MMTC – PAMP నియమ, నిబంధనలు

ఈ “నియమ, నిబంధనలు” (“నియమాలు”) అనేవి MMTC-PAMP, PhonePe, కస్టమర్ (పార్టీలు)ల మధ్య వర్తించే చట్టాల అర్థానికి లోబడి ఉండి, చట్టబద్ధంగా అమలయ్యేలా నిర్మితమైన ఒక ఎలక్ట్రానిక్ రికార్డ్. ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్ అనేది కంప్యూటర్ సిస్టమ్ ద్వారా తయారు చేయబడింది కాబట్టి, ఎలాంటి భౌతిక లేదా డిజిటల్ సంతకాలు అవసరం లేదు. ఒకరు లేదా ఇద్దరు పార్టీల మధ్య కాలానుగుణంగా చేసుకునే ఇతర ఏవైనా నియమాలు ఉంటే, వాటికి తక్కువ కాకుండా, వాటితో సమానంగా ఈ నియమాలు చెల్లుబాటు అవుతాయి. వారి వారి ప్లాట్‌ఫామ్‌ల (వెబ్‌సైట్, మొబైల్ యాప్స్, ఇతరాలు)లో ఈ నియమ, నిబంధనలను MMTC-PAMP, MMTC-PAMP భాగస్వాములు హోస్ట్ చేయడం/ప్రదర్శించడం/ప్రచురించడం ద్వారా వారు ఈ నియమ, నిబంధనలకు అంగీకరిస్తున్నట్లుగా పరిగణించబడుతుంది. ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేయడం, లావాదేవీలు చేయడం ద్వారా కస్టమర్ కూడా ఈ నియమ, నిబంధనలను అంగీకరిస్తున్నట్లుగా పరిగణించబడుతుంది.

1. ఈ నియమ, నిబంధనలలో పదాల అర్థాలు ఇలా ఉంటాయి:

(a) “GAP” అంటే MMTC-PAMP అందించే బంగారం సేకరణ ప్లాన్ (బంగారం సమీకరణ ప్లాన్).

(b) “MMTC-PAMP భాగస్వామి” అనేది PhonePeను సూచిస్తుంది. MMTC-PAMP అందించే GAP కోసం ప్లాట్‌ఫామ్ ద్వారా పేమెంట్‌లను సేకరించే సదుపాయాన్ని అందించే సంస్థ.

(c) “ప్లాట్‌ఫామ్” అంటే మొబైల్ యాప్స్, PhonePe వారి ఇతర ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌లు అని అర్థం. MMTC-PAMP వారు అందించే ఏవైనా ఉత్పత్తులు, సేవల కోసం పేమెంట్‌లు చేయడానికి కస్టమర్‌లు వీటిని యాక్సెస్ చేస్తారు.

(e) “మీరు/మీకు/మీ”, or “కస్టమర్” అంటే MMTC-PAMP ద్వారా అందించబడే GAP సేవలకోసం ప్లాట్‌ఫామ్‌లో లావాదేవీలు చేసే కౌంటర్ పార్టీ అని అర్థం.

(e) “మేము”, “మాకు” and “మా” అంటే MMTC-PAMP ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని అర్థం.

(f) “సేవా సంస్థలు” అంటే MMTC-PAMP లేదా MMTC-PAMP PARTNERతో ఉన్న స్వతంత్ర థర్డ్ పార్టీ సేవా సంస్థలు.

2. ఈ నియమాలు ఎప్పుడైనా సవరించే హక్కు మాకు ఉంది. ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసిన సమయంలో అలాంటి సవరణల అమలు, వర్తింపు గురించి కస్టమర్‌లకు తెలియజేయబడుతుంది. ఇందుకు విరుద్ధంగా ఉండకుండా జరిగేలా, కస్టమర్‌లు ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేయబడే నియమ, నిబంధనలు, వాటి సవరణలను తరచుగా సమీక్షిస్తుండాలి, అలాగే ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా నియమ, నిబంధనలను అంగీకరిస్తూ, వాటికి లోబడి ఉండాలి.

3. చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా కస్టమర్ అందించిన సంబంధిత సమాచారం, డాక్యుమెంట్‌లను సేకరించే, భద్రపరిచే హక్కు MMTC-PAMP/ MMTC-PAMP భాగస్వామికి ఉంది.

4. MMTC-PAMP / MMTC-PAMP భాగస్వామి అవసరాలను బట్టి, KYC వివరాలను సంతృప్తిపరచడానికి అదనపు డాక్యుమెంట్‌లను కస్టమర్ అందించాల్సి ఉంటుంది. మీ గుర్తింపును చెల్లుబాటు చేయడానికి వీలుగా MMTC-PAMP, MMTC-PAMP భాగస్వామిలు అవసరానికి అనుగుణంగా అలాంటి విచారణలు చేయడానికి మీరు అధికారాన్ని ఇస్తున్నారు. మీ ప్రస్తుత సమాచారంలో లేదా మీరు అందించిన వెరిఫికేషన్ డాక్యుమెంట్‌లలో ఏవైనా మార్పు(లు) ఉన్నట్లయితే MMTC-PAMP, MMTC-PAMP భాగస్వామిలకు అప్‌డేట్ చేయాల్సిన బాధ్యతను మీరే తీసుకున్నారు.

5. ఎప్పటికప్పుడు సమాచారం సరైనదా కాదా అని MMTC-PAMP / MMTC-PAMP భాగస్వామికి తెలియజేసే బాధ్యత మీదే. ఒకవేళ MMTC-PAMP / MMTC-PAMP భాగస్వామికి అందించిన సమాచారంలో తప్పు ఉందని మీకు అనిపిస్తే, మీరు రాతపూర్వకంగా MMTC-PAMP / MMTC-PAMP భాగస్వామికి వెంటనే తెలియజేయడంతో పాటు, సరైన / అప్‌డేట్ చేసిన సమాచారాన్ని అందించాలి.

