందరికీ ఛార్జీలు (మీరు పెండింగ్ పెట్టిన ఛార్జీల మేరకు) చెల్లించడానికి అడ్మినిస్ట్రేటర్‌కు అధికారం ఉంటుంది. ఈ నియమాలకు అనుగుణంగా, CTPL డిజిటల్ గోల్డ్ బ్యాలెన్స్‌లో తీసివేయగా, మిగిలిన మొత్తాన్ని, తీసివేసిన వివరాలను, మీకు రావాల్సిన బంగార పరిమాణాన్ని మీకు అందజేస్తారు.
9.2. ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే ప్లాట్‌ఫామ్‌కు, సేవలకు మీకున్న యాక్సెస్‌ను నిలిపివేయవచ్చు. అంతేకాక, CaratLane డిజిటల్ గోల్డ్ అకౌంట్‌ను వెంటనే డియాక్టివేట్ చేయవచ్చు లేదా తొలగించవచ్చు. ఇకపై మీరు CaratLane డిజిటల్ గోల్డ్ ఖాతాకు, ప్లాట్‌ఫామ్‌కు, సేవలకు యాక్సెస్‌ పొందకుండా కూడా నిషేధం పెట్టవచ్చు. అలానే, ఏదైనా థర్డ్ పార్టీ తమ సేవలను నిలిపివేసినా లేదా రద్దు చేసినా, దానికి CTPL మరియు/లేదా CTPL భాగస్వామి బాధ్యత వహించరని మీరు అంగీకరిస్తున్నారు.
9.3. మీ ఖాతాను రద్దు చేసిన తర్వాత, మీ కంటెంట్‌లో దేన్నీ మీరు యాక్సెస్ చేయలేరు లేదా మీరు ఏ సమాచారాన్ని తిరిగి పొందలేరు.
9.4. ఈ నియమాలను రద్దు చేసినప్పటికీ వారెంటీల నిరాకరణ, లయబిలిటీ పరిమితి, పాలక చట్టంలోని ప్రొవిజన్లు అమలు అవుతూనే ఉంటాయి.
10. పాలక చట్టం మరియు వివాద పరిష్కారం
ఈ నియమాలు భారత చట్టాలకు అనుగుణంగా అమలవుతాయి. ఆ చట్టాలకు లోబడే వాటిని వివరించాలి, అర్థం చేసుకోవాలి. ఈ నియమాల ప్రకారం తలెత్తే ఏవైనా వివాదాలపై చెన్నయి న్యాయస్థానాలకు ప్రత్యేక అధికార పరిధి ఉంటుంది. ఈ నియమాల విషయంలో ఏవైనా వివాదాలు తలెత్తిన సందర్భంలో, ఆర్బిట్రేషన్ - కన్సైలేషన్ చట్టం, 1996 ప్రకారంగా డీల్ చేస్తూ, రెండు పార్టీలు సంయుక్తంగా నియమించిన ఏకైక మధ్యవర్తి సమక్షంలో బైండింగ్ ఆర్బిట్రేషన్ పద్ధతిలో పరిష్కారమవుతుంది. ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియ చెన్నై, తమిళనాడు, భారతదేశంలోనే జరగాలి.

భాగం – II
11. CARATLANE డిజిటల్ గోల్డ్ అకౌంట్‌ను క్రియేట్ చేయడం & రిజిస్ట్రేషన్‌ ఆబ్లిగేషన్స్ 
11.1. ప్లాట్‌ఫామ్‌లో అందించే సేవలను పొందే ముందు, ఎప్పటికప్పుడు సూచించిన లేదా మార్చిన ప్రకారంగా కస్టమర్ తన రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ను పూర్తి చేయాలి. కస్టమర్ తన CaratLane డిజిటల్ గోల్డ్ అకౌంట్ సెటప్ చేసేటప్పుడు ప్లాట్‌ఫామ్‌లో ఇచ్చిన సూచనలను పాటిస్తున్నారని నిర్ధారించుకోవాలి. KYC ప్రయోజనాల కోసం ప్లాట్‌ఫామ్‌కు కస్టమర్ అందించిన సంబంధిత సమాచారాన్ని, పత్రాలను సేకరించడానికి, నిల్వ చేయడానికి CTPL మరియు/లేదా CTPL భాగస్వామికి అర్హత ఉందని మీరు ఇందుమూలంగా ధృవీకరిస్తున్నారు.
11.2. CTPL మరియు/లేదా CTPL భాగస్వామికి అవసరమైనప్పుడు, KYCకి అవసరమైన అదనపు పత్రాలను కస్టమర్ అందించవలసి ఉంటుంది. అలానే అవసరమైనప్పుడు మిమ్మల్ని సంప్రదించడానికి CTPLకు, CTPL భాగస్వామికి దీని ద్వారా అధికారం ఇస్తున్నారు. CTPLకు, CTPL భాగస్వామికి ఎప్పటికప్పుడు మీరు అందించిన సమాచారం యొక్క వాస్తవికతకు, ఖచ్చితత్వానికి మీరు సంపూర్ణంగా, పూర్తిగా బాధ్యత వహించాలని, జవాబుదారీగా ఉండాలని స్పష్టంగా తెలియజేయడమైనది. మీరు అందించిన సమాచారంలో ఏదైనా ఎర్రర, తప్పు లేదా కాలం చెల్లిన సమాచారం ఉందని మీకు తెలిసినా లేదా అలా భావించినా, మీరు వెంటనే CTPLకు తెలియచేయాలి. అలాగే సరైన / అప్‌డేట్ చేసిన సమాచారాన్ని వీలైనంత త్వరగా అందించాలి.
11.3 KYC డాక్యుమెంట్లు/సమాచారం తప్పుగా ఉన్నప్పుడు లేదా డాక్యుమెంట్‌లు/సమాచారం ప్రామాణికత సందేహాస్పదంగా ఉందని గుర్తించిన సందర్భంలో, మీకు నోటీసు ఇచ్చి గానీ ఇవ్వకుండా గానీ మీ CaratLane డిజిటల్ గోల్డ్ ఖాతాను రద్దు చేసేందుకు CTPLకు లేదా CTPL భాగస్వామికి ఏకైక, సంపూర్ణ హక్కు ఉంటుంది. మిమ్మల్ని మీరు గుర్తించడంలో, మీ ఖాతాను తగు విధంగా ధృవీకరించడంలో విఫలమైన కారణంగా ఉత్పన్నమయ్యే ఏవైనా, లేదా అన్ని నష్టాలు, క్లెయిమ్‌లు, లయబిలిటీ ఖర్చులు, మొదలైన వాటికి సంబంధించి మీరు CTPLకు మరియు/లేదా CTPL భాగస్వామికి నష్టం కలగకుండా ఉండటానికి, అటువంటి నష్టాన్ని భరించడానికి అంగీకరిస్తున్నారు.
11.4. మీ కస్టమర్ గురించి తెలుసుకోండి (KYC) & ధృవీకరణ
11.4.1. ఆర్డర్ చేసే ముందు, మీరు CTPLకు మరియు/లేదా CTPL భాగస్వామికి, అవసరమైన నిర్దిష్ట KYC డాక్యుమెంటేషన్‌ను, దాంతో పాటు ఇతర సమాచారాన్ని నిర్దిష్ట ఫార్మాట్‌లో అందించవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో లేదా తదుపరి దశలో ఈ సమాచారాన్ని ఇవ్వాలని మిమ్మల్ని అభ్యర్థించే అవకాశం ఉంటుంది.
11.4.2. అటువంటి డాక్యుమెంటేషన్‌ను, ఇతర సమాచారాన్ని మీరు CTPLకు మరియు/లేదా  CTPL భాగస్వామికి అందించిన తర్వాత మాత్రమే, మీరు ప్లాట్‌ఫామ్‌లో ఆర్డర్ ప్లేస్ చేయడానికి అర్హత ("కస్టమర్ ఆర్డర్") పొందుతారు.
11.4.3. మీరు CaratLane డిజిటల్ గోల్డ్ ఖాతాను రూపొందించిన తర్వాత, ప్లాట్‌ఫామ్‌ను నిరంతరాయంగా వినియోగించుకోవడం అన్నది మీరు అందించిన సమాచారాన్ని, డాక్యుమెంటేషన్‌ను CTPL మరియు/ లేదా CTPL భాగస్వామి (CTPL తరపున) వెరిఫై చేయడానికి లోబడి ఉంటుందని అంగీకరిస్తున్నారు. నిర్దేశించిన ఫార్మాట్‌లో ఈ వెరిఫికేషన్‌ చేయడానికి CTPLకు మరియు/ లేదా CTPL భాగస్వామికి మీరు అనుమతిని మంజూరు చేస్తున్నారు.
