SafeGold నియమ, నిబంధనలు
వినియోగ నియమాలు
భాగం – I
1. పరిచయం
1.1. ఈ డాక్యుమెంట్ సమాచార సాంకేతిక చట్టం 2000 నియమాల ప్రకారం, అలాగే సమాచార సాంకేతిక చట్టం 2000లో వివిధ స్థాయిలలో ఎలక్ట్రానిక్ రికార్డ్‌లకు సంబంధించిన అంశాలకు వర్తించే నిబంధనల ప్రకారం రూపొందించిన ఒక ఎలక్ట్రానిక్ రికార్డ్. ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్, కంప్యూటర్ సిస్టమ్ ద్వారా తయారు చేయబడింది కాబట్టి ఎటువంటి భౌతిక లేదా డిజిటల్ సంతకాలు అవసరం లేదు.
1.2. ప్లాట్‌ఫామ్ యాక్సెస్ లేదా వినియోగం కోసం నియమాలు, నిబంధనలు, గోప్యతా విధానం, వినియోగ నియమాలను ప్రచురించాలని నిర్దేశించే సమాచార సాంకేతిక (మధ్యవర్తుల మార్గదర్శకాలు) నియమాలు, 2011లోని నిబంధన 3(1)లోని అంశాల ప్రకారం ఈ డాక్యుమెంట్ ప్రచురించబడింది.
1.3. ఈ వినియోగ నియమాల భాగం I, భాగం IIలను కలిపి ‘నియమాలు’ అని సంబోధిస్తారు, వీటిని ఎల్లప్పుడూ కలిపే పరిగణించాలి.
2. నిర్వచనాలు
2.1. ఈ నియమాల ఉద్దేశం కోసం, సందర్భం అవసరమైన చోట్లలో ఈ కింది పదాలు ఇలా వర్ణించబడతాయి:
“వినియోగదారు” అంటే ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి బంగారాన్ని కొనడం (కింద తెలిపినట్లుగా), బంగారం డెలివరీని పొందడం మరియు/లేదా బంగారాన్ని తిరిగి DGIPLకు గానీ లేదా ఇతర కొనుగోలుదారునికి అమ్మడం లాంటివి ఈ నియమాలలో తెలిపినట్టుగా చేసే ఎవరైనా ఒక వ్యక్తి.
2.1.1 “బంగారం” అంటే 99.99% లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛత గల 24 క్యారెట్ల బంగారం. దీన్ని “SafeGold” అనే బ్రాండ్ పేరు మీద DGIPL, వినియోగదారుకు ఆఫర్ చేస్తుంది.
2.1.2 “బంగారం ఖాతా” అంటే ఈ నియమాలకు అనుగుణంగా మీరు లేదా వేరొకరు క్రియేట్ చేసుకున్న ఖాతా.
2.1.3 “బంగారం ఖాతా సమాచారం” అంటే బంగారం ఖాతా క్రియేట్ చేయడానికి మీ ద్వారా అందించబడిన సమాచారం.
2.1.4 “వినియోగదారు అభ్యర్థన” అంటే వినియోగదారు బంగారానికి సంబంధించి మీరు చేసే కొనుగోలు అభ్యర్థన, డెలివరీ అభ్యర్థన లేదా అమ్మకం అభ్యర్థనలు.
2.1.5 “DGIPL ప్లాట్‌ఫామ్” అంటే www.safegold.comతో సహా DGIPL ద్వారా హోస్ట్ చేయబడే లేదా నియంత్రించబడే ఏదైనా వెబ్‌సైట్, వెబ్ యాప్ లేదా మొబైల్ అప్లికేషన్ అని అర్థం.
2.1.6 “DGIPL సేవలు” అంటే బంగారం సంబంధిత ఉత్పత్తులు, సేవలతో సహా DGIPL వారు అందజేసే ఏవైనా ఉత్పత్తులు లేదా ఏవైనా సేవలు అని అర్థం.
2.1.7 “ఫోర్స్ మాజుర్ (ఊహించని పరిణామ) సంఘటన” అంటే SafeGold భాగస్వామి మరియు/లేదా DGIPL నియంత్రణలో లేని ఏదైనా అనూహ్య సంఘటన అని అర్థం. వెన్నుపోటు, అగ్నిప్రమాదం, వరదలు, పేలుడు, దైవ చర్య, సామాజిక దాడి, ధర్నాలు, లాక్‌అవుట్‌లు లేదా ఏవైనా పారిశ్రామిక చర్యలు, అల్లర్లు, తిరుగుబాటు, యుద్ధం, ప్రభుత్వ చర్యలు, కంప్యూటర్ హ్యాకింగ్, పౌర అంతరాయాలు, కంప్యూటర్ డేటా మరియు స్టోరేజీ పరికరాలకు అనధికార యాక్సెస్, కంప్యూటర్ క్రాష్‌లు, వైరస్ దాడులు, సెక్యూరిటీ మరియు ఎన్‌క్రిప్షన్ దాడులకు మాత్రమే పరిమితం కాకుండా, SafeGold భాగస్వామి మరియు/లేదా DGIPL పరిధిలో లేని, SafeGold భాగస్వామి మరియు/లేదా DGIPL నియంత్రించలేని ఇలాంటి ఇతర ఘటనలు ఊహించని పరిణామాలుగా పరిగణించబడతాయి.
2.1.8 “పేమెంట్ సాధనం” అంటే డబ్బు పేమెంట్ లేదా బదిలీ కోసం ఉపయోగించే ఏదైనా ఎలక్ట్రానిక్ లేదా రాతపూర్వక చెక్, డ్రాఫ్ట్, మనీ ఆర్డర్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ లేదా రాతపూర్వక సాధనం లేదా ఆర్డర్ అని అర్థం.
2.1.9 “వ్యక్తి” అంటే ఒక వ్యక్తి, ఒక కార్పొరేషన్, ఒక భాగస్వామ్యం, ఒక ఉమ్మడి వెంచర్, ఒక ట్రస్ట్, ఒక కార్పొరేట్ చేయబడని సంస్థ, అలాగే ఏదైనా ఇతర చట్టబద్ధ కంపెనీ అని అర్థం.
2.1.10 "ప్లాట్‌ఫామ్" అంటే బంగారం లావాదేవీల కోసం పేమెంట్ సదుపాయాలు కల్పించే/ప్రాసెస్ చేసే పేమెంట్ టెక్నాలజీ పరిష్కారాలను అందించే మొబైల్ అప్లికేషన్ మరియు/లేదా వెబ్‌సైట్ అని అర్థం.
2.1.11 “SafeGold భాగస్వామి” అంటే PhonePe ప్రైవేట్ లిమిటెడ్ (“PhonePe”) అని అర్థం. ఈ సంస్థ, ప్లాట్‌ఫామ్‌లో DGIPL అందించే బంగారం కోసం పేమెంట్‌ల సేకరణ సదుపాయం, పేమెంట్ సేవలను అందిస్తుంది.
2.1.12 “ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్” అంటే కింద తెలిపిన 4వ క్లాజులోని సదుపాయాలను అందజేసే థర్డ్-పార్టీ సంస్థ అని అర్థం.
సెక్షన్ 2.1లో నిర్వచించిన పదాలతో పాటుగా, ఇకపై ప్రస్తావించబడే అదనపు పదాలకు సంబంధిత సెక్షన్‌లలో తగినట్లుగా అర్థాలు కేటాయించబడతాయి.
3. DGIPL ద్వారా అందించబడే సేవలకు సంబంధించిన నియమ, నిబంధనలు
3.1. Digital Gold India ప్రైవేట్ లిమిటెడ్ అనేది, కంపెనీల చట్టం 2013 ప్రకారం నెలకొల్పబడి, 2వ & 3వ అంతస్తు, కోవర్క్స్, బిర్లా సెంచూరియన్, వొర్లీ, ముంబై ("DGIPL") వద్ద రిజిస్టర్ చేయబడిన ఆఫీస్‌ను కలిగి ఉన్న ఒక కంపెనీ. ఈ కంపెనీ బంగారం అమ్మకంతో పాటు, బంగారాన్ని సురక్షితంగా ఉంచడం/వాల్ట్‌లో పెట్టడం, అలాగే డెలివరీ/ఫుల్‌ఫిల్‌మెంట్ సేవలు, సంబంధిత సేవలను (“సేవలు”) ఈ ప్లాట్‌ఫామ్‌పై లేదా ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులకు అందిస్తుంది.
3.2. “SafeGold” బ్రాండ్ పేరుతో బంగారం ఉత్పత్తుల కొనుగోలు మరియు/లేదా విక్రయాలను DGIPL అందిస్తోంది. ఈ సేవలను DGIPL వారు అందిస్తుండగా, వారి ప్లాట్‌ఫామ్ ద్వారా ఆ సేవల కోసం పేమెంట్‌ల లావాదేవీల సదుపాయం, సేకరణ బాధ్యతను మాత్రం SafeGold భాగస్వామి అందిస్తోంది. పేమెంట్ సేవలను అందించడం మినహా వేరే సేవలకు SafeGold భాగస్వామి ఎటువంటి బాధ్యతా వహించదు. సేవలకు సంబంధించిన ఏదైనా మరియు అన్ని లావాదేవీలు, మధ్యవర్తుల (ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్, వాల్ట్ సంరక్షణదారు లాంటి వాటి) సహాయంతో DGIPL ద్వారా అమలు చేయబడతాయి. ఈ మధ్యవర్తులతో, DGIPL విడిగా ఒప్పందం కలిగి ఉంటుంది.
3.3. బంగారానికి సంబంధించి వినియోగదారు ఈ నియమాలకు లోబడి ఉంటారు. ప్లాట్‌ఫామ్‌లో ఇంకా ఏవైనా ఇతర నియమ, నిబంధనలతో పాటుగా ఈ నియమాలు కూడా వర్తిస్తాయని స్పష్టం చేయడమైనది.