6. కస్టమర్ పేరు మీద MMTC-PAMP తరఫున బంగారం సేకరణ ప్లాన్ (GAP) ఖాతాను తెరిచే ప్రక్రియను ప్రారంభించడానికి మీరు MMTC-PAMP భాగస్వామిను ఆథరైజ్ చేస్తున్నారు. బంగారం సేకరణ ప్లాన్ (GAP) ఖాతాలో బంగారాన్ని కేటాయించేటప్పుడు దానికి లోబడి మీరు చెల్లించిన మొత్తం(మొత్తాలు) అంతా వర్తించే పన్నులు/ఛార్జీలకు లోబడి ఉంటుంది.  MMTC-PAMP/MMTC-PAMP భాగస్వామికి కస్టమర్ ఇచ్చిన సూచనల మేరకు, బంగారం బ్యాలెన్స్‌ను రిడీమ్ చేయగల ఉత్పత్తులుగా రిడీమ్ చేసినప్పుడు GAP ఖాతా నుండి డెబిట్ చేయబడుతుంది. రిడీమ్ చేసే సమయంలో, రిడీమ్ చేయగల ఉత్పత్తుల కేటలాగ్ నుండి రిడీమ్ చేసుకోవాలనుకున్న ఉత్పత్తిని కస్టమర్ ఎంచుకోవచ్చు. కేటలాగ్‌లో రిడీమ్ చేయగల ఉత్పత్తుల లిస్ట్, వివరాలు ఉంటాయి, అవి ప్లాట్‌ఫామ్‌లో కనిపిస్తాయి. MMTC-PAMP స్వీయ విచక్షణ మేరకు రిడీమ్ చేయగల ఉత్పత్తుల జాబితాను ఎప్పటికప్పుడు మార్చవచ్చు, సవరించవచ్చు, సంస్కరించవచ్చు.

7. KYC డాక్యుమెంట్‌లు / సమాచారం తప్పు అని తేలిన సందర్భంలో లేదా డాక్యుమెంట్‌లు / సమాచారం సందేహాస్పదంగా ఉన్న సందర్భంలో మీకు నోటీసు ఇచ్చి లేదా ఏ నోటీసు ఇవ్వకుండా కూడా MMTC-PAMP భాగస్వామితో కలిసి మీ బంగారం ఖాతాను రద్దు చేసే హక్కు MMTC-PAMP ఉంది. మీ గుర్తింపును నిరూపించుకోకవడం, మీ ఖాతాను ఎప్పుటికప్పుడు వ్యాలిడేట్ చేయకపోవడం మరియు /  లేదా KYC డాక్యుమెంట్‌లు / సమాచారంలో ఏదైనా తప్పిదం ఉండటం వల్ల ఏవైనా నష్టాలు, క్లెయిమ్‌లు, లయబిలిటీ ఖర్చుల లాంటివి తలెత్తితే అలాంటి వాటి నష్టపరిహారాన్ని MMTC-PAMP, MMTC-PAMP భాగస్వామికి చెల్లించడానికి మీరు అంగీకరిస్తున్నారు.

8. కనీస విలువతో, అలాగే ప్లాట్‌ఫామ్‌లో చూపించిన లైవ్ విక్రయ ధర ప్రకారం 999.9 స్వచ్ఛత గల బంగారాన్ని మీరు కొనుగోలు చేయవచ్చు.

9. మీ కార్డ్, వాలెట్, UPI లేదా  ప్లాట్‌ఫామ్‌లో అంగీకరించబడే, అందుబాటులో ఉన్న ఏదైనా పేమెంట్ ఆప్షన్ ఉపయోగించి పేమెంట్ చేయవచ్చు. మీరు బంగారం SIPలను కూడా ఎంచుకోవచ్చు, బంగారం SIP ఎంచుకోవడం ద్వారా UPI పేమెంట్ ఆప్షన్ ఉపయోగించుకొని రికరింగ్ పేమెంట్‌లు చేయవచ్చు. కొనుగోలు / రిడంప్షన్ / పున:విక్రయం సమయంలో ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా సంబంధిత పన్నులు వర్తించబడతాయి.

10. భౌతికంగా డెలివరీ చేయాల్సిన ఉత్పత్తిని రిడంప్షన్ చేస్తున్న సమయంలో, దాని తయారీ, డెలివరీ ఛార్జీలు, వాటికి వర్తించే పన్నులను కస్టమర్ చెల్లించాల్సి ఉంటుంది. కేటలాగ్ నుండి ఎంచుకున్న రిడీమ్ చేయగల ఉత్పత్తి డెలివరీ అనేది MMTC-PAMP వద్ద దాని స్టాక్ అందుబాటుకు లోబడి ఉంటుంది.

11. కస్టమర్ కొనుగోలు చేసిన ప్రతి నిర్ధారిత బంగారం కోసం, MMTC-PAMP అనేది ఆ బంగారానికి దిగువ తెలిపిన మేరకు కస్టోడియన్‌గా ఉంటుంది:
    (a)కస్టమర్ పున:విక్రయం చేసేవరకు,
    (b) కస్టమర్ రిడంప్షన్ చేసే వరకు, లేదా
    (c) కస్టడీ వ్యవధి ముగిసే వరకు.

ఈ నియమాల ఉపయోగం మేరకు, ‘కస్టడీ వ్యవధి’ అంటే బంగారాన్ని MMTC-PAMP భద్రపరిచే కాలవ్యవధి.  “ఉచిత కస్టడీ వ్యవధి” అంటే కస్టమర్ చేసిన ప్రతి బంగారం కొనుగోలు నుండి 5 సంవత్సరాల కాలం. ఈ కాలానికి గాను స్టోరేజీ సంబంధిత ఛార్జీలు వర్తించబడవు. ఉచిత కస్టడీ వ్యవధి ముగిసిన తర్వాత, దానికి సంబంధించిన ఛార్జీలు MMTC-PAMP ద్వారా వర్తించబడతాయి. మీరు కొనుగోలు చేసిన బంగారం లేదా మీ బంగారం ఖాతాకు బదిలీ చేయబడిన బంగారం అనేవి పూర్తి ఇన్సూరెన్స్ కవర్‌తో అత్యంత అడ్వాన్స్‌డ్, సురక్షితమైన MMTC-PAMP వాల్ట్‌కు కేటాయించబడి, స్టోర్ చేయబడతాయి.

12. MMTC-PAMP అందిస్తోన్న రిడీమ్ చేయగల ఉత్పత్తుల రూపంలో, సమీకరించిన బంగారం మొత్తం లేదా అందులో కొంత భాగాన్ని భౌతికంగా డెలివరీ కోసం రిడీమ్ చేసుకోగల సదుపాయం కస్టమర్‌కు ఉంది. మీరు రిడీమ్ చేసి తీసుకోగా / బదిలీ చేసుకోగా మిగిలిన కొంత బంగారాన్ని, మీరు మళ్లీ మాకు లైవ్‌లో 999.9 స్వచ్ఛత గల బంగారానికి ఉన్న పున:విక్రయ ధరతో విక్రయించవచ్చు,  అలా మీరు విక్రయించిన మిగిలిన బంగారానికి సంబంధించిన డబ్బు, మీరు నిర్ణయించిన బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ చేయబడుతుంది.