11.4.4. రిజిస్ట్రేషన్ సమయంలో లేదా ఆ తర్వాత ఎప్పుడైనా గోల్డ్ ఖాతాను ధృవీకరించే హక్కు CTPLకు మరియు/ లేదా CTPL భాగస్వామికి ఉంటుందని కూడా మీరు అంగీకరిస్తున్నారు. మీ అర్హతను నిరూపించుకోవడానికి కావాల్సిన మీ KYC డాక్యుమెంటేషన్ ధృవీకరణ కోసం థర్డ్-పార్టీ సేవా సంస్థ సేవలను ఉపయోగించుకునేందుకు మీరు CTPLకు మరియు/లేదా CTPL భాగస్వామికి అధికారం ఇస్తున్నారు. KYC డాక్యుమెంట్‌లను ప్రాసెస్ చేయడానికి CTPL మరియు/లేదా CTPL భాగస్వామి చేపట్టే ఏదైనా ప్రక్రియ, CTPL గోప్యతా విధానంతో పాటు ఈ నియమాలకు అనుగుణంగా ఉంటుంది. థర్డ్ పార్టీ సేవా సంస్థ, KYC డాక్యుమెంట్‌లను యాక్సెస్ చేయడానికి అవసరమైన అనుమతి, సదరు థర్డ్ పార్టీ సేవా సంస్థ గోప్యతా విధానాన్ని బట్టి  ఉంటుంది.
11.5. కస్టమర్ల బాధ్యతలు
11.5.1. మీ CaratLane డిజిటల్ గోల్డ్ అకౌంట్ సమాచారం ప్రైవసీని గోప్యంగా ఉంచేందుకు మీరు పూర్తిగా, సంపూర్ణంగా బాధ్యత వహిస్తారని, అలానే CaratLane డిజిటల్ గోల్డ్ అకౌంట్ కింద జరిగే అన్ని కార్యకలాపాలకు మీరు పూర్తిగా బాధ్యత వహించాలని దీని ద్వారా స్పష్టం చేయడమైనది. CaratLane డిజిటల్ గోల్డ్ అకౌంట్ సమాచారాన్ని ఏదైనా అనధికారిక అవసరానికి వినియోగించిన లేదా ఏదైనా ఇతర భద్రతా ఉల్లంఘన జరిగిన సందర్భంలో, మీరు వెంటనే CTPL మరియు/లేదా CTPL భాగస్వామికి తెలియజేస్తారని అంగీకరిస్తున్నారు. ఈ నియమాన్ని పాటించడంలో మీరు విఫలం కావడడం వల్ల తలెత్తే ఏదైనా నష్టానికి లేదా డ్యామేజ్‌కు CTPL గానీ CTPL భాగస్వామి గానీ బాధ్యత వహించరు, జవాబుదారీగా ఉండరు. CaratLane డిజిటల్ గోల్డ్ అకౌంట్ సమాచారాన్ని గోప్యంగా ఉంచడంలో మీరు విఫలమైన కారణంగా, CaratLane డిజిటల్ గోల్డ్ అకౌంట్‌, అధికారిక లేదా అనధికారిక వినియోగానికి గురైన సందర్భంలో, CTPLకు లేదా CTPL భాగస్వామికి లేదా ప్లాట్‌ఫామ్‌ యూజర్‌కు లేదా విజిటర్‌కు జరిగే ఏవైనా నష్టాలకు మీరు బాధ్యత వహించాల్సి రావచ్చు.
11.5.2. రిజిస్ట్రేషన్ ఫారంలో మీరు అందించిన డిజిటల్ గోల్డ్ అకౌంట్ సమాచారం సంపూర్ణమైనది, ఖచ్చితమైనది, అప్‌డేట్ చేసినది అని మీరు నిర్ధారించుకోవాలి. మీరు ఏ విధమైన సేవలను పొందేందుకు, మరియు/లేదా ప్లాట్‌ఫామ్‌ను వినియోగించేందుకు ఏ పద్ధతిలోనైనా అయినా మరొక కస్టమర్ ఖాతా సమాచారాన్ని ఉపయోగించకూడదు. ఈ విషయం చాలా స్పష్టంగా మీకు తెలియ చేయడమైంది.
11.5.3. మీరు అసత్యమైన, తప్పుడు, అప్‌డేట్ కానిది లేదా అసంపూర్ణమైన, (లేదా అసత్యమైన, సరికాని, అప్రస్తుతమైనది లేదా అసంపూర్ణంగా మారిన) ఏదైనా సమాచారాన్ని అందించినట్లయితే లేదా ఆ సమాచారం అవాస్తవమని, తప్పుడు సమాచారమని, అప్‌డేట్ చేసిన సమాచారం కాదని, అసంపూర్ణమైనదని లేదా ఈ నియమాలకు అనుగుణంగా లేదని  అనుమానించడానికి సహేతుకమైన ఆధారాలు CTPL వద్ద, మరియు CTPL భాగస్వామి వద్ద ఉన్నట్లయితే, CTPL భాగస్వామి ద్వారా ప్లాట్‌ఫామ్‌లోని CaratLane డిజిటల్ గోల్డ్ అకౌంట్ యాక్సెస్‌ను నిరవధికంగా నిలిపివేయడానికి లేదా ఆపివేయడానికి లేదా బ్లాక్ చేయడానికి CTPLకు, CTPL భాగస్వామికి హక్కు ఉంటుంది. అలానే ప్లాట్‌ఫామ్‌ను మీరు యాక్సెస్ చేయకుండా ఆపివేయవచ్చు లేదా ఏదైనా తగిన ఇతర చర్యను తీసుకోవచ్చు. 

12. బంగారం కొనుగోలు
12.1. మీరు ప్లాట్‌ఫామ్‌లో కనిపిస్తున్న మార్కెట్‌తో లింక్ అయిన బంగారం ధరల ప్రకారం రూ.1.00 (ఒక రూపాయి మాత్రమే) లేదా అంత కంటే ఎక్కువ విలువైన బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. మార్కెట్‌తో లింక్ అయిన ధరలు అంటే, ఈ కోట్స్(quotes) భారతదేశంలోని కమర్షియల్ బులియన్ మార్కెట్‌లోని బంగారం ధరలతో ముడిపడి ఉండేవి అని అర్థం.
12.2. బంగారానికి సంబంధించి అటువంటి మార్కెట్‌తో లింక్ అయిన ధరలు పూర్తిగా బైండింగ్ ఆఫర్‌లను కలిగి ఉంటాయని, కస్టమర్లందరికీ అందుబాటులో ఉన్న మార్కెట్ ధరలకే బంగారాన్ని కొనుగోలు చేయొచ్చని ఇక్కడ స్పష్టం చేయడమైనది. పైన పేర్కొన్న వాటితో సంబంధం లేకుండా, ఈ ధరలు ఒక రోజులోనే అనేక సార్లు మారవచ్చని మీరు అర్థం చేసుకున్నారు, అలానే దాని ప్రకారంగా ఏదైనా ఆర్డర్ కోసం మీరు చెల్లించాల్సిన మొత్తాలు, మార్కెట్‌తో లింక్ అయిన ధరలపై ఆధారపడి ఉంటాయి. కస్టమర్ గోల్డ్‌ విషయంలో మీకు సరసమైన ధరను అందించడానికి సహేతుకమైన ప్రయత్నాలు చేసినప్పటికీ, మీకు అందించే ధర మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ధరలకు సమీపంలో లేదా పోల్చతగినదిగా ఉంటుందని ఎలాంటి హామీని ఇవ్వడం లేదు. 
12.3. ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న పేమెంట్ ఆప్షన్ల ద్వారా పేమెంట్‌ను యాక్సెప్ట్ చేస్తారు, ఇందులో CTPL అందిస్తున్న పేమెంట్ గేట్‌వే సహా ఇతర థర్డ్ పార్టీ వెబ్‌సైట్ లేదా ప్లాట్‌ఫామ్ ద్వారా హోస్ట్ చేసిన పేమెంట్ గేట్‌వేకు కూడా మిమ్మల్ని తీసుకెళ్లవచ్చు. Caratlane డిజిటల్ బంగారం కొనుగోలు / ఫుల్‌ఫిల్‌మెంట్‌ / తిరిగి-అమ్మడం / బదిలీ చేసే సమయంలో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించే విధంగా సంబంధిత పన్నులను వసూలు చేస్తారు.
12.4. ఒకసారి కస్టమర్ ఆర్డర్‌ను ప్లేస్ చేసిన తర్వాత, సదరు కస్టమర్ ఆర్డర్‌ను రద్దు చేయడానికి మీకు అవకాశం ఉండదని స్పష్టంగా తెలియజేస్తున్నాము. అయితే ఏదైనా కారణం వల్ల పేమెంట్ విఫలమైతే కస్టమర్ ఆర్డర్ రద్దు అవుతుంది.