3.4. సేవలను ఉపయోగించడానికి ముందుగా వినియోగదారులు ఈ నియమాలను జాగ్రత్తగా చదివి, అర్థం చేసుకోవాలని సలహా ఇస్తున్నాం.
3.5. ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చేసిన ఏ లావాదేవీల మీద కూడా ఏ వ్యక్తికీ, ఎటువంటి రిటర్న్‌లకూ DGIPL మరియు/లేదా SafeGold భాగస్వామి హామీ ఇవ్వడం లేదు. ఈ వినియోగ నియమాలకు లోబడి ఏవైనా లావాదేవీలను చేయడానికి ముందు తగిన, సమర్థమైన జాగరూకతను, సంబంధిత విశ్లేషణను చేసే బాధ్యత పూర్తిగా వినియోగదారుదే (ఇకనుండి “మీరు” అని సంబోధించబడుతుంది, “మీకు” అనే పదం కూడా సందర్భాన్ని బట్టి ఉపయోగించబడుతుంది). ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా మీ కొనుగోలు లేదా ఇతర నిర్ణయాలకు DGIPL మరియు/లేదా SafeGold భాగస్వామి దాని ఆఫీసర్‌లు, డైరెక్టర్‌లు, ఉద్యోగులు, ఏజెంట్‌లు, అనుబంధంగా ఉండేవారు బాధ్యత వహించబోరని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు.
3.6. బంగారం ఖాతాను క్రియేట్ చేసుకున్న తేదీ నుండి DGIPL అందించే సేవలు వర్తిస్తాయి.
3.7. ఈ సేవలు “ఉన్నవి ఉన్నట్లుగా”, “అందుబాటుని బట్టి” అనే ప్రాతిపదికన అందుబాటులో ఉంచబడి, అందించబడతాయని మీరు అర్థం చేసుకుని, గుర్తిస్తున్నారు. మీ పరికరం మరియు/లేదా ప్లాట్‌ఫామ్ కనెక్ట్ చేయడానికి మీరు ఉపయోగించే ఏదైనా పరికరం, అలాగే ఈ పరికరాలకు కనెక్ట్ చేసిన విడిభాగాలలో (సర్వర్‌లు, కంప్యూటర్‌లకు మాత్రమే పరిమితం కాకుండా) వైఫల్యాలు, లోపాలు లేదా డేటా నష్టం మరియు/లేదా సమాచార నష్టాన్ని కలిగించే తప్పిదాలు లేదా లోపాలు ప్లాట్‌ఫామ్‌లో ఉండవచ్చు. ప్లాట్‌ఫామ్, సేవల వినియోగంలో తలెత్తే అన్ని రిస్కులు, ఖర్చులను మీరు అంగీకరిస్తున్నారు. వీటిలో మీ పరికరం వాడకం వల్ల తలెత్తే ఖర్చులు, ఏదైనా విడిభాగానికి, సాఫ్ట్‌వేర్ లేదా డేటా వినియోగం వల్ల తలెత్తే ఖర్చులు కూడా ఉంటాయి. కానీ వీటికే పరిమితం కాదు.
3.8. వస్తు సేవల పన్ను చట్టం 2017 ప్రకారం మీకు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదని మీరు నిర్ధారిస్తున్నారు.
4. ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్, మధ్యవర్తులు, సురక్షితంగా నిల్వ చేసే ఏర్పాటు
4.1. మధ్యవర్తుల నియామకం
4.1.1. మీకు సేవలు అందించడంలో భాగంగా DGIPLకు సహాయంగా ఉండటానికి DGIPL లేదా ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్ (సందర్భాన్ని బట్టి) ఎప్పటికప్పుడు మధ్యవర్తులను (“మధ్యవర్తులు”) నియమించవచ్చు. “మధ్యవర్తులు” అనే పదం ప్రధానంగా ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్, వాల్ట్ సంరక్షణదారులను సూచించినప్పటికీ, ఈ నియమాలకు లోబడి మీరు పెట్టిన వినియోగదారు అభ్యర్థనలను సంతృప్తి పరిచే వరకు వినియోగదారు ఆర్డర్ (ఆపై పేమెంట్ విజయవంతంగా అయినవి) పెట్టిన మేరకు DGIPL లేదా ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్ (సందర్భాన్ని బట్టి) ద్వారా నియమించబడిన ఎవరైనా లేదా అందరు వ్యక్తులను కూడా సూచిస్తుంది. మీ తరఫున, మీ కోసం DGIPL లేదా ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్ (సందర్భాన్ని బట్టి) ద్వారా అటువంటి మధ్యవర్తులను నియమించడానికి మీరు అంగీకారం తెలియజేస్తున్నారు.
4.1.2. మీ వినియోగదారు ఆర్డర్‌లు/వినియోగదారు అభ్యర్థనలు ఈ నియమాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించడానికి ఈ మధ్యవర్తులను నియమించినట్లు మీరు గుర్తించి, అర్థం చేసుకున్నారు. అలాగే ఈ మధ్యవర్తుల నియామకం, సేవలకు గాను కొన్ని నిర్దిష్ట పేమెంట్‌లు చేయాల్సి ఉంటుందని కూడా మీరు అదనంగా గుర్తిస్తున్నారు, ఈ నియమాలలో వేరే విధంగా పేర్కొంటే మినహా ఈ పేమెంట్‌లను మీ తరఫున DGIPL భరిస్తుంది.
4.2. ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్ నియామకం
4.2.1. మీ తరఫున వాల్ట్ సంరక్షణదారు వద్ద ఉన్న వినియోగదారు బంగారాన్ని ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్ పర్యవేక్షించడాన్ని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు.
4.2.2. ఈ నియమాలను అంగీకరించడం ద్వారా, ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్‌తో అటువంటి ఒప్పందం (అంటే ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్ ఒప్పందం) నియమాలకు లోబడి ఉండటానికి మీరు అదనంగా అంగీకరిస్తున్నారు.
4.2.3. ఒకవేళ మధ్యవర్తులకు చెల్లించాల్సిన ఖర్చులు లేదా ఛార్జీలు పెండింగ్ ఉండి లేదా ఏదైనా కారణం చేత ఏవైనా మీ వినియోగదారు ఆర్డర్‌లు/వినియోగదారు అభ్యర్థనల డెలివరీ లేదా వాస్తవ డెలివరీ అయ్యేవరకు మిగిలిన ఖర్చులు లేదా ఛార్జీలు ఉండి, కింద తెలిపిన 8వ క్లాజు (పేమెంట్లను చెల్లించకుండా డీఫాల్ట్ అయిన సందర్భాలు) ప్రకారం అలాంటి అభ్యర్థనలను DGIPL కూడా చెల్లించలేని స్థితిలో ఉండి, తద్వారా మీ వినియోగదారు ఆర్డర్‌లు/వినియోగదారు అభ్యర్థనల ఫుల్‌ఫిల్‌మెంట్ తీవ్రంగా దెబ్బతినే లేదా హాని కలిగే పరిస్థితి వస్తే, అప్పుడు ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్ తన అర్హతతో వినియోగదారు బంగారంలో కొంత భాగాన్ని అమ్మి, ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్ ఒప్పందాలలో భాగంగా పేర్కొన్న నియమాలకు అనుగుణంగా చెల్లించకుండా ఉన్న ఆ ఖర్చులను లేదా ఛార్జీలను చెల్లిస్తారు. పైన పేర్కొన్న ఛార్జీల సమస్య తీరిన తర్వాత ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్ ఒప్పందాలలో భాగంగా పేర్కొన్న నియమాలకు అనుగుణంగా మీకు బాకీ ఉన్న మొత్తాలు మరియు/లేదా డెలివరీ చేయాల్సిన బంగారం (సందర్బాన్ని బట్టి) ఎంత ఉందనేది లెక్కించబడుతుంది.
4.2.4. ఈ నియమాలకు అనుగుణంగా, మీ ప్రయోజనాలను అవసరమైనంత మేర రక్షించడంలో మీ తరఫున చర్యలు చేపట్టడానికి మీరు ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్‌కు అధికారాన్ని అందిస్తున్నారు.
4.3. సురక్షితంగా నిల్వ చేయడం/బంగారం వాల్టింగ్
4.3.1. వినియోగదారు ఆర్డర్‌కు అనుగుణంగా మీరు కొనుగోలు చేసిన బంగారాన్ని మీ తరఫున ఒక సంరక్షకుడి రక్షణలో వాల్ట్‌లో భద్రపరచబడుతుంది (“వాల్ట్ సంరక్షణదారు”).
4.3.2. ఇక్కడ (i) మీరు కొన్న బంగారాన్ని సురక్షితంగా ఉంచడం కోసం వాల్ట్ సంరక్షణదారు నియామకానికి; అలాగే (ii) మీరు కొనుగోలు చేసిన బులియన్, నాణేలు లేదా ఆభరణాల (సందర్భాన్ని బట్టి) లాంటి వాటికి మాత్రమే పరిమితం కాకుండా అన్ని బంగారం ఉత్పత్తులను మీ తరఫున సురక్షితమైన వాల్ట్‌లో DGIPL వారు భద్రపరచడానికి (“వినియోగదారు బంగారం”) అధికారం ఇస్తున్నారు. అలాంటి వినియోగదారు బంగారంలో సంబంధిత భాగం మీ తరఫున వాల్ట్ సంరక్షణదారు ద్వారా వాల్ట్‌లో భద్రపరచబడింది అని నిర్ధారించుకున్న తర్వాత లేదా ఈ నియమాలు, వర్తించే చట్టాలకు లోబడి DGIPL ద్వారా చివరి ఇన్‌వాయిస్ జారీ చేయబడింది అని నిర్ధారించుకున్న తర్వాత వినియోగదారు ఆర్డర్‌కు అనుగుణంగా మీ బంగారం కొనుగోలు పూర్తయింది అని పరిగణించబడుతుంది, అలాగే దానికి సంబంధించి టైటిల్ కూడా పంపించబడింది అని పరిగణించబడుతుంది.