13. మీ వైపు నుండి రిడంప్షన్ ప్రారంభమై, పేమెంట్ అందగానే, అందుకు సరిసమానమైన బంగారం బరువు మీ బంగారం ఖాతా నుండి డెబిట్ చేయబడుతుంది.

14. MMTC-PAMP కొన్నిసార్లు ఇలా కూడా చేయవచ్చు. ఆ సమయంలో నడుస్తున్న లైవ్ పున:విక్రయ ధర ప్రకారం 999.9 స్వచ్ఛత గల బంగారంలో కొంత మొత్తాన్ని ప్రకటించిన / అనుమతించిన మేరకు MMTC-PAMPకు విక్రయించడానికి కస్టమర్‌ను అనుమతించవచ్చు / కస్టమర్‌కు ఆఫర్ చేయవచ్చు. ఇలా కస్టమర్ విక్రయించిన కొంత బంగారానికి సంబంధించిన డబ్బు, కస్టమర్‌కు క్రెడిట్ చేయబడుతుంది.

15. MMTC-PAMP అందుబాటులో ఉంచిన దాని ప్రకారం బంగారానికి సంబంధించిన లైవ్ కొనుగోలు ధర ప్లాట్‌ఫామ్‌లో ప్రదర్శించబడుతుంది, అలాగే అది ఎప్పటికప్పుడు మారుతుంది. ప్లాట్‌ఫామ్‌లో సూచించిన ధర, MMTC-PAMP ద్వారా ప్లాట్‌ఫామ్‌లో సూచించిన విధంగా, ఆ సూచించిన సమయానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

16. ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న పేమెంట్ విధానం/విధానాలను ఉపయోగిస్తున్నప్పుడు, దిగువున తెలిపిన కారణాల వల్ల కస్టమర్‌కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ జరిగిన పక్షంలో దానికి MMTC-PAMP/ MMTC-PAMP భాగస్వామి ఎలాంటి బాధ్యతగానీ లేదా లయబిలిటీ గానీ తీసుకోదు:
(a) ఏదైనా లావాదేవీకి/ ఏవైనా లావాదేవీలకు ఆథరైజేషన్ లేకపోవడం,
(b) కస్టమర్, కస్టమర్‌కు సంబంధించిన బ్యాంక్‌ కలిసి సమన్వయంగా ఒప్పందం చేసుకొని, ముందస్తుగా అంగీకరించిన పరిమితిని దాటడం,
(c)  లావాదేవీ కారణంగా ఏవైనా పేమెంట్ సమస్యలు తలెత్తడం,
(d)  నమ్మశక్యం కాని పేమెంట్ విధానాలు (క్రెడిట్/డెబిట్ కార్డ్ మోసాలు లాంటివి) కస్టమర్ ఉపయోగించడం,
(e)  అందించే సదుపాయం నుండి తాత్కాలికంగా వైదొలగడం, మరియు / లేదా
(f)  మరేదైనా ఇతర కారణం(కారణాల) వల్ల లావాదేవీ తిరస్కరించబడటం.

17. MMTC-PAMP తన విచక్షణ మేరకు లేదా నియంత్రణ సంస్థ ఆదేశం లేదా ప్రొవిజన్‌ మేరకు, ఈ పథకం ద్వారా ఎప్పటికప్పుడు బంగారాన్ని కూడబెట్టుకోవడానికి లేదా బంగారాన్ని బదిలీ చేయడానికి కస్టమర్లకు గరిష్ఠ వ్యక్తిగత/క్యుములేటివ్‌ పరిమితులను నిర్దేశించవచ్చు, మరియు సదరు పరిమితికి మించిన ఆర్డర్‌ను అంగీకరించకుండా నిరాకరించే హక్కును కలిగి ఉంటుంది.

18. ఏ రోజు అయినా ఏ సమయంలో అయినా ఏ కారణం చేతనైనా ఆఫర్‌ చేయడానికి అందించే ఆహ్వానాన్ని MMTC-PAMP తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.

19. కస్టమర్‌కు సమాచారం ఇచ్చిన తర్వాత కస్టమర్ల బంగారం ఖాతా మూసివేయబడవచ్చు;
      (a) వారి కస్టడీ వ్యవధి గడువు ముగిసినట్లయితే మరియు / లేదా
      (b) పథకాన్ని నిలిపివేయాలని MMTC-PAMP నిర్ణయించుకుంటే మరియు / లేదా.
      (c) MMTC-PAMP భాగస్వామితో MMTC-PAMP కుదుర్చుకున్న ఒప్పందం ముగింపు/గడువు.

అటువంటి సందర్భంలో, సేకరించిన బంగారాన్ని తిరిగి విక్రయించవచ్చు/రిడీమ్ చేసుకోవచ్చు లేదా మీ బంగారం ఖాతా కొనసాగింపును నిర్ధారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. పైన పేర్కొన్న సంఘటనలు జరిగితే రిడంప్షన్‌ కోసం మీకు తెలియజేయబడుతుంది.

20. డెలివరీ చిరునామాకు సంబంధించిన పోస్టల్ పిన్‌కోడ్, సర్వీస్‌ చేయదగిన ప్రాంతాల వెలుపల ఉన్నట్లయితే, రిడెంప్షన్ అభ్యర్థన చేయడానికి కస్టమర్‌కు అర్హత ఉండదు. రిడెంప్షన్ సమయంలో, కస్టమర్, పూర్తి డెలివరీ చిరునామాను అందించాల్సి ఉంటుంది.

21. కస్టమర్, రిడెంప్షన్‌ కోసం ఎంచుకున్న అన్ని రిడీమ్ చేయదగిన ఉత్పత్తులు, కస్టమర్ ఆదేశాల మేరకు మా లాజిస్టిక్స్ భాగస్వాముల ద్వారా భారతదేశంలోని సర్వీస్‌ చేయదగిన ప్రాంతాలలో డెలివరీ చేయబడతాయి. అర్హత ఉన్న అన్ని డెలివరీలను డెలివరీ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అలాగే MMTC-PAMP ద్వారా నియమించిబడిన లాజిస్టిక్స్ భాగస్వామి, నిర్దేశిత తేదీలలో ఉత్పత్తులను డెలివరీ చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తారు. ఏదైనా ఆలస్యం/సర్వీస్‌ అందుబాటులో లేని కారణంగా ఉత్పన్నమయ్యే ఏవైనా క్లెయిమ్‌లను లేదా బాధ్యతలను MMTC-PAMP నిరాకరిస్తుంది. సర్వీస్ చేయదగిన ప్రాంతాల జాబితా ఎప్పటికప్పుడు సవరించబడుతూ ఉంటుంది. షిప్‌మెంట్(ల) డెలివరీకి సంబంధించి ఏదైనా వివాదం ఉంటే MMTC-PAMP ద్వారా పరిష్కరించబడుతుంది.