12.5. కస్టమర్ ఆర్డర్‌‌ను ప్లేస్ చేయడానికి  ముందు మీరు అందించిన సమాచారం ఆమోదయోగ్యం కాని పరిస్థితులలో, అలాగే డిజిటల్ గోల్డ్ కొనేందుకు మీకు అర్హత లేదని CTPL, మరియు/లేదా CTPL భాగస్వామి ఒక అభిప్రాయానికి వచ్చిన సందర్భాలలో, CTPL, మరియు/లేదా CTPL భాగస్వామి తమ సొంత అభీష్టానుసారం కస్టమర్ ఆర్డర్‌ను రద్దు చేయడానికి హక్కును కలిగి ఉంటాయి. CaratLane డిజిటల్ గోల్డ్ అకౌంట్‌కు తదనుగుణంగా మార్పులు చేస్తారు. CTPL, CTPL భాగస్వామి సంతృప్తి చెందే పద్ధతిలో, ఫార్మాట్‌లో KYCని, ఇతర డాక్యుమెంటేషన్‌ను పూర్తిగా  అందించే దాకా CaratLane డిజిటల్ గోల్డ్ అకౌంట్‌ను నిలిపివేసే హక్కు CTPLకు, CTPL భాగస్వామికి ఉంటుంది.
12.6. పేమెంట్‌లను CTPL స్వీకరించిన తర్వాత, అలాగే KYC సమాచారం ఆమోదయోగ్యమైనదిగా గుర్తించిన తర్వాత, కస్టమర్ ఆర్డర్‌ను, ఆర్డర్‌ చేసిన 3 (మూడు) పని దినాల వ్యవధిలో నిర్ధారిస్తూ CTPL మీకు ఇన్‌వాయిస్‌ను జారీ చేస్తుంది.
12.7. ఈ నియమాలకు విరుద్ధంగా ఉన్న ఏదైనా అంశాన్ని అంగీకరించని సందర్భంలో, CTPL, మరియు/లేదా CTPL భాగస్వామి తమ సొంత అభీష్టానుసారం ఏ కారణం చేతనైనా కస్టమర్ ఆర్డర్‌ను అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి హక్కును కలిగి ఉంటాయి.
12.8. CTPL, పేమెంట్‌ను స్వీకరించినప్పటికీ, ఈ నియమాల ప్రకారం కస్టమర్ ఆర్డర్‌ను తిరస్కరించినట్లయితే, సదరు పేమెంట్‌ తిరిగి మీ అకౌంట్‌కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతుంది. అయితే ఈ ప్రక్రియ, ప్లాట్‌ఫామ్‌లో సూచించిన నియమాలకు, షరతులకు లోబడి ఉంటుంది.

13. కస్టమర్ గోల్డ్ అమ్మకం
13.1. బంగారాన్ని కొనుగోలు చేసిన తేదీ నుండి 72 గంటల తర్వాత, ప్లాట్‌ఫామ్‌లోని విక్రయ ధరల ఆధారంగా, మార్కెట్ వేళల్లో కస్టమర్ గోల్డ్‌ను విక్రయించేందుకు మీకు అవకాశం ఉంటుంది. ధరలు ఆమోదయోగ్యమైనట్లయితే, మీరు విక్రయ అభ్యర్థనను CTPL (“విక్రయ అభ్యర్థన”)కు ఆమోదయోగ్యమైన రూపంలో, పద్ధతిలో నిర్ధారించాలి. మీరు చేసిన విక్రయ అభ్యర్థన (“కస్టమర్ గోల్డ్ అమ్మటమైనది”) ప్రకారం, విక్రయించాలనుకుంటున్న కస్టమర్ గోల్డ్ పరిమాణాన్ని బట్టి, మీ CaratLane డిజిటల్ గోల్డ్ అకౌంట్ నుంచి బంగారం డెబిట్ అవుతుంది.
13.2. విక్రయ అభ్యర్థన ధృవీకరించిన 2 (రెండు) పని దినాల వ్యవధిలో లేదా అంతకంటే ఎక్కువ అవసరమైన వ్యవధిలో, విక్రయ అభ్యర్థనకు అనుగుణంగా, విక్రయ అభ్యర్థన చేసిన సమయంలో సూచించిన విక్రయ ధరల ప్రకారం CTPL, పేమెంట్‌ను జారీ చేస్తుంది. మీరు అందించిన వివరాల ఆధారంగా మీ బ్యాంక్ అకౌంట్‌లో ఆ పేమెంట్ జమ అయ్యేలా CTPL బాధ్యత తీసుకుంటుంది. మీరు అందించిన బ్యాంకు అకౌంట్ వివరాలలో ఏవైనా తప్పిదాలు ఉంటే అందుకు CTPL బాధ్యత వహించదు.
13.3. కమర్షియల్ బులియన్ మార్కెట్, పని చేస్తున్న సమయంలో, CTPL, మరియు/లేదా CTPL భాగస్వామి ఈ సేవ(service)ను అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాయని స్పష్టంగా తెలియజేస్తున్నాము. అయితే ఈ ఆప్షన్ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటుందని CTPL, CTPL భాగస్వామి హామీ ఇవ్వరు. అలాగే విక్రయించిన కస్టమర్ గోల్డ్‌ను కొనుగోలు చేసే వారు CTPL లేదా మరో పార్టీ (విక్రయించిన కస్టమర్ బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి కలిగి ఉన్న మరో పార్టీ) కావచ్చు. కస్టమర్ గోల్డ్ అమ్మకానికి సంబంధించిన నిధులను, ఆ గోల్డ్‌ కొనుగోలు చేసిన థర్డ్ పార్టీ మీ బ్యాంక్ అకౌంట్‌కు ఖచ్చితంగా పంపించేలా చూడటం వరకే CTPL, మరియు/లేదా CTPL భాగస్వామి బాధ్యత వహిస్తుంది.

14. మోసపూరిత లావాదేవీలు
14.1. కస్టమర్ తన మొబైల్ వాలెట్ వివరాలను, వ్యక్తిగత UPI పిన్‌ను లేదా OTPని ("పేమెంట్ సమాచారం") ఏ థర్డ్ పార్టీతోనూ ఉద్దేశపూర్వకంగా గానీ, లేదా అనుకోకుండా గానీ షేర్ చేయకూడదు. ఈ మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. CTPL/CTPL భాగస్వామి, కాల్ చేసి గానీ లేదా ఇంకేదైనా పద్ధతిలో గానీ పేమెంట్ సమాచారాన్ని చెప్పాలని ఎప్పుడూ అడగదు. కస్టమర్‌ తన వివరాలను షేర్ చేయడం వల్ల ఏవైనా మోసపూరిత చర్యలు చోటుచేసుకున్న సందర్భంలో CTPL/CTPL భాగస్వామి/థర్డ్ పార్టీ సేవలు/పేమెంట్ గేట్‌వే భాగస్వాములు  ఏ విధంగానూ బాధ్యత వహించవు.
14.2. CTPL ప్లాట్‌ఫామ్‌లో గోల్డ్‌ను కొనుగోలు చేయడానికి ఒక వ్యక్తి పేమెంట్ సమాచారాన్ని లేదా పేమెంట్ పరికరాన్ని మోసపూరితంగా ఉపయోగించిన సందర్భంలో, బాధితుడు/రాలు తప్పనిసరిగా CTPL కస్టమర్ సపోర్ట్ నంబర్, ఈమెయిల్ వంటి సరైన మార్గాల్లో (దయచేసి [email protected] or 1800 102 0103, 044-4293-5000కు సమస్యను చెప్పండి) CTPLను సంప్రదించాలి. ఆ సమయంలో సంబంధిత ప్రభుత్వ అధికారి లేదా సైబర్ సెల్, CTPL నుంచి పొందిన సపోర్టింగ్ డాక్యుమెంటేషన్‌తో పాటు లావాదేవీకి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయాలి.