4.3.3. వాల్ట్‌లో భద్రపరిచిన వినియోగదారు బంగారం సరిగా రక్షించబడుతోందని నిర్ధారించడానికి, వాల్ట్ సంరక్షణదారు అవసరమైన బీమా పాలసీ/లను తీసుకుంటారు, దాన్ని సురక్షితంగా ఉంచడానికి తీసుకున్న బీమా ఖర్చును వాల్ట్ సంరక్షణదారు భరిస్తారు. అటువంటి బీమా పాలసీ/లకు అనుగుణంగా, వాల్ట్‌లో భద్రపరిచిన వినియోగదారు బంగారానికి ఏదైనా నష్టం లేదా హాని జరిగితే, మీ ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి అలాగే బీమా పాలసీ/ల కింద మీ ప్రయోజనకారిగా ఉండటానికి ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్‌కు మీరు అధికారాన్ని ఇస్తున్నారు.
4.3.4. అవసరమైన బీమా పాలసీ/లను వాల్ట్ సంరక్షణదారు తీసుకున్నప్పటికీ, ఆయా పాలసీ/లలో కవర్ చేయని సంఘటన ఏదైనా జరిగితే, వినియోగదారు బంగారం ఆ మేరకు రిస్క్‌లో ఉండవచ్చు. వాల్ట్ సంరక్షణదారు తీసుకున్న బీమా పాలసీ/లు అంతర్జాతీయంగా పాటిస్తున్న ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. అంటే అగ్నిప్రమాదం, మెరుపు, తుఫాను, భూకంపం, వరద మొదలైన వాటికి కవరేజీ ఉంటుంది. కానీ యుద్ధం, విప్లవం, యుద్ధంలో వాడిన ఆయుధాల వల్ల ఏదైనా నష్టం, అణుధార్మికత మొదలైన వాటికి కవరేజీ ఉండదు.
5. బంగారం నిల్వ
ప్లాట్‌ఫామ్‌లో ఎప్పటికప్పుడు DGIPL ద్వారా ఈ అవసరం కోసం గరిష్ఠ వ్యవధిలోపు మీరు మీ వినియోగదారు బంగారాన్ని డెలివరీ చేసుకోవాల్సి ఉంటుంది (“గరిష్ఠ నిల్వ వ్యవధి”). వినియోగదారు కొనుగోలు చేసిన బంగారం నిల్వకు ప్రస్తుతం గరిష్ఠ నిల్వ వ్యవధి అనేది కొనుగోలు చేసిన తేదీ నుండి 10 (పది) సంవత్సరాలుగా ఉంది, అయితే ఇందులో మొదటి 5 (ఐదు) సంవత్సరాల పాటు బంగారం నిల్వపై ఎలాంటి ఛార్జీలు వర్తింపజేయకుండా ఉచిత నిల్వ వ్యవధిగా పరిగణించబడుతుంది. మీకు డెలివరీ చేసే క్రమంలో, ఈ విషయమై SafeGold భాగస్వామి మరియు/లేదా DGIPL ఎప్పటికప్పుడు అడిగే మీ చెల్లుబాటయ్యే చిరునామా మరియు/లేదా ఏవైనా ఇతర డాక్యుమెంట్‌లు/సమాచారం/ బయోమెట్రిక్ గుర్తింపును అందించాల్సి ఉంటుంది. గరిష్ఠ నిల్వ వ్యవధి సమయంలో మీరు ఎప్పుడైనా చిరునామాను అందించవచ్చు. గరిష్ఠ నిల్వ వ్యవధి సమయంలో మీరు చెల్లుబాటయ్యే చిరునామాను అందించలేకపోతే, గరిష్ఠ నిల్వ వ్యవధి గడువు తేదీ ముగిసిన తర్వాత 1 సంవత్సరం పాటు (ఈ కాలాన్ని “అదనపు కాలం” అంటారు) మీరు అందించిన సంప్రదింపు సమాచారం ద్వారా కనీసం ఒక్కసారి మిమ్మల్ని సంప్రదించడానికి SafeGold భాగస్వామి మరియు/లేదా DGIPL ప్రయత్నిస్తాయి. అలా సంప్రదించినప్పుడు (i) మీ బంగారాన్ని డెలివరీ చేయాల్సిన చిరునామా గురించి అడుగుతారు లేదా (ii) మీ వినియోగదారు బంగారాన్ని విక్రయించగా వచ్చిన మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి వీలుగా మీ బ్యాంక్ ఖాతా వివరాలను అడుగుతారు. అదనపు కాలం సమయంలో మీరు అందించిన సంప్రదింపు సమాచారంతో SafeGold భాగస్వామి మరియు/లేదా DGIPL మిమ్మల్ని సంప్రదించడం సాధ్యపడకపోతే లేదా అదనపు కాలంలో మీరు కింద తెలిపినవి చేయడంలో విఫలమైతే:
(a) ఏదైనా కారణం చేత మీరు బంగారం డెలివరీ అందుకోలేకపోవడం (బంగారం డెలివరీ కోసం మీరు ఏ చిరునామాను అందించకపోవడం కూడా ఇందులో ఉంది); లేదా
(b) వినియోగదారు బంగారాన్ని విక్రయించగా వచ్చిన మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి చెల్లుబాటయ్యే బ్యాంక్ వివరాలను అందించకపోవడం;
అప్పుడు, వర్తించే అదనపు కాలం పూర్తయ్యాక, సదరు వినియోగదారు బంగారాన్ని DGIPL విక్రయిస్తుంది. వినియోగదారుల నుండి బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆ సమయంలో వర్తించే ప్లాట్‌ఫామ్‌లో కనిపించే ధరకు ఆ బంగారాన్ని విక్రయిస్తుంది. ఈ విక్రయం నుండి పొందిన కొనుగోలు ప్రొసీడ్‌ల (“ఫైనల్ సేల్ ప్రొసీడ్‌లు”) నుండి ఉచిత నిల్వ వ్యవధి తర్వాత బంగారాన్ని నిల్వ చేసినందుకు DGIPLకు ఏవైనా నిల్వ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటే, వాటిని మినహాయించి, మిగతా మొత్తాన్ని ఇందుకోసమే తెరిచిన ఒక బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేస్తారు. ఈ ఖాతాకు ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్ మాత్రమే ఏకైక సంతకందారుగా ఉంటారు.
వర్తించే అదనపు కాలం గడువు తేదీ ముగిసిన నాటి నుండి 3 ఏళ్ల పాటు (దీన్ని “ఫైనల్ క్లెయిమ్ వ్యవధి” అంటారు) మీకు వర్తించే ఫైనల్ సేల్ ప్రొసీడ్‌లను క్లెయిమ్ చేసుకుంటున్నట్లు మీరు SafeGold భాగస్వామి, DGIPL లేదా ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్‌కు తెలియజేస్తే, ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్ తగిన సూచనలను జారీ చేసి ఈ అవసరం కోసం మీరు అందించే బ్యాంకు ఖాతాలోకి ఫైనల్ సేల్ ప్రొసీడ్లను బదిలీ చేస్తారు. ఫైనల్ సేల్ ప్రొసీడ్‌లను క్లెయిమ్ చేసుకోవడానికి మీరు తప్పనిసరిగా చెల్లుబాటయ్యే బ్యాంక్ ఖాతా వివరాలను అందించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి, అలా చేయడం సాధ్యపడకపోతే ఫైనల్ సేల్ ప్రొసీడ్లను బదిలీ చేయడం సాధ్యపడదు. ఫైనల్ సేల్ ప్రొసీడ్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు రూపంలో చెల్లించబడవు. ఫైనల్ క్లెయిమ్ వ్యవధిలోపు మీ ఫైనల్ సేల్ ప్రొసీడ్‌లను మీరు క్లెయిమ్ చేయకపోతే, ఆ ఫైనల్ సేల్ ప్రొసీడ్‌లు ప్రధానమంత్రి సహాయ నిధికి లేదా ఇందుకోసం మీరు సూచించిన ఏదైనా ఇతర ఫండ్‌కు అదనపు కాలం ముగియడానికి ముందే బదిలీ చేయబడతాయి.
6. ఫోర్స్ మాజుర్
ఒకవేళ కార్మికుల వివాదాలు, ధర్నాలు, దైవిక చర్యలు, వరదలు, ఉరుములు, తీవ్ర వాతావరణం, వనరుల కొరత, రేషన్ కోటా పెట్టడం, ఏదైనా వైరస్, ట్రోజన్ లేదా ఇతర ఊహించని పరిణామాలు, ప్లాట్‌ఫామ్ హ్యాకింగ్ లేదా అక్రమ వినియోగం, వినియోగ లేదా కమ్యూనికేషన్ వైఫల్యాలు, భూకంపాలు, యుద్ధం, విప్లవం, ఉగ్రదాడులు, అల్లర్లు, ప్రభుత్వ శత్రువుల చర్యలు, అడ్డంకులు, అధికారిక నిషేధాలు లేదా ఏదైనా చట్టం, ఆదేశం, ప్రకటన, నియంత్రణ, ఆర్డినెన్స్, డిమాండ్ లేదా ఏదైనా ప్రభుత్వం లేదా న్యాయ సంస్థ నుండి చట్టపరమైన ఆవశ్యకత, లేదా అటువంటి ప్రభుత్వ ప్రాతినిధ్యం, ఈ ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే పరికర వైఫల్యం, లేదా ఈ విభాగంలో ప్రస్తావించని, SafeGold భాగస్వామి మరియు/లేదా DGIPL నియంత్రించలేని, సరైన చర్యలు తీసుకున్నా అడ్డుకోలేని మరేదైనా సంఘటన కారణంగా ఈ నియమాలకు లోబడి SafeGold భాగస్వామి మరియు/లేదా DGIPL యొక్క పనితీరు గనుక ఆటంకానికి, నిషేధానికి, ఆలస్యానికి లేదా అంతరాయానికి గురైతే, అప్పుడు ఆ విపత్తు సంఘటన పూర్తయ్యే వరకు SafeGold భాగస్వామి మరియు/లేదా DGIPL విపత్తు సంఘటన మేరకు తమ పనితీరు నుంచి మినహాయింపు పొందుతాయి. అటువంటి పనితీరు అంతరాయం అనేది, SafeGold భాగస్వామిని మరియు/లేదా DGIPLల యొక్క బాధ్యతల ఉల్లంఘనగా పరిగణించడానికి వీల్లేదు.