22. MMTC-PAMP ద్వారా నియమించబడిన లాజిస్టిక్స్ భాగస్వామి మీ ఆర్డర్‌ను డెలివరీ చేయడానికి గరిష్ఠంగా మూడు సార్లు ప్రయత్నిస్తారు. మూడు ప్రయత్నాలు కూడా విఫలమైతే MMTC-PAMP రీడీమ్ చేయగల ఉత్పత్తి/బంగారు నాణెం, తిరిగి MMTC-PAMPకి చేరవేయబడుతుంది. అలాగే అందుకు సమానమైన బంగారం మొత్తంతో GAP ఖాతాలో బంగారం నిల్వను MMTC-PAMP అప్‌డేట్ చేస్తుంది. ఆ తర్వాత రిడెంప్షన్‌ కోసం కస్టమర్ మళ్లీ అభ్యర్థించాల్సి ఉంటుంది. ఏదైనా అనుకోని కారణం వల్ల, డెలివరీ పూర్తి కాకుండా, బంగారం MMTC-PAMPకి తిరిగి వచ్చినట్లయితే, సదరు బంగారం మీ GAP ఖాతాలోకి జమ చేయబడుతుంది. తద్వారా మీ బంగారం బ్యాలెన్స్ అప్‌డేట్ అవుతుంది.

23. ప్లాట్‌ఫారమ్‌లోని ఏదైనా సాంకేతిక వైఫల్యం / సమస్య  మరియు / లేదా MMTC-PAMPకి సంబంధం లేని చర్యలు / లోపాల వల్ల కలిగే ఏదైనా నష్టానికి / లయబిలిటీకి MMTC-PAMP ఏ రకంగానూ లయబిలిటీ / బాధ్యత వహించదు.

24. ఇందులో విరుద్ధంగా ఏదైనా ఉన్నప్పటికీ, సేవ, ఇంటర్‌ఫేస్ మరియు API వర్క్, మరియు వాటి సంబంధిత సమాచారం, ధర మరియు డేటా, మరియు లభ్యత ఏ సమయంలోనైనా మరియు ఎప్పటికప్పుడు హ్యూమన్, మెకానికల్, టైపోగ్రాఫిక్, లేదా ఇతర లోపాలు, పొరపాట్లు, తప్పులు, పరిమితులు, ఆలస్యాలు, సర్వీస్ అంతరాయాలు, మొత్తంగా లేదా పాక్షికంగా బకాయి ఉన్నవాటితో సహా, పరిమితి లేకుండా, కంప్యూటర్ హార్డ్ వేర్ మరియు సాఫ్ట్ వేర్, టెలికమ్యూనికేషన్ మరియు ఆపరేటింగ్ సిస్టమ్‌లు, డేటాబేస్‌లు, లేదా బిజినెస్ ప్రక్రియలు మరియు పద్ధతులు, అంతర్గతంగా ఉండే లేదా వాటితో సంబంధం ఉన్న ఇతర సమస్యలు, లేదా వాటితో సంబంధం కలిగి ఉన్నవి, పరిమితి లేకుండా, ఫోర్స్ మెజూర్ ఈవెంట్, ప్రభుత్వం/రెగ్యులేటరీ చర్యలు, ఆర్డర్‌లు, నోటిఫికేషన్‌లు మొదలైన వాటితో సహా ఇంటర్నెట్ మరియు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌ల యొక్క ఉపయోగం మరియు/లేదా థర్డ్‌-పార్టీల చర్యలు మరియు మినహాయింపులు మొదలైనవి లేదా ఉత్పన్నమైనవి సర్వీస్‌ను ఇంటర్‌ఫేస్ లేదా API వర్క్‌ను, దాని సమాచారం మరియు డేటాను, లేదా అటువంటి కమ్యూనికేషన్‌లను ప్రభావితం చేయవచచ్చు. అటువంటి సమస్యల వల్ల పూర్తిగా లేదా పాక్షికంగా తలెత్తే జాప్యాలు, వైఫల్యాలు, లేదా ఇతర నష్టాలకు MMTC PAMP ఎలాంటి బాధ్యత వహించదని మరియు లయబిలిటీ తీసుకోదని కస్టమర్ గుర్తించి, అంగీకరిస్తున్నారు. పైన పేర్కొన్న సంఘటనల కారణంగా మీ బంగారం ఖాతాలో ఎక్కువ జమ చేయబడితే లేదా తప్పుగా జమ చేయబడితే / డెబిట్ చేయబడితే, సదరు లావాదేవీని ఎలాంటి నోటీసు ఇవ్వకుండా రివర్స్ చేసే / రద్దు చేసే హక్కు MMTC PAMPకి ఉంటుంది, లేదా తన స్వంత అభీష్టానుసారం అటువంటి లావాదేవీని రద్దు / రివర్సల్ చేయాల్సి రావచ్చు, మరియు బంగారాన్ని మీ బంగారం ఖాతా నుండి / బంగారం ఖాతాకు డెబిట్ / క్రెడిట్ చేయవచ్చు. మీరు బంగారాన్ని వేరొక ఖాతాకు (వేరే వినియోగదారుకు / కస్టమర్‌కు మొదలైన వారికి బదిలీ చేయడం, అయితే వీటికి / వీరికి మాత్రమే పరిమితం కాదు) తప్పుగా బదిలీ చేస్తే దానికి MMTC-PAMP బాధ్యత వహించదు. అలాగే తప్పుగా బదిలీ అయినట్లయితే మరియు / లేదా బదిలీ చేయబడిన వ్యక్తి ఇప్పటికే బదిలీ అయిన బంగారంపై లావాదేవీ చేసి ఉంటే బంగారం గ్రాములు మీకు తిరిగి ఇవ్వబడవు.

25. కస్టమర్ తన బంగారం ఖాతాలో చేసిన బంగారం కొనుగోలును, రిడెంప్షన్‌ను, సేల్-బ్యాక్‌ను MMTC-PAMP నిర్ధారించిన తర్వాత, కొనుగోలు / రిడీమ్ / సేల్-బ్యాక్ / బదిలీ కోసం కస్టమర్ చేసిన ఆర్డర్ / అభ్యర్థన, ఆయా సందర్భాన్ని బట్టి కస్టమర్‌ను కట్టుబడి ఉండేలా చేస్తుంది, మరియు రద్దు చేయడం సాధ్యం కాదు.