14.3. CTPL మరియు/లేదా CTPL భాగస్వామి తమ అంతర్గత మార్గదర్శకాల ప్రకారం ఏదైనా అనుమానాస్పద లావాదేవీ లేదా కస్టమర్ అకౌంట్‌ గురించి హెచ్చరిక జారీ చేసిన తర్వాత లేదా కస్టమర్ CaratLane డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేయడానికి లేదా ఇంకేదైనా లావాదేవీ చేయడానికి అనధికారిక లేదా మోసపూరిత పద్ధతిలో పేమెంట్ సమాచారాన్ని లేదా పేమెంట్ పరికరాన్ని ప్లాట్‌ఫామ్‌లో ఉపయోగించినట్లుగా (మోసపూరిత యూజర్) గుర్తించిన సందర్భంలో, CTPL మరియు/లేదా ప్లాట్‌ఫామ్ భాగస్వామికి ఈ కింద పేర్కొన్న చర్యలు చేపట్టేందుకు హక్కును కలిగి ఉంటాయి:
14.3.1. ఆ హెచ్చరిక జారీ చేసిన లావాదేవీకి సంబంధించి వెరిఫికేషన్‌ను అభ్యర్థించడం, యూజర్ నుండి ఏదైనా తదుపరి KYC సమాచారాన్ని లేదా ఇతర డాక్యుమెంట్‌లను కోరడం;
14.3.2. అటువంటి మోసపూరిత యూజర్‌ను బ్లాక్ చేయడం మరియు/లేదా తదుపరి వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉన్న యూజర్‌లతో అనుసంధానమైన అకౌంట్‌ను నిలిపివేయడం;
14.3.3. అటువంటి మోసపూరిత యూజర్ కొనుగోలు చేసిన ఏదైనా డిజిటల్ గోల్డ్ బ్యాలెన్స్‌ను ప్రస్తుతం ఉన్న ధరకు అమ్మడం సహా సాధ్యమైనంత వరకు, అటువంటి మోసపూరిత లావాదేవీని రివర్స్ చేయడం;
14.3.4. ఏదైనా ఇతర లావాదేవీ వివరాలతో ఉంటే వాటిని జత చేస్తూ అటువంటి మోసపూరిత యూజర్‌పై సంబంధిత అధికారులకు సమాచారాన్ని అందించడం.
14.4. మోసపూరిత లావాదేవీ జరిగినప్పుడు, సెక్షన్ 16.2 ప్రకారం, కస్టమర్ లేదా బాధితుడు/రాలు చేసి అభ్యర్థన మేరకు, వారు సమర్పించిన ఆధారాలకు, డాక్యుమెంటేషన్‌కు లోబడి, వారి డబ్బులను వారు తిరిగి పొందడానికి CTPL లేదా CTPL భాగస్వామి సహేతుకమైన ప్రయత్నం చేస్తుంది. కస్టమర్ లేదా బాధితుడి/రాలి నిధులను బదిలీ చేసే అర్హత CTPLకు లేదా CTPL భాగస్వామికి ఉంటుంది, అయితే థర్డ్ పార్టీ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ లేదా బ్యాంక్ రీఫండ్ చేయని పేమెంట్ గేట్‌వే ఛార్జీలను ఆ నిధుల నుంచి డిడక్ట్ చేస్తారు.
14.5. ఏది ఏమైనప్పటికీ, మోసపూరిత లావాదేవీతో కొనుగోలు చేసిన CaratLane డిజిటల్ గోల్డ్ బ్యాలెన్స్‌ను మోసపూరిత యూజర్ ఇప్పటికే విక్రయించి, దానికి బదులుగా నిధులను స్వీకరించి ఉంటే, లేదా కొనుగోలు చేసిన CaratLane డిజిటల్ గోల్డ్ బ్యాలెన్స్‌ను డెలివరీ తీసుకుని ఉంటే, సదరు లావాదేవీని రివర్స్ చేయడానికి CTPL, మరియు/లేదా CTPL భాగస్వామి  బాధ్యత వహించరని స్పష్టం చేస్తున్నాము. ఇలాంటి సందర్భంలో CTPL తన సామర్థ్యం మేరకు, మోసపూరిత యూజర్‌కు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని బాధితుడికి/రాలికి లేదా సంబంధిత అధికారులకు అందిస్తుంది. ఈ సమాచారంలో, అమౌంట్ జమ అయిన బ్యాంక్ అకౌంట్ లేదా మొబైల్ వాలెట్ అకౌంట్‌ లేదా CaratLane డిజిటల్ గోల్డ్ బ్యాలెన్స్ డెలివరీ అయిన అడ్రస్ వంటి వివరాలు కూడా ఉంటాయి.
15. ప్లాట్‌ఫామ్, సేవల వినియోగం
15.1. ఇక్కడ లభించే సేవలు మీ వ్యక్తిగత వినియోగం కోసం మాత్రమే అని మీరు అంగీకరిస్తున్నారు. అలాగే CaratLane డిజిటల్ గోల్డ్ ధరలను లేదా CaratLane డిజిటల్ గోల్డ్ వివరాలను మరియు/లేదా ప్లాట్‌ఫామ్‌లో ఉన్న ఏదైనా ఇతర సమాచారాన్ని (ప్లాట్‌ఫామ్‌ను మీరు యాక్సెస్‌ చేస్తున్న నేపథ్యంలో) మరే ఇతర మాధ్యమం(medium)లో ప్రచురించరు అని అంగీకరిస్తున్నారు. మీరు సేవల ద్వారా పొందిన ఏదైనా సమాచారాన్ని, సాఫ్ట్‌వేర్‌ను, ప్రోడక్ట్‌లను లేదా సేవలను మోడిఫై చేయడం, కాపీ చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, ట్రాన్స్‌మిట్ చేయడం, డిస్‌ప్లే చేయడం, ప్రదర్శించడం, రీప్రొడ్యూస్ చేయడం, పబ్లిష్‌ చేయడం, లైసెన్స్ ఇవ్వడం, రివర్స్ ఇంజనీరింగ్ చేయడం, కాపీరైట్ పొందే ఉద్దేశంతో వర్క్‌ను రీ-క్రియేట్ చేయడం, బదిలీ చేయడం లేదా విక్రయించడం వంటివి చేయకూడదు.
15.2. ఈ నియమాలకు, ప్రైవసీ పాలసీకి లోబడి, ఇక్కడ పేర్కొన్న అంశాలకు మీరు నాన్-ఎక్స్‌క్లూజివ్, వరల్డ్‌వైడ్, రాయల్టీ-ఫ్రీ హక్కులను CTPLకు, CTPL భాగస్వామికి  ఇస్తున్నారు (ఎ) సేవలను అందించడానికి అవసరమైన మేరకు మీ డేటాను సేకరించడానికి, నిల్వ చేయడానికి, ప్రసారం చేయడానికి, ఇంకా (బి) మీరు నిర్దేశించిన లేదా ఎనేబుల్ చేసిన మేరకు సేవల ద్వారా మీ డేటాను పంపిణీ చేయడానికి, పబ్లిక్‌గా ప్రదర్శించడానికి, షేర్ చేసేందుకు లేదా ఇతర వ్యక్తులతో ఇంటరాక్ట్‌ అయ్యేందుకు అనుమతిని ఇస్తున్నారు. మీరు CaratLane డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేసేటప్పుడు లేదా కొనుగోలుకు సంబంధించిన ఏవైనా సేవల కోసం ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మీరు క్రియేట్ చేసిన ఏదైనా డేటాను, వర్తించే చట్టం ప్రకారం అవసరమైన మేరకు, ఈ విషయంలో CaratLane డిజిటల్ గోల్డ్ లేదా CTPL నిర్దేశించిన విధంగా ఏదైనా ఇతర ప్రయోజనం కోసం  ఉపయోగించేందుకు మరియు/లేదా షేర్ చేసేందుకు CTPLకు మరియు / లేదా CTPL భాగస్వామికి మీ సమ్మతిని తెలియచేస్తున్నారు. అడ్మినిస్ట్రేటర్‌గా తన బాధ్యతలను నిర్వర్తించడానికి అవసరమైన విధంగా CTPL మీ డేటాను అడ్మినిస్ట్రేటర్‌కు అందజేస్తుంది. సెక్షన్ 21లో వివరించిన గోప్యతా  బాధ్యతలను అనుసరించి మీ డేటా మెయింటైన్ చేయబడుతుంది.