7. DGIPL ద్వారా సేవల రద్దు
7.1. ఈ నియమాలు ఉల్లంఘనకు గురవడంతో సహా ఏదైనా కారణంతో ఏ సమయంలోనైనా SafeGold భాగస్వామి తన స్వీయ విచక్షణ మేరకు లేదా DGIPLతో చర్చించి యాక్సెస్‌ను మార్చవచ్చు, నిలిపివేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు, లేదా ప్లాట్‌ఫామ్‌లోని కొన్ని లేదా అన్ని సేవలకు లేదా ప్లాట్‌ఫామ్ ద్వారా మీరు పొందే ఏదైనా సేవలకు యాక్సెస్‌ను మార్చాలని, నిలిపివేయాలని, లేదా రద్దు చేయాలని DGIPL, SafeGold భాగస్వామిని కోరవచ్చు.
7.2. ఈ కింది సందర్భాల్లో కూడా ఈ నియమాలు రద్దు చేయబడతాయి:
7.2.1. ఒకవేళ DGIPL దివాళా తీసినప్పుడు లేదా రుణాలు చెల్లించలేని స్థితికి చేరుకుందని ప్రకటించబడినప్పుడు;
7.2.2. ఒకవేళ DGIPL తమ వ్యాపారాన్ని కొనసాగించలేనప్పుడు లేదా తమ వ్యాపారాన్ని కొనసాగించలేము అనే ఉద్దేశాన్ని ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్‌కు తెలియజేసినప్పుడు;
7.2.3. ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్ ఒప్పందాలలోని లేదా ఈ నియమాలలోని నియమ, నిబంధనలను DGIPL ఉల్లంఘించినప్పుడు, అలాగే ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్ పిలుపు మేరకు సంబంధిత ఉల్లంఘనకు 90 (తొంభై) రోజుల్లోగా పరిష్కారం చూపించడంలో DGIPL విఫలమైనప్పుడు;
7.2.4. వర్తించే ఏదైనా దివాళా చట్టం, రుణాలు చెల్లించలేని స్థితి, వైండింగ్ అప్ లేదా ఇలాంటి ఇతర వర్తించే చట్టం కింద DGIPL స్వచ్ఛందంగా ప్రొసీడింగ్‌ను మొదలుపెట్టిన సందర్భంలో, లేదా ఇక్కడ నుంచి అమల్లోకి వచ్చే, లేదా అటువంటి వర్తించే చట్టం కింద అసంకల్పిత చర్యలో ఉపశమనం కోసం ఆర్డర్‌ను నమోదు చేయడానికి సమ్మతిస్తుంది లేదా అపాయింట్‌మెంట్‌కు సమ్మతించడం లేదా రిసీవర్, లిక్విడేటర్, అసైనీ (లేదా అటువంటి అధికారి) ద్వారా మొత్తం లేదా దాని ఆస్తిలో గణనీయమైన భాగం లేదా దాని పునర్‌వ్యవస్థీకరణ, డిజల్యూషన్ లేదా లిక్విడేషన్ దిశగా ఏదైనా చర్య తీసుకోవడం;
7.2.5. DGIPL యొక్క వైండింగ్ అప్, దివాలా లేదా డిజల్యూషన్ ఆర్డర్ వచ్చిన తరువాత, లేదా వర్తించే చట్టానికి అనుగుణంగా DGIPLపై ఏదైనా కార్పొరేట్ దివాళా పరిష్కార ప్రక్రియను ప్రారంభించడం కోసం అప్లికేషన్ అంగీకరించబడటం;
7.2.6. చట్టబద్ధంగా స్వాధీనం చేసుకున్న ఎన్‌కంబ్రన్సర్, లేదా లిక్విడేటర్, జ్యుడీషియల్ సంరక్షణదారు, రిసీవర్, అడ్మినిస్ట్రేటివ్ రిసీవర్ లేదా ట్రస్టీ లేదా DGIPL యొక్క ఆస్తి మొత్తం లేదా గణనీయమైన భాగానికి సంబంధించి నియమించబడిన ఏదైనా సారూప్య అధికారి, లేదా DGIPL ప్రాపర్టీ లేదా ఆస్తుల్లో మొత్తం లేదా గణనీయమైన భాగంపై ఎగ్జిక్యూషన్ (లేదా సారూప్య ప్రక్రియ) విధించబడటం లేదా అమలు చేయబడటం లేదా జారీ చేయబడటం లేదా అటాచ్‌మెంట్, సెక్వెస్ట్రేషన్, డిస్ట్రెస్, లేదా లిక్విడేషన్ లేదా డిజల్యూషన్ లేదా అటువంటి పునర్వ్యవస్థీకరణ దిశగా DGIPLకు వ్యతిరేకంగా ఏదైనా చర్య తీసుకోబడింది లేదా విధించబడింది; లేదా
7.2.7. DGIPL లేదా రిసీవర్, రిసీవర్ మరియు మేనేజర్, ట్రస్టీ లేదా DGIPL లేదా దాని ఆస్తులకు సంబంధించి లేదా ఏదైనా ఈవెంట్ సారూప్యతకు సంబంధించి నియమించబడ్డ లిక్విడేటర్ లేదా ప్రొవిజనల్ లిక్విడేటర్ నియమించబడిన మీదట.
7.3. సెక్షన్ 8లో ప్రస్తావించే ఏవైనా సంఘటనలు ఏర్పడిన తర్వాత, అలాగే మీ వినియోగదారు బంగారాన్ని మీకు డెలివరీ చేసే క్రమంలో ఎప్పుడైనా ఏవైనా ఖర్చుల కోసం DGIPL వద్ద ఫండ్స్ కొరత ఉంటే, అటువంటి సందర్భంలో ఆ ఖర్చులను భరించడానికి వీలుగా వినియోగదారు బంగారంలో వీలైనంత భాగాన్ని విక్రయించడానికి మీరు ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్‌కు అధికారాన్ని ఇస్తున్నారు.
8. DGIPL సేవల రద్దు వల్ల కలిగే పరిణామాలు
8.1. ఏదైనా కారణం చేత సేవలు రద్దు చేయబడితే, కింద పేర్కొన్న నియమాలకు లోబడి ఉండాలి:
8.1.1. పేమెంట్ చేయలేక డీఫాల్ట్ అయిన సందర్భంలో, ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్ ఇక్కడ తెలిపిన విధంగా ఉన్న వినియోగదారుల జాబితాను సిద్ధం చేసుకోవాలి (a) ఏదైనా విలువైన మెటల్‌లో 0.5 గ్రాముల (అర గ్రాము) కంటే తక్కువ పరిమాణం గల వారు; మరియు (b) ఏదైనా విలువైన మెటల్‌లో 0.50 గ్రాముల (అర గ్రాము) కంటే ఎక్కువ పరిమాణం గల వారు; (అటువంటి వినియోగదారులను సమ్మిళితంగాా “EOD వినియోగదారులు” అని పిలుస్తారు).
8.1.2. EOD వినియోగదారు బంగారం కొనుగోలు చేసిన సంబంధిత SafeGold భాగస్వామి ద్వారా ప్రతి EOD వినియోగదారుకు ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్ ఈ విషయాలను తెలియజేయాల్సి ఉంటుంది, (i) పేమెంట్ చేయలేని డీఫాల్ట్ పరిస్థితి వచ్చిందని, అలాగే (ii) సంబంధిత EOD వినియోగదారులు కొనుగోలు చేసిన సదరు విలువైన మెటల్ అనేది, సూచించిన విధంగా (“EOD నోటీసు”) పరిగణించబడుతుందని తెలియజేయాలి.
8.1.3. ఎవరైనా EOD వినియోగదారుల కోసం:
8.1.3.1. 1 గ్రాము (ఒక గ్రాము) కంటే తక్కువ బంగారాన్ని కలిగి ఉన్న EOD వినియోగదారుల బంగారం, EOD నోటీసులో ప్రస్తావించిన తేదీ రోజున చలామణిలో ఉన్న మార్కెట్ ధరలకు విక్రయించబడుతుంది. అలా విక్రయించగా వచ్చిన మొత్తం డబ్బు సందర్భాన్ని బట్టి సంబంధిత SafeGold భాగస్వామితో EOD వినియోగదారుకు ఉన్న అకౌంట్‌కు లేదా నేరుగా వారి బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయబడుతుంది; మరియు
8.1.3.2. ఏదైనా బంగారంలో 1 గ్రాము (ఒక గ్రాము) కంటే ఎక్కువ కలిగి ఉన్న, EOD వినియోగదారుకు, ఈ అవసరం కోసం EOD నోటీసులో పేర్కొన్న బ్యాంక్ అకౌంట్‌కు సంబంధిత మింటింగ్, డెలివరీ ఛార్జీలను చెల్లించడానికి, తమ బంగారాన్ని డెలివరీ చేయాల్సిందిగా ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్‌కు అభ్యర్థనను సమర్పించుకోవడానికి EOD నోటీసు తేదీ నుండి 30 (ముప్ఫై) రోజుల వ్యవధి ఉంటుంది. ఆపై ఏ వినియోగదారులైతే ఆవశ్యకమైన మింటింగ్, డెలివరీ ఛార్జీలను చెల్లిస్తారో, వారికి వారు సూచించిన విధంగా సదరు ఖరీదైన లోహాలు సదరు వినియోగదారులకు డెలివరీ చేయబడతాయి. ఒకవేళ ఎవరైనా EOD వినియోగదారు నుండి మింటింగ్ మరియు డెలివరీ ఛార్జీలు, అలాగే డెలివరీ అభ్యర్థన ఏదీ అందనట్లయితే, సదరు వినియోగదారు వద్ద ఉన్న బంగారాన్ని EOD నోటీసులో పేర్కొన్న తేదీ నాడు చెలామణీలో ఉన్న మార్కెట్ ధరల వద్ద విక్రయించి, ఆ డబ్బు సంబంధిత SafeGold భాగస్వామి వద్ద మెయింటెయిన్ చేస్తోన్న ఖాతాలోకి లేదా సదరు వినియోగదారు బ్యాంక్ ఖాతాలోకి జమ చేయబడుతుంది.