26. కస్టమర్ తన బంగారం ఖాతాలో ఏవైనా అవకతవకలు లేదా వ్యత్యాసాలు ఉన్నట్లయితే, లావాదేవీ జరిగిన [30] రోజుల లోపు వెంటనే తెలియజేయాలి. లేని పక్షంలో సదరు లావాదేవీలో ఎటువంటి ఎర్రర్ లేదా వ్యత్యాసాలు లేవని భావించబడుతుంది. కస్టమర్ ఇచ్చిన ఆదేశాలు అన్నింటిని MMTC-PAMP ఎలక్ట్రానిక్ లేదా డాక్యుమెంట్ రూపంలో నిర్వహిస్తుంది, మరియు అటువంటి ఇతర వివరాలు (చేసిన చెల్లింపులు లేదా స్వీకరించిన చెల్లింపులతో సహా, అయితే వీటికి మాత్రమే పరిమితం కాదు) కస్టమర్‌ ఇచ్చిన ఆదేశాలు, నిశ్చయాత్మకమైన సాక్ష్యంగా పరిగణించబడతాయి.

27. కస్టమర్ నుండి స్వీకరించబడిన ఆదేశాల మేరకే ఏదైనా కొనుగోలు, రిడెంప్షన్‌, సేల్-బ్యాక్‌ లేదా బదిలీ అన్నది బంగారం ఖాతా నుండి / బంగారం ఖాతాకు చేయబడుతుందని కస్టమర్ అర్థం చేసుకున్నారు మరియు అంగీకరిస్తున్నారు. అంతే కాక, ప్రస్తుతానికి భారతదేశంలో గానీ లేదా దేశం వెలుపల గానీ అమల్లో ఉన్న ఏవైనా వర్తించే చట్టాలను లేదా నియంత్రణలను కస్టమర్ ఉల్లంఘించకూడదు. బంగారం ఖాతా నుండి మరియు బంగారం ఖాతా లోకి చేసే కొనుగోలు, రిడెంప్షన్‌, సేల్-బ్యాక్‌కు సంబంధించి వర్తించే చట్టాలను పాటించడానికి కస్టమర్ బాధ్యత వహించాలి. ఈ చట్టాల్లో మనీ లాండరింగ్ నిరోధక చట్టం-2002, బినామీ ప్రాపర్టీ లావాదేవీల నిషేధ చట్టం-1998, ఆదాయపు పన్ను చట్టం-1961 మొదలైనవి ఉంటాయి. ఈ చట్టాలకు చేసిన సవరణలను కూడా పాటించాలి. పాటించాల్సిన బాధ్యత ఈ చట్టాలకే మాత్రమే పరిమితం కాదని గమనించగలరు. అలాగే ఏ మైనర్ పేరుతోనూ ఎలాంటి ఖాతానూ తెరవబోనని కూడా కస్టమర్ అంగీకరిస్తున్నారు. ఈ విషయంలో MMTC-PAMP ఏ విధంగానూ బాధ్యత తీసుకోదు.

28. ఉత్పత్తులకు సంబంధించిన కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌లు, గోప్యత పాటించాల్సిన అవసరం లేనివి గానూ మరియు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేనివి గానూ పరిగణించబడతాయి. అటువంటి సమాచారాన్ని MMTC-PAMP తన విచక్షణ మేరకు తన అంతర్గత ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే హక్కును కలిగి ఉంది.

29. ఈ నియమాలు భారతదేశ చట్టాల పర్యవేక్షణకు లోబడి ఉంటాయి. అలాగే ఆ చట్టాలను అనుసరించి అర్థాలను వివరిస్తాయి మరియు తెలియజేస్తాయి. ఈ నియమాల నుండి ఉత్పన్నమయ్యే అంశాలకు సంబంధించి న్యాయాధికార పరిధి న్యూ ఢిల్లీలోని కోర్టులకు ప్రత్యేకంగా ఉంటుంది.

30. ఈ నియమాల చెల్లుబాటుతో సహా ఇక్కడ ఉన్న నియమాల నుండి లేదా వాటికి సంబంధించి ఏదైనా వివాదం తలెత్తిన సందర్భంలో, అటువంటి వివాదాన్ని పార్టీలు మొదట సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. అర్థవంతమైన ప్రయత్నాలు చేసిన తర్వాత (ఇది 15 పదిహేను క్యాలెండర్ రోజుల కంటే తక్కువ కాకుండా కొనసాగుతుంది) ఒక పార్టీ మరో పార్టీకి లిఖితపూర్వకంగా నోటీసు ఇచ్చిన వెంటనే, సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనడానికి చేసిన ప్రయత్నం విఫలమైనట్లుగా పరిగణించబడుతుంది.

31. Waiver/మినహాయింపు: MMTC-PAMP/ MMTC-PAMP భాగస్వామి ఈ నిబంధనలు మరియు షరతుల్లో ఏదైనా ప్రొవిజన్‌ను లేదా ఏదైనా సంబంధిత హక్కు యొక్క ప్రొవిజన్‌ను పాటించడంలో లేదా అమలు చేయడంలో ఏదైనా వైఫల్యం లేదా ఆలస్యం జరిగితే, ఆ ప్రొవిజన్ లేదా హక్కు, MMTC-PAMP/ MMTC-PAMP భాగస్వామి ద్వారా మినహాయింపును పొందినట్టు కాదు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ MMTC-PAMP/ MMTC-PAMP భాగస్వామి యొక్క హక్కులను అమలు చేయడం అనేది ఈ నిబంధనల ప్రకారం లేదా చట్టంలో లేదా ఈక్విటీలో MMTC-PAMPకి అందుబాటులో ఉన్న ఏవైనా హక్కులను లేదా పరిష్కారాలను మినహాయించడంగా లేదా అమలు చేయడాన్ని నిరోధించడంగా పరిగణించబడదు. ఏదైనా నిబంధన ప్రకారం ఏదైనా మినహాయింపు, లిఖితపూర్వకంగా ఉండి, MMTC-PAMP యొక్క అధీకృత అధికారి చేత అమలు చేయబడినప్పుడు మాత్రమే ఆ మినహాయింపు ఆచరణలో ఉంటుంది.