15.3. మీరు ఇక్కడ పేర్కొన్న వాటికి ప్రాతినిధ్యం వహించడమే కాక, వీటికి హామీ ఇస్తున్నారు: (i) ఇక్కడ తెలిపిన విధంగా CTPLకు, CTPL భాగస్వామికి మీ మొత్తం డేటాను, ఇతర అన్ని హక్కులను ఇవ్వడానికి అవసరమైన అన్ని హక్కులను, రిలీజ్‌లను, అనుమతులను మీరు కలిగి ఉన్నారు,  అలాగే (ii) మీ డేటాను, అలాగే ఆ డేటా  CTPLకు,  CTPL భాగస్వామికి బదిలీ చేయడానికి, సదరు డేటాను ఈ సంస్థలు వినియోగించుకోవడానికి ఈ నియమాల ప్రకారం మీరు అనుమతి ఇవ్వడం ద్వారా, ఏవైనా చట్టాలు లేదా థర్డ్ పార్టీ హక్కుల ఉల్లంఘన జరగకూడదు. ఆ చట్టాలలో లేదా హక్కులలో పరిమితి లేని ఏదైనా మేధో సంపత్తి హక్కులు, ప్రైవసీ హక్కులు లేదా ప్రచార హక్కులు, ఏదైనా వినియోగం, ఇక్కడ వర్తించే ఏవైనా ప్రైవసీ పాలసీల నియమాలకు విరుద్ధంగా లేనంత వరకు డేటాను సేకరించేందుకు, బయటపెట్టేందుకు అధికారం ఇవ్వడం ఉంటుంది. ఈ నియమాలు, ప్రైవసీ పాలసీ ప్రకారం భద్రతా పరమైన బాధ్యతలు తప్పించి, మీ డేటాకు  CTPL మరియు/లేదా CTPL భాగస్వామి ఎటువంటి బాధ్యత లేదా జవాబుదారీ వహించరు. అలానే మీ డేటాకు సంబంధించి వినియోగం, బయట పెట్టడం, నిల్వ చేయడం లేదా ప్రసారం చేయడానికి పూర్తిగా మీరే బాధ్యత వహించాలని లేదా జవాబుదారీ అని ఇక్కడ స్పష్టం చేయడమైనది.
15.4. మీరు అందించిన ఏదైనా డేటాను, టెక్నికల్ వివరాలను, ఇతర అంశాలను, సమాచారాన్ని లేదా వివరాలను నష్టపోతే, తన నియంత్రణలో లేని కారణాల వల్ల ఉత్పన్నమైన డేటా నష్టం లేదా ఆలస్యం లేదా ఫోర్స్ మెజర్‌ ఈవెంట్ కారణంగా పనితీరులో వైఫల్యం వంటి వాటికి CTPL మరియు/లేదా CTPL భాగస్వామి బాధ్యత వహించవు.
15.5. CTPL తన సేవలు అందించాలకునే ప్రాంతాలను, పిన్ కోడ్‌లను నిర్ణయించునేందుకు పూర్తి విచక్షణాధికారాన్ని కలిగి ఉంటుంది.
15.6. మెయింటైనెన్స్, రిపేర్లు, అప్‌గ్రేడ్‌ పనులు లేదా నెట్‌వర్క్ లేదా ఎక్విప్‌మెంట్‌ వైఫల్యాలతో సహా ఇతర కారణాల వల్ల ప్లాట్‌ఫామ్ ద్వారా సేవలను అందించడంలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. CTPL, CTPL భాగస్వామి తమ సేవలను నిరంతరాయంగా అందిస్తూ ఉంచడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఏదైనా అంతరాయం లేదా ఆటంకం కారణంగా మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే ఏదైనా అంతరాయానికి లేదా నష్టానికి CTPL, CTPL భాగస్వామి బాధ్యత వహించవు.
15.7. CTPL తన సొంత అభీష్టానుసారం కొన్నింటిని లేదా అన్ని సేవలను, ఎప్పుడైనా, మీకు నోటీసు ఇచ్చి గానీ లేదా ఇవ్వకుండా గానీ నిలిపివేయవచ్చు.
15.8. ఇక్కడ లభించే సేవలు మీ వ్యక్తిగత వినియోగం కోసం మాత్రమేనని అని మీరు అంగీకరిస్తున్నారు. అలాగే డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేయడానికి మీరు ఖర్చు చేసిన నిధులపై రాబడికి/లాభానికి సంబంధించిన ఏదైనా హామీ ఇవ్వటాన్ని ప్లాట్‌ఫామ్ స్పష్టంగా నిరాకరిస్తుంది. గోల్డ్‌ కొనుగోలు చేయడానికి, అమ్మడానికి మాత్రమే ఈ ప్లాట్‌ఫామ్‌ ఉంది.
 

16. గోల్డ్ ఖాతా నిలిపివేత /మూసివేత
16.1. కస్టమర్‌కు సంబంధించిన CaratLane డిజిటల్ గోల్డ్ అకౌంట్‌లో మోసపూరితమైన లేదా అనుమానాస్పద చర్యలు జరుగుతున్నట్లుగా అనిపిస్తే, CTPL, CTPL భాగస్వామితో కలసికట్టుగా పని చేసి, కస్టమర్‌కు నిర్దిష్ట ఉపశమనం ఇవ్వకుండానే కస్టమర్‌ గోల్డ్ అకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. మీరు ఏదైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపంలో పాల్గొంటున్నారని లేదా ఏదైనా చట్టవిరుద్ధమైన ప్రయోజనం కోసం CaratLane డిజిటల్ గోల్డ్ అకౌంట్‌ను ఉపయోగిస్తున్నారని గుర్తించిన సందర్భంలో, CTPL, మరియు/లేదా CTPL భాగస్వామి ఈ ప్లాట్‌ఫామ్‌లోని సేవలను ఉపయోగించకుండా మిమ్మల్ని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడం లేదా నిషేధించడం లేదా ప్లాట్‌ఫామ్ ద్వారా సేవలను పొందేందుకు మీకు యాక్సెస్ లేకుండా చేయడం లేదా అటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాల గురించి సంబంధిత అధికారులకు తెలియజేయడం వంటివి సహా అందుబాటులో ఉన్న చర్యలు అన్నింటినీ తీసుకునే హక్కు CTPLకు మరియు/లేదా CTPL భాగస్వామికి ఉంది.
16.2. CTPLకు, CTPL భాగస్వామికి మధ్య ఉన్న ఒప్పందం రద్దు అయినట్లయితే లేదా CTPL భాగస్వామితో సంబంధాన్ని తెగతెంపులు చేసుకోవాలని CTPL నిర్ణయించుకున్నట్లయితే, మీ CaratLane డిజిటల్ గోల్డ్ అకౌంట్ మూతపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో, మీరు www.caratlane.comలో మీ Caratlane డిజిటల్ గోల్డ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. అలాగే CTPL తన సేవలను అందిస్తూనే ఉండవచ్చు. అంతేకాక మీ CaratLane డిజిటల్ గోల్డ్ బ్యాలెన్స్‌ను మీకు బదిలీ చేయడానికి లేదా విక్రయించడానికి తగిన సహకారం అందించవచ్చు.
16.3. ఏదైనా టెక్నికల్ లోపం లేదా ప్లాట్‌ఫామ్‌లో ఉన్న సమస్యలు, మరియు/లేదా CTPLతో ముడిపెట్టలేని ఏవైనా చర్యల వల్ల లేదా లోపాల వల్ల జరిగిన ఏదైనా నష్టానికి / లయబిలిటీకి CTPL ఏ విధంగానూ జవాబుదారీ కాదు లేదా బాధ్యత వహించదు.
16.4. మీ CaratLane డిజిటల్ గోల్డ్ అకౌంట్‌లో ఏవైనా అసంబద్ధమైన అంశాలు లేదా లోపాలు ఉంటే వాటి గురించి వెంటనే తెలియచేయాలి. అలాగే ఏ సందర్భంలో అయినా, సమస్య ఉంటే లావాదేవీ జరిగిన 10 (పది) రోజుల లోపు తప్పనిసరిగా తెలిజేయాలి; లేకపోతే, అకౌంట్‌లో ఎటువంటి లోపం లేదని లేదా సమస్య లేదని భావిస్తారు. కస్టమర్ సూచనలను, ఇతర సమాచారాన్ని (చేసిన పేమెంట్లు లేదా స్వీకరించిన పేమెంట్లతో పాటు ఇతర సమాచారం కూడా ఇందులో ఉండవచ్చు) ఇక్కడ నిర్దేశించిన నియమాలకు అనుగుణంగా, ఎలక్ట్రానిక్ రూపంలో లేదా డాక్యుమెంటరీ రూపంలో CTPL, మరియు/లేదా CTPL భాగస్వామి భద్రపరుస్తాయి. ఈ రికార్డుల్లోని సూచనలు, సమాచారం కస్టమర్లకు సంబంధించి ఖచ్చితమైన సాక్ష్యంగా పరిగణించబడుతుంది.