పైన ఉన్న (8.1.3.1) మరియు (8.1.3.2) విభాగాలలో పేర్కొన్నట్టుగా, EOD నోటీసును అందుకున్న 45 (నలభై అయిదు) రోజులలోగా ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్ సముచిత చర్యలు తీసుకుంటారు.
8.1.4. ఒకవేళ EOD వినియోగదారు నుండి రావాల్సినంత పేమెంట్ గానీ డెలివరీ సమాచారం గానీ EOD నోటీసులో పేర్కొన్న తేదీలోగా ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్‌కు అందకపోయినట్లయితే, EOD వినియోగదారుకు చెందిన ఖరీదైన లోహాలను పేర్కొన్న తేదీ నాడు చెలామణీ అవుతోన్న మార్కెట్ ధర వద్ద విక్రయించి, ఆ డబ్బును (“EOD సేల్ ప్రొసీడ్స్”) ఒక ఎస్‌క్రో ఖాతాలో 1 (ఒక) సంవత్సరం పాటు EOD వినియోగదారు తరఫున డిపాజిట్ చేసి, సదరు EOD వినియోగదారును సంప్రదించడానికి ఆ 12 (పన్నెండు) నెలలలో కనీసం రెండు సార్లు ప్రయత్నిస్తారు. ఎగువున పేర్కొన్న 1 (ఒక) సంవత్సర కాల వ్యవధి ముగిసేలోగా ఆ EOD వినియోగదారు తన EOD సేల్ ప్రొసీడ్స్‌ను క్లెయిమ్ చేసుకోని సందర్భంలో, ఆ EOD వినియోగదారు సంబంధిత ఎస్‌క్రో ఖాతాలో ఉంచిన డబ్బును ప్రధాన మంత్రి సహాయ నిధికి గానీ, ఈ నియమాలకు అనుగుణంగా ఈ ప్రయోజనం కోసం EOD వినియోగదారు నిర్దేశించిన వేరే ఏదైనా నిధికి గానీ ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్ బదిలీ చేస్తారు.
8.2. ప్లాట్‌ఫామ్‌కు, సేవలకు మీ యాక్సెస్‌ను రద్దు చేయడం అనేది ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా జరుగుతుందని మీరు గుర్తిస్తున్నారు, అలాగే బంగారం ఖాతా వెంటనే డీయాక్టివేట్ చేయబడవచ్చు లేదా తొలగించబడవచ్చు, అంతేకాకుండా మొత్తం సంబంధిత సమాచారం మరియు/లేదా ప్లాట్‌ఫామ్‌కు లేదా సేవలకు, బంగారం ఖాతాకు యాక్సెస్ నిషేధించబడవచ్చు. ఇంకా, ఏదైనా థర్డ్ పార్టీ ద్వారా సేవల రద్దు లేదా నిలిపివేత జరిగితే అందుకు SafeGold భాగస్వామి మరియు/లేదా DGIPL బాధ్యత వహించరని మీరు అంగీకరిస్తున్నారు.
8.3. ఖాతా రద్దు అయిన తర్వాత మీ కంటెంట్ ఏదీ కూడా ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉండదు. ఒకసారి ఖాతా రద్దు అయితే, ఈ సమాచారాన్ని మీరు రికవరీ చేయలేరు.
8.4. ఈ నియమాలు రద్దయినప్పటికీ, వారంటీల నిరాకరణ, బాధ్యతా పరిమితి, వర్తించే చట్టపరమైన నిబంధనలు చెల్లుబాటు అవుతాయి.
9. వర్తించే చట్టాలు, వివాదాల పరిష్కారం
ఈ నియమాలు భారతదేశ చట్టాలకు లోబడి ఉంటాయి. ఆ చట్టాల పరంగానే ఇవి రూపొందించబడ్డాయి, వాటి ఆధారంగా ఈ నియమాలను అర్థం చేసుకోవాలి. ఈ నియమాలకు సంబంధించి తలెత్తే వివాదాలపై న్యాయపరిధి ముంబై నగర కోర్టులకు ఉంటుంది. ఈ నియమాల నుండి ఏదైనా వివాదం తలెత్తినట్లయితే, ఏకైక మధ్యవర్తి ద్వారా నిర్వహించబడే బైండింగ్ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించబడాలి. ఈ మధ్యవర్తి రెండు పార్టీల ద్వారా సంయుక్తంగా నియమించబడి, మధ్యవర్తిత్వం మరియు రాజీ చట్టం, 1996 ద్వారా పర్యవేక్షించబడతారు. మధ్యవర్తిత్వం జరిగే ప్రదేశం ముంబై, మహారాష్ట్ర, భారతదేశం..
భాగం – II
10. బంగారం ఖాతా క్రియేషన్, రిజిస్ట్రేషన్ బాధ్యతలు
10.1. సేవలను పొందడానికి ముందు, ఎప్పటికప్పుడు సూచించిన విధంగా వినియోగదారు రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయాలి. బంగారం ఖాతాను తెరవడానికి ప్లాట్‌ఫామ్‌లో ఇచ్చిన సూచనలను వినియోగదారు అనుసరించాలి. KYC అవసరాల నిమిత్తం వినియోగదారు, ప్లాట్‌ఫామ్‌కు అందించిన సంబంధిత సమాచారం, డాక్యుమెంట్‌లను సేకరించి, భద్రపరిచే అర్హతను SafeGold భాగస్వామి మరియు/లేదా DGIPL కలిగి ఉన్నాయి. DGIPL మరియు/లేదా SafeGold భాగస్వామికి అవసరమైనప్పుడల్లా, KYC ఆవశ్యకతలను నెరవేర్చడానికి కావాల్సిన అదనపు డాక్యుమెంట్‌లను వినియోగదారు అందించాల్సి ఉంటుంది. మీ గుర్తింపు చెల్లుబాటును నిర్ధారించడానికి గాను ఏవైనా విచారణలను చేపట్టడానికి మీరు DGIPLకు, SafeGold భాగస్వామికి అధికారం ఇస్తున్నారు. DGIPLకు, SafeGold భాగస్వామికి మీరు అందించిన సమాచార కచ్చితత్వానికి ఎప్పటికప్పుడు మీరు బాధ్యత వహించాలి. మీరు అందించిన సమాచారంలో ఏదైనా తప్పు ఉందని మీకు అనిపిస్తే, మీరు వెంటనే సరైన / అప్‌డేట్ అయిన సమాచారాన్ని అందించాలి.
10.2. KYC డాక్యుమెంట్‌లు / సమాచారం తప్పుగా ఉందని తేలినా లేదా డాక్యుమెంట్‌లు / సమాచారం అనుమానాస్పదంగా ఉన్నా SafeGold భాగస్వామి ద్వారా SafeGold భాగస్వామికి మరియు/లేదా DGIPLకు, ఏ బంగారం ఖాతానైనా మీకు ఎలాంటి నోటీసు ఇచ్చి గానీ లేదా ఇవ్వకుండా గానీ రద్దు చేసే హక్కు ఉంది. ఈ మేరకు మిమ్మల్ని మీరు గుర్తించుకోవడంలో, మీ ఖాతాను సరిగ్గా నిర్ధారించడంలో మరియు / లేదా KYC డాక్యుమెంట్‌లు / సమాచారంలో తప్పిదాల కారణంగా ఏవైనా నష్టాలు, క్లెయిమ్‌లు, బాధ్యతలు, ఖర్చులు మొదలైనవి తలెత్తితే ఆ నష్టపరిహారంతో పాటు ఏవైనా ఇతర ఖర్చులకు SafeGold భాగస్వామి మరియు/లేదా DGIPLను నష్టపరిహార రహితంగా ఉంచాల్సిన బాధ్యత మీదేనని మీరు అంగీకరిస్తున్నారు.
10.3. మీ వినియోగదారు గురించి తెలుసుకోండి (KYC) మరియు ధృవీకరణ
10.3.1. ఆర్డర్ చేయడానికి ముందు, SafeGold భాగస్వామి మరియు/లేదా DGIPL కోరిన విధంగా, వారు కోరిన రూపంలో నిర్దిష్ట KYC డాక్యుమెంటేషన్‌ను, ఇతర సమాచారాన్ని మీరు అందించాల్సి ఉంటుంది. ఈ సమాచారాన్ని మీ నుండి రిజిస్ట్రేషన్ సమయంలో, లేదా తర్వాత ఎప్పుడైనా అభ్యర్థించవచ్చు.
10.3.2. SafeGold భాగస్వామికి మీరు ఒకసారి ఆ డాక్యుమెంటేషన్‌ను, ఇతర సమాచారాన్ని అందించిన తర్వాత, ప్లాట్‌ఫామ్ ఉపయోగించి ఆర్డర్ చేయడానికి మీకు అర్హత వస్తుంది. (“వినియోగదారు ఆర్డర్”).