32. Force Majeure/ఫోర్స్ మెజూర్: ఈ నియామాలకు లోబడి MMTC-PAMP/ MMTC-PAMP భాగస్వామి నిర్వర్తించాల్సిన బాధ్యతలు గనుక కార్మిక వివాదాలు, సమ్మెలు, దైవ సంఘటనలు, వరదలు, మెరుపులు, తీవ్రమైన వాతావరణం, మెటీరియల్‌ల కొరత, పరిమితంగా వస్తువుల పంపిణీ, ఏదైనా వైరస్ చొరబడటం, ట్రోజన్ లేదా ఇతర విఘాతం కలిగించే చర్యలు, ప్లాట్‌ఫామ్‌ను హ్యాకింగ్ చేయడం లేదా చట్టవిరుద్ధంగా ఉపయోగించడం, యుటిలిటీ లేదా కమ్యూనికేషన్ వైఫల్యాలు, భూకంపాలు, యుద్ధం, విప్లవం, ఉగ్రవాద చర్యలు, పౌర కల్లోలం, సంఘ విద్రోహ శక్తుల చర్యలు, దిగ్బంధనం, నిషేధం లేదా ఏదైనా చట్టం, ఆదేశం, సాధికార ప్రకటన, నియంత్రణ, ఆర్డినెన్స్, ఏదైనా ప్రభుత్వం లేదా ఏదైనా న్యాయపరమైన అధికారి లేదా అటువంటి ప్రభుత్వ ప్రతినిధి యొక్క చట్టబద్ధమైన డిమాండ్ లేదా ఆవశ్యకత, లేదా ఏదైనా చట్టం వల్ల నిరోధించబడితే, పరిమితం చేయబడితే, ఆలస్యం చేయబడితే లేదా జోక్యం చేసుకుంటే అప్పుడు MMTC-PAMP/ MMTC-PAMP భాగస్వామి సదరు బాధ్యతల నుండి తప్పించబడతారు లేదా మినహాయించబడతారు. ఈ సంఘటనలు ఈ నియమాల్లో సూచించిన విధంగా ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. ఇవి MMTC-PAMP/ MMTC-PAMP భాగస్వామి యొక్క సహేతుకమైన నియంత్రణలో లేనివి. ముందస్తుగా తీసుకున్న జాగ్రత్తల ద్వారా ఈ సంఘటనలు ఆపడం సాధ్యం కాకపోవచ్చు. అటువంటి ఫోర్స్ మెజూర్ ఈవెంట్ ఉన్నంత వరకు, అటువంటి బాధ్యతలను నిర్వర్తించకపోవడం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ, MMTC-PAMP/ MMTC-PAMP భాగస్వామి దాని బాధ్యతలను ఉల్లంఘించినట్లు కాదు.

33. Absence of relationship/సంబంధం లేకపోవడం: బంగారం/రిడీమ్ చేయదగిన ఉత్పత్తులను కొనుగోలు చేయడం/రిడీమ్ చేయడం/సేల్-బ్యాక్ చేయడంలో సరైన నిర్ణయం తీసుకునేందుకు మీకు తగినంత అనుభవం మరియు పరిజ్ఞానం ఉన్నాయని మీరు MMTC-PAMP/ MMTC-PAMP భాగస్వామికి తెలియజేస్తున్నారు లేదా హామీ ఇస్తున్నారు. కొనుగోళ్లు లేదా రిడంప్షన్ లేదా సేల్-బ్యాక్‌కు సంబంధించి మీకు మీరుగా అన్నీ స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నారని మరియు MMTC-PAMP/ MMTC-PAMP భాగస్వామి ద్వారా అందుబాటులో ఉన్న సమాచారంపై మీరు ఆధారపడలేదని అంగీకరిస్తున్నారు. ఇంకా బంగారం/రిడీమ్ చేయదగిన ఉత్పత్తుల కొనుగోళ్లు/రిడంప్షన్/సేల్-బ్యాక్‌కు సంబంధించి MMTC-PAMP/ MMTC-PAMP భాగస్వామి ఎటువంటి సిఫారసు చేయడం లేదు. MMTC-PAMPకి మీకు మధ్య విక్రేత-కొనుగోలుదారు సంబంధం తప్ప మరే ఇతర సంబంధం లేదు. ఏదైనా ఏజెంట్-ప్రిన్సిపల్ సంబంధం, ఏదైనా సలహా ఇచ్చే వ్యక్తి-సలహా తీసుకునే వ్యక్తి సంబంధం, ఏదైనా ఉద్యోగి-యజమాని సంబంధం, ఏదైనా ఫ్రాంఛైజీ-ఫ్రాంచైజర్ సంబంధం, ఏదైనా జాయింట్ వెంచర్ సంబంధం లేదా ఏదైనా భాగస్వామ్య సంబంధం ఉండదు. ఇవి వీటికి మాత్రమే పరిమితి కాదని గమనించగలరు.

34. Electronic Order Risks/ఎలక్ట్రానిక్ ఆర్డర్ రిస్క్‌లు: ఆర్డర్‌లను ఎంటర్ చేయడానికి సమర్థవంతమైన మరియు ఆధారపడదగిన పద్ధతిని అందించడానికి ఆర్డర్ ఎంట్రీ సిస్టమ్‌లు రూపొందించబడ్డాయి. వాణిజ్య ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు 100% ఆధారపడదగ్గ వారు కాదు, మరియు ఈ ప్రొవైడర్లలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది విఫలం కావడం వల్ల ఇంటర్నెట్ ఆధారిత ఆర్డర్ ఎంట్రీ ప్రభావితం కావచ్చు. ఆర్డర్ ఎంట్రీ సిస్టమ్ ఒక ఎలక్ట్రానిక్ మెకానికల్ సిస్టమ్ అని మీరు అంగీకరిస్తున్నారు, మరియు ఆ కారణంగా MMTC-PAMP/ MMTC-PAMP భాగస్వామి నియంత్రణలో లేని అంశాల వల్ల ఆర్డర్ విఫలం కావడానికి అవకాశం ఉండవచ్చు. కాబట్టి, ఎర్రర్‌లు, నిర్లక్ష్యం, ఆర్డర్‌లను అమలు చేయడంలో అసమర్థత, ప్రసార లేదా కమ్యూనికేషన్ సౌకర్యాల విచ్ఛిన్నం లేదా వైఫల్యం కారణంగా ప్రసారంలో, ఆర్డర్ యొక్క డెలివరీలో లేదా అమలులో జాప్యాలు, లేదా MMTC-PAMP/ MMTC-PAMP భాగస్వాముల నియంత్రణలో లేదా వాటి అంచనాలో లేని వాటికి MMTC-PAMP భాగస్వామి & MMTC-PAMPలు బాధ్యత వహించవు. ధర పరంగా లేదా టైప్‌ చేసేటప్పుడు ఎర్రర్లు ఏర్పడే అవకాశం ఉందని మీరు అంగీకరిస్తున్నారు, అలాగే అందువల్ల, ధర పరంగా లేదా ఉత్పత్తి సమాచారంలో లోపం కారణంగా ఒక ఉత్పత్తి, తప్పు ధర వద్ద లేదా తప్పుడు సమాచారంతో జాబితా చేయబడినప్పుడు, MMTC-PAMP/ MMTC-PAMP భాగస్వామి తన విచక్షణ మేరకు, ఉత్పత్తుల కోసం ప్లేస్ చేసిన ఏవైనా ఆర్డర్‌లను అంగీకరించకపోవచ్చు లేదా రద్దు చేయవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఇంకా, మార్కెట్ అస్థిరత మరియు/ లేదా అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు ప్లేస్ చేయబడిన ఏవైనా లోపాలను నిరాకరించడానికి లేదా రద్దు చేయడానికి లేదా తిరస్కరించడానికి MMTC-PAMP హక్కును కలిగి ఉంది. ఇందులో, MMTC-PAMP ఉత్పత్తి/బంగారం అనూహ్యంగా అందుబాటులో లేకపోవడం కూడా ఉంటుంది. దీనికి మాత్రమే పరిమితి కాదని గమనించగలరు.