17. మెంబర్ అర్హత


ఇండియన్ కాంట్రాక్ట్ చట్టం, 1872 ప్రకారం చట్ట ప్రకారం కట్టుబడే కాంట్రాక్ట్‌ల్లో పాల్గొనడానికి అర్హత ఉన్న వారు, భారతదేశంలో నివసించే వారు మాత్రమే ఈ ప్లాట్‌ఫామ్‌ను, మరియు/లేదా సేవలను ఉపయోగించడానికి అర్హులు. ఇండియన్ కాంట్రాక్ట్ చట్టం, 1872లోని నిర్వచనం ప్రకారం "కాంట్రాక్ట్‌ను కుదుర్చుకునేందుకు అసమర్ధులైన" యూజర్‌లు, మైనర్‌లు, డిశ్చార్జ్ కాని దివాళాకోరులు, మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తులు ఈ ప్లాట్‌ఫామ్‌ను లేదా సేవలను ఉపయోగించడానికి అనర్హులు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు ఈ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్ చేసుకోకూడదు, ఏవైనా సేవల కోసం ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించకూడదు, లేదా ఈ ప్లాట్‌ఫామ్‌లో ఎటువంటి లావాదేవీలను చేయకూడదు. ఇలా చేసినట్లుగా CTPL దృష్టికి వచ్చినట్లయితే లేదా ఎవరైనా ఒక వ్యక్తి ప్లాట్‌ఫామ్‌ను, మరియు/లేదా ఏదైనా సేవను ఉపయోగించడానికి అనర్హుడని నిర్ధారించినట్లయితే, అటువంటి వ్యక్తి మెంబర్‌షిప్‌ను (సభ్యత్వాన్ని) రద్దు చేసే హక్కు, మరియు/లేదా ఈ ప్లాట్‌ఫామ్‌ను ఆ వ్యక్తి యాక్సెస్‌ చేయకుండా, మరియు/లేదా ఏదైనా సేవలను పొందకుండా చేసే హక్కు  CTPLకు ఉంటుంది.
18. సంబంధం లేని పరిస్థితులు
18.1. బంగారాన్ని కొనుగోలు చేయడం/అమ్మడం వంటి నిర్ణయాలు తీసుకోవడానికి మీకు తగినంత అనుభవం, జ్ఞానం ఉందని మీరు CTPLకు, CTPL భాగస్వామికి తెలియచేయటమే కాకుండా ఆ మేరకు హామీ ఇస్తున్నారు. CTPL లేదా CTPL భాగస్వామి అందుబాటులో ఉంచిన ఏ సమాచారంపైనా ఆధారపడటం లేదని, అలానే CTPL లేదా CTPL భాగస్వామి, గోల్డ్‌ను కొనుగోలు చేసే / తిరిగి విక్రయించే  విషయంలో ఎలాంటి సిఫార్సు చేయడం లేదని మీరు అంగీకరిస్తున్నారు. విక్రేత-కొనుగోలుదారు సంబంధం మినహా ఏదైనా ఏజెంట్-ప్రిన్సిపల్ సంబంధం, ఏదైనా అడ్వయిజర్ - అడ్వయిజీ సంబంధం, ఏదైనా ఉద్యోగి-యజమాని సంబంధం, ఏదైనా ఫ్రాంఛైజీ-ఫ్రాంచైజర్ సంబంధం, ఏదైనా జాయింట్ వెంచర్ సంబంధం లేదా ఏదైనా భాగస్వామ్య సంబంధం సహా, వీటికి మాత్రమే పరిమితం కాకుండా, మరే ఇతర సంబంధం మీకు, CTPLకు మరియు/లేదా CTPL భాగస్వామి మధ్యన లేదు.
18.2. CTPL, CTPL భాగస్వామి ఏదైనా పెట్టుబడి ఉత్పత్తిని ఇవ్వడం / డీల్ చేయడం / అందించడం లేదని, అలానే రాబడి వస్తుందనే గ్యారెంటీని / ఖచ్చితంగా రాబడి వస్తుందనే హామీని ఇవ్వట్లేదని మీరు గుర్తిస్తున్నారు. అలాగే గోల్డ్ విలువ వివిధ రకాల ఫ్యాక్టర్స్, శక్తులపై ఆధారపడి ఉంటుందని కూడా మీరు అంగీకరిస్తున్నారు.
19. ఎలక్ట్రానిక్ ఆర్డర్ రిస్క్‌లు
కమర్షియల్ ఇంటర్నెట్ సేవా సంస్థలు 100% ఆధారపడ తగ్గవి కాదు. ఈ సేవా సంస్థల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా విఫలమైనట్లయితే ఇంటర్నెట్ ఆధారిత ఆర్డర్ ఎంట్రీ ప్రభావితం కావచ్చు. ఆర్డర్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఎలక్ట్రానిక్ మెకానికల్ సిస్టమ్ అని, CTPL లేదా CTPL భాగస్వామి నియంత్రణకు మించి అది విఫలం కావడానికి అవకాశం ఉంటుంది అని మీరు అంగీకరిస్తున్నారు. దీని ఫలితంగా తలెత్తిన తప్పులకు, నిర్లక్ష్యానికి, ఆర్డర్‌లను పూర్తి చేయలేకపోవడానికి, సమాచారాన్ని చేరవేయడంలో, డెలివరీ చేయడంలో ఆలస్యానికి, లేదా ట్రాన్స్‌మిషన్ లేదా కమ్యూనికేషన్ సౌకర్యాలు (ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానించడానికి ఉపయోగించిన ఏదైనా పరికరంతో సహా) పని చేయకపోవడానికి, లేదా విఫలమైన కారణంగా ఆర్డర్‌లు పూర్తి చేయడంలో ఆలస్యానికి, లేదా CTPL లేదా CTPL భాగస్వామి నియంత్రణలో లేని, లేదా ముందస్తు అంచనాకు అందని కారణాలతో తలెత్తిన ఇబ్బందులకు CTPL, లేదా CTPL భాగస్వామి బాధ్యత వహించదు. 
20. ఫీడ్‌బ్యాక్‌
20.1. ప్లాట్‌ఫామ్‌ను, యూజర్ ఎక్స్‌పీరియెన్స్‌ను మెరుగుపరచడానికి,  ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తున్నప్పుడు మీ అనుభవాన్ని వివరించడానికి ("సమీక్షలు"), CTPL విచక్షణాధికారం మేరకు, ఈ ప్లాట్‌ఫామ్ మీకు ఒక అవకాశాన్ని కల్పించవచ్చు.
20.2. మీరు ఇలా చేయడం ద్వారా CTPLకు మరియు/లేదా CTPL భాగస్వామికి శాశ్వతమైన, వెనక్కి తీసుకోలేని, వరల్డ్‌వైడ్, రాయల్టీ లేని, సబ్-లైసెన్స్ హక్కును ఇవ్వడంతో పాటు, CTPL, మరియు/లేదా CTPL భాగస్వామి సముచితమని భావించిన మీ రివ్యూను ఉపయోగించడానికి, కాపీ చేయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి, డిస్‌ప్లే చేయడానికి, పబ్లిష్‌ చేయడానికి, ట్రాన్స్‌మిట్ చేయడానికి, అందుబాటులో ఉంచడానికి, రీప్రొడ్యూస్ చేయడానికి, మోడిఫై చేయడానికి, అందులోని ఉపయోగకర సమాచారాన్ని స్వీకరించడానికి లైసెన్స్‌ను మంజూరు చేస్తున్నారు. ఈ వినియోగం అనేది ప్రింట్‌కు, బ్రాడ్‌కాస్ట్‌కు, ఆన్‌లైన్‌కు, CTPL భాగస్వామికి చెందిన ఏదైనా ఒక వెబ్‌సైట్‌కు, అన్ని వెబ్‌సైట్‌లకు, ప్లాట్‌ఫామ్‌లకు వర్తిస్తుంది. ఇక్కడ పేర్కొన్నవే కాకుండా ఇతరత్రా వేదికలు కూడా ఉండవచ్చు. 
20.3. ప్లాట్‌ఫామ్‌లో ఏవైనా రివ్యూలను పోస్ట్ చేసేటప్పుడు మీరు ఎలాంటి అభ్యంతరకరమైన, అవమానకరమైన, దుర్భాషలాడుతున్న, ద్వేషపూరితమైన లేదా జాతిపరంగా లేదా తెగల పరంగా అభ్యంతరకరమైన భాషను ఉపయోగించకూడదని మీరు అర్థం చేసుకోవటంతో పాటు, ఇందుకు కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నారు. అలానే, మీరు ప్లాట్‌ఫామ్‌లోని ఏ విభాగంలోనైనా అశ్లీల, నీలిచిత్రాలు, మహిళలను అసభ్యకరంగా చిత్రించే (నిషేధం) చట్టం, 1986లో పేర్కొన్న "మహిళలను అసభ్యకరంగా చిత్రించిన" అంశాలు ఉన్న ఏ కంటెంట్‌నూ పోస్ట్ చేయకూడదు.