10.3.3. బంగారం ఖాతాను మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత, మీరు ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడాన్ని కొనసాగించడం ద్వారా, మీరు అందించిన సమాచారం, డాక్యుమెంటేషన్‌లు DGIPL మరియు/ లేదా SafeGold భాగస్వామి (DGIPL తరఫున) ద్వారా వెరిఫికేషన్‌కు లోబడి ఉంటాయని మీరు అంగీకరిస్తున్నారు. అవసరాన్ని బట్టి తగిన విధంగా వెరిఫికేషన్‌ను నిర్వహించడానికి మీరు DGIPL మరియు/ లేదా SafeGold భాగస్వామికి అనుమతిని ఇస్తున్నారు.
10.3.4. వెరిఫికేషన్‌ను బంగారం ఖాతా రిజిస్ట్రేషన్ సమయంలో గానీ లేదా ఆ తర్వాత ఏ సమయంలోనైనా నిర్వహించే హక్కు DGIPL మరియు/ లేదా SafeGold భాగస్వామికి ఉన్నట్లు మీరు గుర్తిస్తున్నారు. అలాగే మీ KYC డాక్యుమెంటేషన్‌ను పరిశీలించి, మీ అర్హతను నిర్ధారించే చర్యల్లో ఏదైనా థర్డ్-పార్టీని నియమించుకోవడానికి మీరు DGIPL మరియు/లేదా SafeGold భాగస్వామికి అధికారాన్ని ఇస్తున్నారు. KYC డాక్యుమెంట్‌లను ప్రాసెస్ చేయడానికి DGIPL మరియు/లేదా SafeGold భాగస్వామి తీసుకున్న చర్యలన్నీ దాని గోప్యతా విధానానికి, ఈ నియమాలకు అనుగుణంగా ఉంటాయి. KYC డాక్యుమెంట్‌లకు సంబంధించి థర్డ్ పార్టీ సేవాసంస్థకు యాక్సెస్ ఉండేలా ఇచ్చే అనుమతి విషయంలో, ఆ అనుమతి అనేది సదరు థర్డ్ పార్టీ సేవాసంస్థ గోప్యతా విధానం పరిధిలో ఉంటుందని స్పష్టంగా తెలియజేయడమైనది..
10.4. వినియోగదారు బాధ్యతలు
10.4.1. బంగారం ఖాతా సమాచారం గురించి గోప్యతను పాటించాల్సిన బాధ్యత మీదే, అలాగే బంగారం ఖాతాలో జరిగే అన్ని కార్యకలాపాల పూర్తి బాధ్యత కూడా మీదే. బంగారం ఖాతా సమాచారాన్ని అనధికారంగా ఎవరైనా ఉపయోగించినా లేదా రక్షణ విషయంలో ఏదైనా ఉల్లంఘన జరిగినా ఆ విషయాన్ని మీరు వెంటనే SafeGold భాగస్వామికి మరియు/లేదా DGIPLకు వెంటనే తెలియజేయడానికి మీరు అంగీకరిస్తున్నారు. ఈ సెక్షన్‌కు అనుగుణంగా నడుచుకోవడంలో మీ వైఫల్యం కారణంగా కలిగే నష్టానికి లేదా హానికి DGIPL లేదా SafeGold భాగస్వామి బాధ్యత వహించదు. బంగారం ఖాతా సమాచారాన్ని మీరు గోప్యంగా ఉంచడంలో విఫలమై, తద్వారా బంగారం ఖాతా అనధికార లేదా అధికారిక వినియోగం వల్ల DGIPLకు లేదా SafeGold భాగస్వామికి లేదా ఎవరైనా యూజర్‌కు లేదా ప్లాట్‌ఫామ్ సందర్శకునికి జరిగే నష్టాలకు మీరే బాధ్యులు కావచ్చు.
10.4.2. SafeGold భాగస్వామి ఆన్‌బోర్డింగ్ లేదా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మీరు అందించిన బంగారం ఖాతా సమాచారం పూర్తిగా సరైనదని, కచ్చితమైనదని, అప్‌డేట్ చేయబడినదని మీరు నిర్ధారిస్తున్నారు. ఏవైనా సేవలు పొందడానికి మరియు/లేదా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడానికి వేరొక వినియోగదారు ఖాతా సమాచారాన్ని వినియోగించడం నిషేధించబడింది.
10.4.3. ఒకవేళ మీరు నిజం కాని, కచ్చితంగా లేని, ప్రస్తుతం వినియోగంలో లేని లేదా పూర్తిగా లేని సమాచారాన్ని అందించినా (లేదా తప్పుగా మారే, కచ్చితంగా లేకుండా మారే, అప్రస్తుత లేదా అసంపూర్ణంగా మారే) లేదా మీ సమాచారం తప్పు అని, కచ్చితమైనది కాదని, ప్రస్తుతం వినియోగంలో లేనిదని, పూర్తిగా లేదని, లేదా నియమాలకు అనుగుణంగా లేదని SafeGold భాగస్వామి లేదా DGIPL అనుమానిస్తే, SafeGold భాగస్వామి మరియు SafeGold భాగస్వామి ద్వారా DGIPLలు ఈ ప్లాట్‌ఫామ్‌లోని బంగారం ఖాతాకు యాక్సెస్‌ను నిరవధికంగా నిలిపివేసే లేదా యాక్సెస్‌ను బ్లాక్ చేసే, ప్లాట్‌ఫామ్‌కు యాక్సెస్‌ను అందించకుండా చేయగలిగే హక్కును కలిగి ఉన్నాయి.
11. బంగారం కొనుగోలు
11.1. మా ప్లాట్‌ఫామ్‌లో లైవ్‌లో చూపబడే మార్కెట్ ఆధార కొనుగోలు ధర వద్ద బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. అందుకు రూ 1.00 (ఒక్క రూపాయి మాత్రమే) నుండి మొదలుకుని ఒక్కో రూపాయి ఇంక్రిమెంట్లలో కొనుగోలు చేయడానికి మీరు ఆఫర్ చేయవచ్చు. మార్కెట్ ఆధార ధరలు అంటే, భారతదేశంలోని వాణిజ్య బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల మీద ఆధార పడిన ధరలు అని అర్థం.
11.2. అటువంటి మార్కెట్ ఆధార బంగారం కొనుగోలు ధరలు పూర్తిగా కట్టుబడే ఆఫర్‌లతో ఉంటాయి, అందరు వినియోగదారులు అవే మార్కెట్ ధరలకు బంగారం కొనుగోలు చేయడానికి ఆఫర్ అందుకుంటారు. ఏదేమైనప్పటికీ, ఈ ధరలు ఒక్క రోజులో పలు పర్యాయాలు మారతాయని, కాబట్టి ఏదైనా ఆర్డర్‌కు సంబంధించి మీకుండే పేమెంట్ బాధ్యత అనేది, ఆ సమయంలో చెలామణీ అవుతోన్న మార్కెట్ ఆధార ధరలపై ఆధారపడి తదనుగుణంగా మారుతుందని మీరు అర్థం చేసుకున్నారు.
11.3. అయితే మీ వినియోగదారు బంగారం కోసం సరసమైన ధరను ఆఫర్ చేసేందుకు కృషి చేసినప్పటికీ, మీకు అందించే ధర, మార్కెట్‌లో ఉన్న ఇతర అందుబాటు ధరలకు సమానంగా గానీ లేదా దగ్గరగా ఉంటుందని గానీ గ్యారంటీ లేదు.
11.4. ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న పేమెంట్ ఆప్షన్ల ద్వారా చేసిన పేమెంట్ మాత్రమే అంగీకరించబడుతుంది, వీటిలో DGIPL ద్వారా చేర్చబడిన ఇతర థర్డ్ పార్టీ వెబ్‌సైట్ లేదా ప్లాట్‌ఫామ్ హోస్ట్ చేసే పేమెంట్ గేట్‌వే రీడైరెక్షన్ కూడా ఉంటుంది. కొనుగోలు / ఫుల్‌ఫిల్‌మెంట్ / తిరిగి-అమ్మకం / బంగారం బదిలీ సమయాల్లో, వర్తించే ప్రభుత్వ నిబంధనలకు లోబడి సంబంధిత పన్నులు విధించబడతాయి. ఒక్కసారి వినియోగదారు ఆర్డర్ చేయగానే, ఆ వినియోగదారు ఆర్డర్‌ను రద్దు చేసే అర్హత మీకు లేదని స్పష్టంగా తెలియజేయడమైనది. అయితే, ఏదైనా కారణం వల్ల పేమెంట్ చేయడం విఫలమైతే, వినియోగదారు ఆర్డర్ దానంతట అదే రద్దు చేయబడుతుంది.
11.5. వినియోగదారు ఆర్డర్ చేయడానికి ముందు మీరు అందించిన సమాచారం అంగీకారయోగ్యంగా లేకపోయినా, బంగారం కొనడానికి మీరు అర్హులు కాదని SafeGold భాగస్వామి మరియు/లేదా DGIPL అభిప్రాయానికి వచ్చినా, ఆ వినియోగదారు ఆర్డర్‌ను తమ స్వీయ విచక్షణ మేరకు రద్దు చేసే హక్కు SafeGold భాగస్వామికి మరియు/లేదా DGIPLకు ఉంది. బంగారం ఖాతా అందుకు అనుగుణంగా సవరించబడుతుంది. SafeGold భాగస్వామి, DGIPLలకు సంతృప్తికర రూపంలో KYC, ఇతర డాక్యుమెంటేషన్ అందే వరకు బంగారం ఖాతాను స్తంభింపజేసే హక్కు SafeGold భాగస్వామికి అలాగే DGIPLకు ఉంది.
11.6. DGIPLకు పేమెంట్‌లు అంది, KYC సమాచారం అంగీకారయోగ్యంగా ఉన్నట్లయితే, ఆర్డర్ పెట్టిన 3 (మూడు) వ్యాపార దినాల్లో మీరు పెట్టిన వినియోగదారు ఆర్డర్‌ను నిర్ధారిస్తూ, తగిన రూపంలో DGIPL ఇన్‌వాయిస్‌ను జారీ చేస్తుంది.