35. CUSTOMER responsibility for taxes, tariffs and duties/పన్నులు, టారిఫ్‌లు, సుంకాల విషయంలో కస్టమర్ బాధ్యత: బంగారం/రిడీం చేసుకోగల ఉత్పత్తుల కొనుగోలు/ రిడెంప్షన్ విషయంలో తలెత్తే అన్ని రకాల పన్నులు, టారిఫ్‌లు, సుంకాలకు పూర్తిగా బాధ్యత మీదేనని మీరు గుర్తిస్తున్నారు. చట్టానికి అనుగుణంగా అవసరమైన మేరకు మాత్రమే లావాదేవీలపై పన్నులు, టారిఫ్‌లు, సుంకాలను MMTC-PAMP/MMTC-PAMP భాగస్వామి వసూలు చేస్తుంది. కాబట్టి మీ స్థానిక, రాష్ట్ర మరియు/లేదా కేంద్ర ప్రభుత్వాల నియమాలకు లోబడి మీకు వర్తించే ఏవైనా పన్నులు, టారిఫ్‌లు, సుంకాల గురించి అవగాహన కలిగి ఉండి, చెల్లించడం అనేది మీ బాధ్యత. ఒకవేళ పన్నులు, టారిఫ్‌లు, సుంకాల గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, మీ ప్రత్యేక పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి మీరు పన్నుల నిపుణులను లేదా ఇతర ప్రొఫెషనల్‌ను సంప్రదించాలి. మీ నిర్దిష్ట పన్నులు, టారిఫ్‌లు, సుంకాల గురించి MMTC-PAMP/MMTC-PAMP భాగస్వామి ఎలాంటి సలహాలను లేదా సిఫారసులను చేయదు.

36. Indemnification/బాధ్యత నుండి విముక్తి చేయడం: దిగువున తెలిపిన కారణాల వల్ల MMTC-PAMP/MMTC-PAMP భాగస్వామిలేదా వారి ఉద్యోగులు, ఏజెంట్‌లు, వర్కర్లు లేదా ప్రతినిధులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎప్పుడైనా ఏదైనా బాధ, నష్టం, హాని కలిగించే చర్యలు, క్లెయిమ్‌లు, డిమాండ్‌లు, ప్రొసీడింగ్‌లు, నష్టాలు, ప్రమాదాలు, వ్యక్తిగత హాని, ధరలు, ఛార్జీలు, ఖర్చుల (‘నష్టాలు’) నుండి MMTC-PAMP/MMTC-PAMP భాగస్వామిని బాధ్యత నుండి విముక్తిని ఇస్తున్నానని, ఆ విముక్తిని కొనసాగిస్తానని ఈ మేరకు కస్టమర్ అంగీకరిస్తున్నారు,

(a)  ప్లాట్‌ఫామ్‌ను కస్టమర్ వినియోగించే తీరు;
(b) ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కస్టమర్ నిర్లక్ష్యం, తప్పిదం లేదా తప్పుడు ప్రవర్తన కారణంగా కస్టమర్ ఇచ్చే  సూచనల మేరకు MMTC-PAMP వారు సహృదయంతో చర్య తీసుకోవడం లేదా చర్య తీసుకోవడానికి నిరాకరించడం లేదా చర్య తీసుకోవడం నుండి మినహాయింపు ఇవ్వడం కారణంగా;
(c) బంగారం ఖాతాకు సంబంధించి నియమాల ఉల్లంఘన లేదా వాటిని పాటించకపోవడం; మరియు/లేదా
(d)  కస్టమర్ చేసే ఏదైనా లావాదేవీలో మోసం జరగడం లేదా నిజాయతీ లేకపోవడం.

ముందుచెప్పిన వాటితో పక్షపాతం లేకుండా, కింద తెలిపిన వాటి కారణంగా కస్టమర్‌కు ఏదైనా నష్టం గానీ లేదా హాని గానీ పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా కలిగితే, దానికి ఏ పార్టీ ఎటువంటి బాధ్యత వహించదు:
(i) కస్టమర్ల నుండి అందుకున్న సూచనల మేరకు  జరిగిన లావాదేవీ విషయంలో,
(ii) అతను / ఆమె ఖాతా నుండి బంగారాన్ని వేరొక బంగారం ఖాతాకు బదిలీ చేయాలని కస్టమర్ సూచించడం,
(iii) ప్లాట్‌ఫామ్ అందించే సదుపాయం/సేవలను రద్దు చేసే/అమలు చేసే హక్కును MMTC-PAMP వారు అమలు చేయడం,
(iv) ప్లాట్‌ఫామ్‌లోని సదుపాయం / సేవలను ఉపయోగించినందుకు కస్టమర్ పలుకుబడికి, వ్యక్తిత్వానికి, పరువుకు ఏదైనా నష్టం జరగడం,
(v) MMTC-PAMP/MMTC-PAMP భాగస్వామి ఏదైనా ప్రక్రియ, సమన్లు, ఆదేశాలు, ఇంజంక్షన్, అమలులో లోపాలు, తాత్కాలిక హక్కు, సమాచారం లేదా నోటీస్ అందుకుంటే MMTC-PAMP/MMTC-PAMP భాగస్వామి తన ఎంపికతో మరియు ఆ కస్టమర్‌కు లేదా అలాంటి ఇతర వ్యక్తికి జవాబుదారీగా కాకుండా, అతని బంగారంలోని ఏ భాగాన్ని అయినా పొందేందుకు అనుమతి నిరాకరించడం, లేదా ఆ బంగారాన్ని సముచిత అధికార వర్గానికి అందచేయడం చేయవచ్చు, మరియు వర్తించే చట్టాల ప్రకారం అవసరమైనటువంటి ఇతరత్రా ఏ రకమైన చర్యలనైనా తీసుకోవచ్చు.