21. గోప్యత
ప్రైవసీ పాలసీలో వివరించినట్లుగా, CTPL, CTPL భాగస్వామి మీ వ్యక్తిగత సమాచారంతో పాటు గోప్యమైన సమాచారం మొత్తాన్నీ చాలా గోప్యంగా ఉంచుతారు. మీ అంగీకారం పొందిన తర్వాత లేదా చట్టం ప్రకారం అవసరమైనప్పుడు తప్ప, మిగిలిన సందర్భాలలో గోప్యమైన సమాచారాన్ని ఎవరికీ వెల్లడించరు. తమ సొంత రహస్య సమాచారాన్ని రక్షించుకునేందుకు CTPL, CTPL భాగస్వామి ఎంత ప్రాధాన్యతను ఇస్తాయో, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటాయో, అదే స్థాయిలో మీ గోప్యమైన సమాచారానికి భద్రత కల్పిస్తాయి. ఇక్కడ పేర్కొన్న ప్రయోజనాల మేరకు, గోప్యమైన సమాచారాన్ని ఉద్యోగులు, డైరెక్టర్లు, ఏజెంట్లు, కాంట్రాక్టర్లు మాత్రమే ఉపయోగిస్తారని CTPL, CTPL భాగస్వామి తెలియజేస్తున్నాయి. అలాగే ఉద్యోగులు, డైరెక్టర్లు, ఏజెంట్లు, కాంట్రాక్టర్లు ఈ ప్రైవసీ నియమాలను అర్థం చేసుకునేలా, సొంత సమాచారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అదే స్థాయిలో ఈ గోప్యతా నియమాలకు కట్టుబడి ఉండేలా చేసేందుకు CTPL, CTPL భాగస్వామి తగు చర్యలను వీలైనంత వరకు తీసుకుంటాయి.
22. కంటెంట్ & మేధో సంపత్తి హక్కులు
22.1. CTPL అందిస్తున్న, అలాగే ప్లాట్‌ఫామ్‌లో ఉన్న/యాక్సెస్ చేస్తున్న సేవలకు సంబంధించిన వివిధ కాపీరైట్‌లు, ట్రేడ్‌మార్క్‌లు, సర్వీస్ మార్క్‌లు, లోగోలు, వాణిజ్య పేర్లు, ఇతర మేధోపరమైన మరియు యాజమాన్య హక్కులపైన CTPLకు సంపూర్ణ, ప్రత్యేక అధికారాలు ఉంటాయి. వర్తించే భారతదేశ చట్టాల ప్రకారం వీటన్నింటికీ భద్రత ఉంటుంది.
22.2. సేవలు అన్నీ కూడా CTPL డెవలప్ చేసిన, కంపైల్ చేసిన, ప్రిపేర్ చేసిన, రివైజ్ చేసిన, సెలెక్ట్ చేసిన, ఆర్గనైజ్ చేసిన ఒరిజినల్ వర్క్స్ అని మీరు అంగీకరిస్తున్నారు. వీటిని డెవలప్‌ చేసి, అప్లయి చేయడానికి CTPL నిరూపితమైన ప్రమాణాలను, పద్ధతులను ఉపయోగించిందని, విలువైన సమయాన్ని, శ్రమను, డబ్బును, అలాగే CTPLకు, దాంతో పాటు ఇతరులకు చెందిన మేధో సంపత్తిని వినియోగించింది అని మీరు గుర్తిస్తున్నారు. అందువల్ల, ఈ నియమాలు అమలులో ఉన్న వ్యవధిలోను, ఆ తర్వాత కూడా CTPL యాజమాన్య హక్కులను రక్షించడానికి మీరు అంగీకరిస్తున్నారు. మీరు కాపీరైట్ నోటీసులను సమర్పించకుండా ప్లాట్‌ఫామ్‌లోని ఏదైనా కొంత భాగాన్ని డౌన్‌లోడ్ చేయలేరు. ఈ నియమాల్లో పేర్కొన్న ప్రయోజనం కోసం మాత్రమే ప్లాట్‌ఫామ్ నుండి మెటీరియల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
22.3. ఏదైనా నియమాన్ని మీరు ఉల్లంఘిస్తే, ఈ దేశంలో వర్తించే చట్టాల ప్రకారం అందుబాటులో ఉన్న పరిష్కారాలను పొందడం కోసం, సంబంధిత ఫోరమ్‌లో మీపై చట్టపరమైన చర్య తీసుకోబడుతుంది.
23. థర్డ్ పార్టీల వెబ్‌సైట్‌లకు/అప్లికేషన్‌లకు/నుండి లింక్‌లు
ఈ ప్లాట్‌ఫామ్‌లో థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లతో ఇంటరాక్ట్ అయ్యే లింక్‌లు, ఇంటరాక్టివ్ ఫీచర్‌లు ఉండవచ్చు. అటువంటి వెబ్‌సైట్‌ల పనితీరు, చర్యలు, చర్యలు తీసుకోలేకపోవడం, ప్రైవసీ సెట్టింగ్‌లు, ప్రైవసీ పాలసీలు, షరతులు, లేదా కంటెంట్‌ విషయంలో CTPL లేదా CTPL భాగస్వామి ఎటువంటి బాధ్యత వహించవవు. దీనికి సంబంధించి ఈ రెండింటిలో ఏ పక్షానికీ ఎటువంటి బాధ్యతా ఉండదు. అటువంటి వెబ్‌సైట్‌తో కమ్యూనికేట్ చేయడానికి ఏదైనా షేరింగ్ ఫంక్షన్‌లను ప్రారంభించే ముందు లేదా అలాంటి వెబ్‌సైట్‌ను సందర్శించే ముందు మీరు ఆ థర్డ్ పార్టీ వెబ్‌సైట్ నియమాలను, షరతులను, ప్రైవసీ పాలసీలను, సెట్టింగ్‌లను, ఇన్ఫర్మేషన్-షేరింగ్ ఫీచర్లను సమీక్షించి, అర్థం చేసుకున్న తర్వాతనే ముందుకు కొనసాగాలని CTPL, CTPL భాగస్వామి స్పష్టంగా సూచిస్తున్నాయి. 
24. నష్టపరిహారం
ఈ కింద ప్రస్తావించిన చర్యలు లేదా వాటి ఫలితంగా తలెత్తిన పర్యవసనాల వల్ల CTPL మరియు/ లేదా CTPL భాగస్వామి మరియు/లేదా దాని ఉద్యోగులు, ఏజెంట్లు, వర్కర్లు లేదా ప్రతినిధులు ఏ సమయంలో నష్టపోయినా, ఇబ్బందికి గురైనా, బాధపడినా, అలాంటప్పుడు తీసుకోబోయే అన్ని చర్యలకు, క్లెయిమ్‌లకు, డిమాండ్లకు, ప్రొసీడింగ్‌లకు, నష్టాలకు, హానికి, ఖర్చులకు, ఛార్జీలకు, ఆర్థిక భారాలకు, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, ఏవైనా (“నష్టాలు”) నష్టాలకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత నుంచి CTPL, CTPL భాగస్వామిని మీరు తప్పించడమే కాక, ఆ నష్ట పరిహారాన్ని మీరే భరిస్తారని అంగీకరిస్తున్నారు.             (i) మీరు, ప్లాట్‌ఫామ్‌ను, సేవలను వినియోగించడం వల్ల మరియు/లేదా ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేయడానికి మీరు ఏదైనా పరికరాన్ని ఉపయోగించడం వల్ల; (ii) మీ మీద ఉన్న పూర్తి విశ్వాసంతో లేదా మీ సూచనల మీద ఉన్న నమ్మకంతో CTPL మరియు/లేదా CTPL భాగస్వామి చర్యలు తీసుకోవడం లేదా తీసుకోకపోవడం వల్ల తలెత్తిన, అలానే మీ నిర్లక్ష్యం, పొరపాటు, దుష్ప్రవర్తన వల్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తలెత్తిన నష్టం; (iii) గోల్డ్ అకౌంట్‌కు సంబంధించిన నియమాలను మీరు ఉల్లంఘించడం లేదా పాటించకపోవడం; మరియు/లేదా (iv) మీరు చేసిన లావాదేవీ వెనుక మోసపూరిత ఉద్దేశం ఉండటం లేదా నిజాయితీ లేకపోవడం.