11.7. ఈ నియమాలకు విరుద్ధంగా ఏదైనా తలెత్తితే, ఏదైనా కారణం చేత, తమ స్వీయ విచక్షణ మేరకు వినియోగదారును అంగీకరించే లేదా తిరస్కరించే హక్కు SafeGold భాగస్వామికి మరియు/లేదా DGIPLకు ఉంది.
11.8. DGIPL పేమెంట్‌లను అందుకున్న తర్వాత, ఈ నియమాలకు అనుగుణంగా ఏదైనా వినియోగదారు ఆర్డర్ తిరస్కరణకు గురైన సందర్భంలో, ప్లాట్‌ఫామ్‌లో సూచించిన నియమ, నిబంధనలకు లోబడి ఆ పేమెంట్‌లు మీ ఖాతాకు లింక్ అయ్యి ఉన్న బ్యాంక్ ఖాతాలోకి తిరిగి జమ చేయబడతాయి.
12. బంగారం డెలివరీ
12.1. వినియోగదారు బంగారాన్ని డెలివరీ కోరుకునే వినియోగదారులకు ఈ నియమాలకు అనుగుణంగా ఈ ప్లాట్‌ఫామ్ డెలివరీ సేవలను అందిస్తోంది.
12.2. ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారు బంగారాన్ని డెలివరీగా పొందే అర్హత మీకు ఉంది (“డెలివరీ అభ్యర్థన”).
12.3. డెలివరీ అభ్యర్థనను పెట్టిన తర్వాత, వర్తించే ఛార్జీలను చెల్లించి, మీరు డెలివరీ అభ్యర్థనను నిర్ధారించాలి. మీరు డెలివరీ అభ్యర్థించిన బంగారం పరిమాణానికి తగ్గట్టుగా మీ బంగారం ఖాతా నుండి బంగారం ప్రొవిజినల్‌గా డెబిట్ చేయబడుతుంది (“డెలివరీ చేయబడిన వినియోగదారు బంగారం”). DGIPLకు డెలివరీ అభ్యర్థన అందిన తర్వాత, సదరు బంగారం ఖాతా నుండి డెలివరీ చేయబడిన వినియోగదారు బంగారం డెబిట్ చేయబడుతుంది.
12.4. డెలివరీ అభ్యర్థనను నిర్ధారించిన 7 (ఏడు) నుంచి 10(పది) వ్యాపార దినాల్లోగా లేదా DGIPLకు అవసరమైతే అంత కంటే ఎక్కువ వ్యవధిలో, మీరు సూచించిన షిప్పింగ్ చిరునామాకు డెలివరీ చేయాల్సిన వినియోగదారు బంగారం డెలివరీ కోసం DGIPL ఏర్పాట్లు చేస్తుంది. డెలివరీ అభ్యర్థనను ప్రాసెస్ చేయడానికి వీలుగా ప్లాట్‌ఫామ్‌లో సరైన చిరునామాను ఇచ్చినట్లు నిర్ధారించుకోవడం పూర్తిగా మీ బాధ్యత. DGIPL ద్వారా మీ డెలివరీ అభ్యర్థనను ప్రాసెస్ చేసిన తర్వాత షిప్పింగ్ చిరునామాను మార్చే అవకాశం మీకు ఉండదు.
12.5. డెలివరీ అయిన ప్యాకేజీని మీరు జాగ్రత్తగా పరిశీలించాలి, ప్యాకేజింగ్‌లో ఏవైనా మార్పులు చేర్పులు చేసినట్లు అనిపిస్తే దాన్ని తీసుకోకండి. అయితే, డెలివరీ చేయబడిన ప్యాకేజీలో మార్పులు చేర్పులు చేసినట్లు మీరు భావిస్తే ఆ విషయం గురించి DGIPLకు లేదా SafeGold భాగస్వామికి డెలివరీ అయిన వినియోగదారు బంగారాన్ని అందుకున్న 10 రోజుల లోపు మీరు తెలియజేయాల్సి ఉంటుంది. ఇందుకోసం DGIPLకు అవసరమైన ఇతర సమాచారాన్ని కూడా అందించాలి (“రిటర్న్ అభ్యర్థన”). డెలివరీ అయిన వినియోగదారు బంగారం విషయంలో ఏదైనా ఫిర్యాదు ఉన్నట్లయితే, దాని పరిష్కారం కోసం మీరు SafeGoldను గానీ లేదా SafeGold భాగస్వామిని గానీ డెలివరీ అయిన 10 రోజులలోపు సంప్రదించాలి. ఒకవేళ వినియోగదారు నుండి రివర్స్ పికప్‌ను DGIPL చేపట్టిన పక్షంలో డెలివరీ చేయబడిన వినియోగదారు బంగారం ఒరిజినల్ ప్యాకేజీని తిరిగి DGIPLకు 14 (పద్నాలుగు) వ్యాపార దినాల్లోగా DGIPL సూచించిన విధంగా పంపించాలి. మీ రిటర్న్ అభ్యర్థనను DGIPL ఆమోదించాలి, ఆ తర్వాత మీరు సూచించిన షిప్పింగ్ చిరునామాకు డెలివరీ చేయాల్సిన వినియోగదారు బంగారాన్ని రీ-డెలివరీ చేయడానికి లేదా మీరు కోరిన మేరకు అదే బంగారం మొత్తాన్ని వినియోగదారు బంగారం బ్యాలన్స్‌లో జోడించడానికి DGIPL ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం అయ్యే షిప్పింగ్ ఛార్జీలను DGIPL భరిస్తుంది. అయితే, ఒకవేళ మీరు అర్థంపర్థం లేని, అన్యాయమైన రిటర్న్ అభ్యర్థనలు పెడితే, మీపై అందుబాటులో ఉన్న అన్ని చర్యలు తీసుకునే హక్కు SafeGold భాగస్వామికి మరియు/లేదా DGIPLకు ఉంది. ఈ చర్యల్లో భాగంగా మిమ్మల్నిప్లాట్‌ఫామ్ సేవలను వినియోగించుకునే అవకాశం లేకుండా బ్లాక్-లిస్ట్ చేయవచ్చు లేదా బ్లాక్ చేయవచ్చు.
12.6. మీరు డెలివరీ రసీదుపై సంతకం చేయడం ద్వారా, DGIPLతో పెట్టిన డెలివరీ అభ్యర్థన మేరకు వినియోగదారు బంగారం డెలివరీ అయినట్లు మీరు అంగీకరిస్తున్నారు. ఆపై డెలివరీలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదుల మేరకు ఏదైనా రీఫండ్ / రీప్లేస్‌మెంట్‌లు చేయడానికి లేదా ఈ నియమాలకు అనుగుణంగా మీ వైపు నుండి జరిగిన తప్పిదానికి (సందర్భాన్ని బట్టి) DGIPL బాధ్యత వహించదు.
12.7. డెలివరీ సమయంలో, డెలివరీ చేయబడే వినియోగదారు బంగారాన్ని అందుకోవడానికి అందుబాటులో ఉండాల్సిన బాధ్యత మీదే. ఒకవేళ డెలివరీ సమయంలో మీరు అందుబాటులో లేకపోతే, DGIPL వారి కొరియర్ ఏజెంట్ ప్యాకేజీని DGIPLకు తిరిగి పంపించడానికి ముందు మరోసారి మీకు డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ డెలివరీ చేయాల్సిన బంగారం తిరిగి DGIPL వద్దకు చేరితే, ప్యాకేజింగ్‌లో మార్పులు చేర్పులు ఏమీ చోటు చేసుకోలేదని DGIPL నిర్ధారించుకున్న తర్వాత, మీ వద్ద నుండి బాకీ ఉన్న ఛార్జీలు (ఏవైనా ఉంటే) మినహాయించుకుని, మిగతా డెలివరీ చేయాల్సిన బంగారాన్ని, సంబంధిత బంగారం ఖాతాకు క్రెడిట్ చేస్తారు. ఒకవేళ మీరు రీ-డెలివరీ కోసం అభ్యర్థిస్తే, డెలివరీ చేయాల్సిన వినియోగదారు బంగారాన్ని మీకు మళ్లీ పంపించడానికి వర్తించే ఛార్జీలను భరించాల్సిన బాధ్యత మీదే.
12.8. వినియోగదారు తప్పిదం కాకుండా, డెలివరీ విషయంలో ఏదైనా సమస్య ఉన్న సందర్భాలలో (ఆలస్యమైన డెలివరీ/తప్పు డెలివరీ) లేదా ప్యాకేజింగ్ విషయంలో ఏదైనా సమస్య ఉన్న సందర్భాలలో (ప్యాకేజింగ్‌లో మార్పులు చేర్పులు చేయడం) ఎగువున పేర్కొన్న ఛార్జీలు వర్తించవు.
12.9. ఏదైనా ఊహించని సంఘటన వల్ల డెలివరీ చేయాల్సిన వినియోగదారు బంగారాన్ని DGIPL వారు డెలివరీ చేయలేకపోతే, ఆ విషయం గురించి మీకు DGIPL తెలియజేసి, నిర్దిష్ట మార్గాల ద్వారా డెలివరీ అందేలా ఏర్పాట్లు చేయవచ్చు. అటువంటి సందర్భాల్లో, డెలివరీ పూర్తి చేయడంలో భాగంగా తలెత్తే అదనపు ఖర్చులు, ఫీజులను చెల్లించడానికి మీరు అంగీకరిస్తున్నారు.