37. Disclaimers and limits of liability/నిరాకరణలు, బాధ్యతా పరిమితులు: భవిష్యత్తులో ధరల గురించి లేదా పెట్టుబడి మీద రిటర్న్ గురించి తమ బంగారం/బంగారం SIPలు లేదా ఇతర ఉత్పత్తుల పనితీరు విషయమై నేరుగా లేదా పరోక్షంగా ఎటువంటి ప్రాతినిధ్యాలు, సిఫార్సులు, అంచనాలు, వారంటీలు లేదా గ్యారంటీలను MMTC-PAMP/MMTC-PAMP భాగస్వామి ఇవ్వదు. ఎవరైనా కస్టమర్‌కు చెందిన (బదిలీ చేయబడిన వారితో సహా కానీ వీరికి మాత్రమే పరిమితం కాకుండా) బంగారం ఖాతా నుండి లేదా ఎవరైనా కస్టమర్ యొక్క బంగారం ఖాతాకు జరిగే ఏదైనా బదిలీ/డిపాజిట్ విషయంలో జరిగే ఏదైనా నష్టానికి MMTC-PAMP ఎటువంటి బాధ్యత వహించదు. ప్యాకేజీని అందుకోవడానికి ముందు లేదా రసీదుపై సంతకం చేసే ముందు ప్యాకేజీ పాడైందేమోనని ఒకసారి పరిశీలించాలని MMTC-PAMP తమ కస్టమర్లను కోరుతోంది. ఏదైనా లోపం ఉన్నట్లు అనిపిస్తే, పార్శిల్‌ను అంగీకరించకుండా, దాన్ని తిరిగి ఇచ్చేయండి. లోపం ఉన్న లేదా పాడైన ప్యాకేజీని కస్టమర్ అంగీకరించడం వల్ల కలిగే నష్టం లేదా హానికి MMTC-PAMP ఎలాంటి బాధ్యత వహించదు. పార్శిల్‌లో ఏవైనా లోపాలు ఉన్నాయా లేదా పాడైందా అని పరిశీలించాల్సిన బాధ్యత కస్టమర్‌దే, అలాగే ఒకవేళ కస్టమర్ పార్శిల్‌ను అంగీకరించి, తర్వాత ఏదైనా లోపం ఉందని లేదా పాడైందని తెలుసుకుంటే, అప్పుడు కస్టమర్‌కు జరిగిన నష్టం లేదా హానికి MMTC-PAMP/MMTC-PAMP భాగస్వామి బాధ్యత వహించదు. బంగారం/ఏదైనా ఉత్పత్తికు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు/సమస్యల పరిష్కారానికి సదరు కస్టమర్ బంగారం/ఏదైనా ఉత్పత్తిని అందుకున్న 10 రోజుల లోపు MMTC-PAMP/MMTC-PAMP భాగస్వామికి నివేదించవచ్చు మరియు దర్యాప్తు జరిపిన తర్వాత MMTC-PAMP సమస్యకు తగిన పరిష్కారం అందించవచ్చు.

38. పరోక్షంగా, పర్యవసానంగా, ప్రత్యేకంగా, యాదృచ్చికంగా, శిక్షాత్మకంగా, లేదా తప్పు లేకుండా జరిగిన నష్టాల కారణాలతో పాటు, వాటికే పరిమితం కాకుండా, లాభాల్లో నష్టం, పొదుపులు, ఆదాయాల్లో నష్టాలు రావడం (సమిష్టిగా, "మినహాయించబడిన నష్టాలు"), నిర్లక్ష్యపూరితంగా, హక్కుల ఉల్లంఘనలో, ఒప్పందంలో లేదా ఏ ఇతర బాధ్యతా సిద్ధాంతంలోకి వచ్చేలా వర్గీకృతం చేయబడిన దాని కోసమైనా బంగారం యాక్సెస్ లేదా వినియోగం ఫలితంగా మీకూ లేదా ఏ ఇతర వ్యక్తికీ MMTC-PAMP/MMTC-PAMP భాగస్వామి, వారి డైరెక్టర్‌లు, ఉద్యోగులు బాధ్యత వహించరని మీరు గుర్తిస్తున్నారు. ఈ నియమాలకు లోబడి మీకు కలిగే నష్టాలు, డ్యామేజీలు, బాధ్యతలకు గాను, నిర్దిష్ట ఉత్పత్తులు లేదా సేవల కోసం PhonePe/MMTC-PAMP భాగస్వామి అందించే సదుపాయం/సేవల కోసం మీరు చెల్లించిన మొత్తానికి మించి ఎట్టి సందర్భంలోనూ బాధ్యత వహించదు.

39. పైన వివరించిన బాధ్యతల పరిమితి అనేది, వర్తించే చట్ట పరిధిలో, చట్టం అనుమతించిన పూర్తి పరిమితి మేరకు వర్తిస్తుంది.

40. కేంద్ర వస్తు సేవల పన్ను చట్టం 2017, రాష్ట్ర వస్తు సేవల పన్ను చట్టం 2017, సమగ్ర వస్తు సేవల పన్ను చట్టం 2017, కేంద్రపాలిత ప్రాంత వస్తు సేవల పన్ను చట్టం 2017 ప్రకారం మీకు రిజిస్ట్రేషన్ లేదని, చేసుకోవాల్సిన అవసరం లేని వ్యక్తిగా మీరు నిర్ధారిస్తున్నారు.

41. మీ ఖాతాలో ఉన్న, మీరు అమ్ముతున్న బంగారం అనేది మీ వ్యక్తిగత వినియోగం కోసమని, అది ఇంతకు ముందు మీకు సొంతమైనదని మీరు నిర్ధారిస్తున్నారు.

42. మీరు బంగారం, వెండి లేదా ఇతర విలువైన లోహపు ఆభరణాలు లేదా సంబంధిత ఉత్పత్తుల కోసం రిజిస్టర్ చేసుకోకుండా ఉన్న డీలర్ కాదు అని మీరు నిర్ధారిస్తున్నారు.

43. ఏదైనా తప్పుడు ప్రాతినిధ్యం తెలియజేసినట్లు కనుగొనబడితే, ఏదైనా సమయంలో ప్రభుత్వం, ఏదైనా అధికార వర్గం, విభాగం విధించే అన్ని రకాల జరిమానా, ఛార్జీలు, పన్నులు, వడ్డీకి మీరే పూర్తి బాధ్యతను వహిస్తారు.