25. వారెంటీల గురించి స్పష్టమైన ప్రకటన
ప్లాట్‌ఫామ్ (అన్నింటినీ కలిపి, "కంటెంట్‌లు" అని అంటారు) ద్వారా మీ కోసం అందుబాటులో ఉంచిన లేదా అందుబాటులో ఉన్న సమాచారం, కంటెంట్, మెటీరియల్‌లు, సేవలు అన్నింటినీ “ఇప్పుడు ఎలా ఉంటే అలా”, “ఇప్పుడు అందుబాటులో ఉన్నట్లుగానే” ప్రాతిపదికన, ఎటువంటి ప్రాతినిధ్యాలు, వారెంటీలు లేకుండా CTPL, CTPL భాగస్వామి అందిస్తాయి. ప్లాట్‌ఫామ్ ఆపరేషన్ గురించి, దానిలోని కంటెంట్‌లు ఖచ్చితమైనవేనా లేదా సంపూర్ణమైనవేనా అని, అలానే ఆ సమాచారం ఖచ్చితత్వానికి సంబంధించి CTPL మరియు/లేదా CTPL భాగస్వామి ఎలాంటి ప్రాతినిధ్యాలను లేదా వారెంటీలను ఇవ్వవు, వ్యక్తీకరించవు లేదా సూచించవు. ఏదైనా కంటెంట్, మెటీరియల్, డాక్యుమెంట్ లేదా సమాచారం డౌన్‌లోడ్ చేయడం వల్ల మీ కంప్యూటర్ సిస్టమ్‌కు ఏదైనా నష్టం కలిగినా లేదా డేటా నష్టపోయినా లేదా ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం వల్ల ఇతర రూపాల్లో కలిగిన నష్టాలకు CTPL మరియు/లేదా CTPL భాగస్వామి బాధ్యత వహించదు. ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం వల్ల కలిగే ఏ నష్టానికైనా పూర్తిగా మీరే బాధ్యులని గుర్తించి అంగీకరిస్తున్నారు. ప్లాట్‌ఫామ్‌ను లేదా సేవలను లేదా కంటెంట్‌లను ఉపయోగించడం వల్ల ఏ రూపంలోనైనా ఎలాంటి నష్టాలు జరిగినా, అంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా, శిక్షకు గురయ్యే, అలానే పర్యవసానాల వల్ల కలిగే నష్టాలతో సహా, అయితే వీటికే పరిమితం కాకుండా, ఎలాంటి నష్టాలకైనా CTPL మరియు/లేదా CTPL భాగస్వామి బాధ్యత వహించదు. రాతపూర్వకంగా నిర్దేశించిన వాటికి మినహాయింపు ఉంటుంది. చట్టం అనుమతించిన మేరకు, ప్లాట్‌ఫామ్‌ (లేదా ఏదైనా భాగానికి), అలానే దానిలోని కంటెంట్‌లకు సంబంధించి ప్రాతినిధ్యాలను, వారెంటీలను CTPL మరియు/లేదా CTPL భాగస్వామి క్లెయిమ్ చేయదు, అలానే టైటిల్ వారెంటీలను ఇవ్వదు, వ్యాపారం చేయతగినది అని, అలానే ఏదైనా వినియోగానికి లేదా పనికి సరిపోతుందని వంటి విషయాలను చెప్పదు లేదా  సూచించదు. ఇలా క్లెయిమ్ చేయని అంశాలు వీటికి మాత్రమే పరిమితం కావు.


26. భారాలకు ఉన్న పరిమితులు
ఏదైనా ప్రత్యేకమైన, పర్యవసానమైన, యాదృచ్ఛికమైన, శిక్షింపదగిన లేదా పనిష్ చేయదగిన నష్టాలకు లేదా నష్టం, లాభం లేదా ఆదాయాల విషయంలో CTPL మరియు/లేదా CTPL భాగస్వామి (దాని డైరెక్టర్లు, ఉద్యోగులు, ఏజెంట్లు లేదా భాగస్వాములతో సహా) మీకు జవాబుదారీ కాదని మీరు ఇక్కడ అంగీకరిస్తున్నారు. మీరు ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేయలేకపోవడం లేదా ఏదైనా సర్వీసుల కోసం యాక్సెస్ చేస్తున్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవడం,  ఏవైనా బగ్‌లు, వైరస్‌లు, ట్రోజన్ హార్స్‌లు, లేదా అటువంటివి ప్లాట్‌ఫామ్ లోకి ట్రాన్స్‌మిట్‌ కావడం లేదా థర్డ్ పార్టీ ద్వారా రావడం, మీ డేటాను నష్టపోవడం, సర్వీసుల విషయంలో మీ డేటాకు లేదా కంటెంట్‌కు సంబంధించి ఏదైనా క్లెయిమ్ చేసినా మరియు/లేదా CaratLane డిజిటల్ గోల్డ్ ఖాతా సమాచారాన్ని సురక్షితంగా, గోప్యంగా ఉంచడంలో మీరు విఫలమవ్వడం వంటి పర్యవసనాల కారణంగా ఏదైనా నష్టం జరిగినప్పుడు, అది ఎలాంటి పరిస్థితుల్లో జరిగినప్పటికీ CTPL మరియు/లేదా CTPL భాగస్వామి ఎటువంటి బాధ్యత వహించదు.

CTPL భాగస్వామి, ఎవరైనా మధ్యవర్తులు లేదా ఏదైనా ఇతర థర్డ్ పార్టీ, అది ఎవరైనప్పటికీ(వీటికి మాత్రమే పరిమితం కాదు), ఎవరైనా వ్యక్తి, వారి ఫోన్‌ను ఉపయోగించి మీరు ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేసినట్లయితే మరియు/లేదా గోల్డ్ కొనుగోలు చేసేటప్పుడు మీ నుండి పేమెంట్లను స్వీకరించేందుకు/సేకరించేందుకు CTPL భాగస్వామి నియమించిన/నామినేట్ చేసిన ఎవరైనా వ్యక్తి చేసిన ఏదైనా లేదా అన్ని పనులకు లేదా వాటిని చేయకపోవడానికి ఏ విధంగానూ CTPL బాధ్యత వహించదని కూడా మీరు అంగీకరిస్తున్నారు. అదేవిధంగా, ఏదైనా థర్డ్ పార్టీ, CTPL లేదా ఇతర మధ్యవర్తులు చేసే ఏదైనా చర్య, చర్యలు అన్నింటికీ CTPL భాగస్వామి ఏ విధంగానూ బాధ్యత వహించదు.


27. సవరణలు, నియమాల ఆమోదం
27.1. ఏ సమయంలోనైనా ఈ నియమాలలోని ఏదైనా భాగాన్ని మార్చడానికి, సవరించడానికి, యాడ్ చేయడానికి లేదా తీసివేయడానికి CTPLకు పూర్తి హక్కు ఉంది. అలాంటి మార్పులు ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేయబడతాయి. అలాగే వాటిని ముందుగానే కస్టమర్‌కు తెలియజేయడం జరుగుతుంది. దీనికి విరుద్ధంగా ఉన్నది ఏదయినా అంగీకరించబడదు, అలాగే ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసిన సవరణలతో సహా నియమాలను క్రమం తప్పకుండా కస్టమర్ సమీక్షించాలి. ప్లాట్‌ఫామ్‌ వినియోగించడాన్ని కొనసాగించినట్లయితే, సవరించిన నియమాలను ఆమోదించినట్లుగానే పరిగణిస్తారు.
27.2. ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేసినా, బ్రౌజ్ చేసినా లేదా ఇతర మార్గాల్లో ఉపయోగించినా, ఈ నియమాల ప్రకారం అన్ని నియమాలను, షరతులను మీరు అంగీకరించినట్లుగానే భావించబడుతుంది. మీరు ముందుకు కొనసాగే ముందు ఈ నియమాలను జాగ్రత్తగా చదవాలని సూచించడమైనది. ఈ నియమాలను పరోక్షంగా లేదా స్పష్టంగా అంగీకరించడం ద్వారా, ఎప్పటికప్పుడు సవరించిన CTPL, CTPL భాగస్వామి (“ప్రైవసీ పాలసీ”) ప్రైవసీ పాలసీతో సహా, వీటికే పరిమితం కాకుండా, అన్ని విధానాలకు కట్టుబడి ఉండటానికి మీరు అంగీకరించి, సమ్మతిని తెలుపుతున్నారు. మీరు CTPL భాగస్వామి ప్రైవసీ పాలసీని ప్లాట్‌ఫామ్‌లో,  CTPL ప్రైవసీ పాలసీని www.caratlane.comలో చూసి, సమీక్షించవచ్చు.

వాల్ట్ చిరునామా:
B.V.C. లాజిస్టిక్స్ ప్రైవేట్ లి.
ప్లాట్ నెం. 35, సుక్రుత్ బిల్డింగ్, తరుణ్ భారత్ CHS LTD సహర్ రోడ్,
ఓరియంటల్ ఆస్టర్ హోటల్ ఎదురుగా JB నగర్,
 అంధేరీ ఈస్ట్, ముంబాయి -  400 099
అడ్మినిస్ట్రేటర్ చిరునామా:
B. N. వైద్య & అసోసియేట్స్
గ్రౌండ్ ఫ్లోర్, వైద్య భవన్ 
నెం. 2, అనంత్‌వాడి, 92 ఆత్మారామ్ మర్చంట్ రోడ్, ఆదర్శ్ బాగ్ హోట్ దగ్గర
ముంబాయి – 400002
నామినీ: నామినీ వివరాలను సమర్పించడం కోసం దయచేసి [email protected]కు మెయిల్ చేయండి.