12.10. ఫ్రాక్షనల్ క్వాంటిటీలో అంటే 0.5 గ్రాముల కన్నా తక్కువ మొత్తంలో ఉండే బంగారాన్ని (“కనీస క్వాంటిటీ”) వినియోగదారు అభ్యర్థించినప్పటికీ DGIPL డెలివరీ చేయదు. ఎప్పటికప్పుడు మారే కనీస క్వాంటిటీ గురించి తెలుసుకోవడం కోసం మీరు అప్పుడప్పుడు ప్లాట్‌ఫామ్‌ను సందర్శించాల్సిందిగా సిఫార్సు చేస్తున్నాము. ఒకవేళ కనీస క్వాంటిటీ కంటే తక్కువ పరిమాణంలో మీకు బంగారం డెలివరీ కావాలంటే, దయచేసి గమనించండి, అప్పుడు అటువంటి వినియోగదారు బంగారాన్ని ప్లాట్‌ఫామ్‌లో కనిపిస్తున్న విక్రయ ధరల ఆధారంగా DGIPL విక్రయిస్తుంది. బంగారానికి బదులుగా మీరు అందించిన బ్యాంక్ ఖాతాలోకి వర్తించే సేల్ ప్రొసీడ్‌లను జమ చేస్తుంది. ఒకవేళ మీరు అందించిన ఖాతా నంబర్‌లో ఏదైనా తప్పు ఉండే, అందుకు SafeGold భాగస్వామి మరియు / లేదా DGIPL బాధ్యత వహించదు.
12.11. ఈ నియమాలలో ఉన్నవాటికి విరుద్ధంగా ఉంటే, ఈ నియమాలకు అనుగుణంగా లేని వినియోగదారు ఆర్డర్‌ను తగిన కారణాలను తెలియజేస్తూ తిరస్కరించే హక్కు DGIPLకు ఉంది. అలాగే ఈ నిర్ణయానికి వెనుక గల కారణాలను వినియోగదారుకు నేరుగా కానీ SafeGold భాగస్వామి ద్వారా గానీ తెలియజేస్తుంది.
12.12. బంగారం ఖాతాకు చేసిన మార్పుల ఆధారంగా (వినియోగదారు ఆర్డర్‌ల ప్రకారం మరియు/లేదా వినియోగదారు అభ్యర్థనల ప్రకారం), మీరు చేసిన ఆర్డర్‌లు మరియు/లేదా వినియోగదారు అభ్యర్థనలకు, బంగారం ఖాతాలో చేసిన మార్పులకు పొంతన లేదని మీకు అనిపిస్తే, మీరు SafeGold భాగస్వామిని (లేదా ఈ విషయమై SafeGold భాగస్వామి తమను సంప్రదించడానికి పేర్కొన్న ఇతర చిరునామాల వద్ద) సంప్రదించవచ్చు, అటువంటి సమస్యలేవైనా ఉంటే ఈ భాగస్వామి సంబంధిత చర్యలు తీసుకొని తదనుగుణంగా పరిష్కరిస్తారు.
12.13. వినియోగదారు బంగారాన్ని మీరు ఎవరి వద్దా తాకట్టు పెట్టలేరు, అలాగే వేరొక యూజర్‌కు బదిలీ చేయలేరు, అలాగే DGIPL ప్రత్యేకంగా అనుమతిస్తే తప్పించి బంగారం ఖాతాను కూడా బదిలీ చేయడం సాధ్యపడదు. ఒకవేళ మీరు మరణిస్తే, DGIPL ప్రత్యేక అనుమతి మేరకు, మీ వాల్ట్‌లో ఉన్న ఏదైనా వినియోగదారు బంగారం, మీ బంగారం ఖాతా మీ చట్టపరమైన వారసులకు బదిలీ చేయబడుతుంది. ఇందుకోసం అవసరమైన విచారణ చేపడుతుంది. దీని తర్వాత వినియోగదారు బంగారం, బంగారం ఖాతాకు మీ చట్టపరమైన వారసుడు(లు) వినియోగదారుగా పరిగణించబడతారు, ఈ నియమాలు మీ వారసుడు(ల)కు వర్తిస్తాయి.
12.14. డెలివరీ కోసం అందుబాటులో ఉంచడానికి వీలుగా కొన్ని వస్తువులను ప్లాట్‌ఫామ్ ప్రదర్శిస్తుంది. స్క్రీన్ ఆటోమేటిక్ సెట్టింగ్‌లు, ఫోటోగ్రఫీ టెక్నిక్‌ల కారణంగా కొన్ని వస్తువులు వాటి వాస్తవ పరిమాణం కంటే పెద్దవిగా లేదా చిన్నవిగా కనిపించవచ్చు. ఈ విషయమై ఎటువంటి చట్టబద్ద చర్యకూ SafeGold భాగస్వామి, DGIPLలు బాధ్యత వహించవు. ప్లాట్‌ఫామ్‌లో ప్రదర్శించే ప్రోడక్ట్ గురించి పూర్తి వివరాలను, స్పష్టంగా కనిపించేలా చేయడానికి SafeGold భాగస్వామి కృషి చేయాలి.
12.15. DGIPL లేదా SafeGold భాగస్వామికి నేరుగా సంబంధం లేని కారణాల వల్ల, ప్లాట్‌ఫామ్‌లో డేటా తప్పుగా కనిపించవచ్చు, ప్లాట్‌ఫామ్‌లో కొన్ని సిస్టమ్ తప్పిదాల వల్ల లేదా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్న పరికరంలో తప్పిదాల వల్ల ఇలా జరగవచ్చు. జరిగిన తప్పులను, స్వీయ విచక్షణ మేరకు సరిదిద్దడానికి SafeGold భాగస్వామికి హక్కు ఉంది. కచ్చితంగా లేని లేదా తప్పులు ఉన్న ధరలకు మీరు ఏవైనా అభ్యర్థనలు / ఆర్డర్ పెడితే వాటిని నెరవేర్చకుండా తిరస్కరించే హక్కు SafeGold భాగస్వామికి లేదా DGIPLకు ఉంది.
12.16. ప్లాట్‌ఫామ్‌లో చూపించిన ధరలు ఫిక్స్‌డ్‌గా ఉంటాయి. బేరం ఆడటానికి ఆస్కారం ఉండదు. మీకు తెలియకుండానే ప్లాట్‌ఫామ్‌లో ఉన్న ధరలు మారడానికి అవకాశం ఉంటుంది.
13. వినియోగదారు బంగారం విక్రయం
13.1. ప్లాట్‌ఫామ్‌లో ఉన్న విక్రయ ధరలకు లోబడి మార్కెట్ పని వేళలలో వినియోగదారు బంగారాన్ని విక్రయించే అవకాశం మీకు ఇవ్వడం జరుగుతుంది. ధరలు మీకు అంగీకారయోగ్యంగా అనిపిస్తే, DGIPL ఆమోదించే రీతిలో మీరు విక్రయ అభ్యర్థనను నిర్ధారించవచ్చు (“విక్రయ అభ్యర్థన”). విక్రయ అభ్యర్థనకు తగినట్లుగా వినియోగదారు బంగారాన్ని విక్రయించిన మొత్తానికి తగిన పరిమాణంలో మీ బంగారం ఖాతా నుండి బంగారం డెబిట్ అవుతుంది (“విక్రయించిన వినియోగదారు బంగారం”).
13.2. విక్రయ అభ్యర్థన నిర్ధారించబడిన 2 (రెండు) వ్యాపార దినాల్లోగా లేదా అదనంగా అవసరమయ్యే కాల వ్యవధిని బట్టి, విక్రయ అభ్యర్థనకు సంబంధించిన పేమెంట్, విక్రయ అభ్యర్థన పెట్టిన సమయంలో ఉన్న విక్రయ ధరలకు అనుగుణంగా DGIPL ద్వారా పంపిణీ చేయబడుతుంది. మీరు అందించిన వివరాల ప్రకారం మీ బ్యాంక్ ఖాతాకు పేమెంట్‌లు చేరేలా DGIPL ఏర్పాట్లు చేస్తుంది. మీరు అందించిన వివరాల్లో ఖాతా నంబర్, IFSC కోడ్ మొ. వాటిలో ఏదైనా తప్పిదం ఉంటే, అందుకు DGIPL బాధ్యత వహించదు.
13.3. వీలైనంత మేరకు ఉత్తమ విధానంలో, అలాగే వాణిజ్య బులియన్ మార్కెట్ పని చేస్తున్నప్పుడు మాత్రమే ఈ సేవను అందించడానికి DGIPL మరియు/లేదా SafeGold భాగస్వామి ప్రయత్నిస్తాయి. ఈ సదుపాయం మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని DGIPL, SafeGold భాగస్వాములు గ్యారంటీ ఇవ్వవు. ఇంకా చెప్పాలంటే, కొనుగోలు చేయబడే వినియోగదారు బంగారాన్ని కొనే కొనుగోలుదారు DGIPL గానీ లేదా వేరొక పార్టీ (కొనుగోలు చేయబడే వినియోగదారు బంగారాన్ని కొనడానికి ఆసక్తి చూపేవారు) అయ్యుంటారు. అయితే, చలామణీలో ఉన్న ధరలకు అనుగుణంగా, లావాదేవీ సమయంలో DGIPL నిర్ధారించిన ధరలకు అనుగుణంగా కొనుగోలు చేయబడే వినియోగదారు బంగారం యొక్క సేల్ ప్రొసీడ్లను బదిలీ చేసే బాధ్యత ఎల్లప్పుడూ DGIPL మీదే ఉంటుంది.
13.4. మీ వినియోగదారు బంగారంపై మీకు 5 ఏళ్ల పాటు, లేదా ఈ విషయమై DGIPL ఎప్పటికప్పుడు తమ స్వీయ విచక్షణ మేరకు నిర్దేశించిన నిర్దిష్ట కాలం పాటు, ఉచిత నిల్వ సదుపాయం అందించబడుతుంది, ఆ విషయాన్ని ప్లాట్‌ఫామ్‌లో వినియోగదారులకు తెలియజేస్తుంది (“ఉచిత నిల్వ కాలం”). ఉచిత నిల్వ కాలం గడువు పూర్తయిన తర్వాత, ప్లాట్‌ఫామ్‌లో నిర్దేశించిన రేటును బట్టి వినియోగదారు బంగారంపై నిల్వ ఛార్జీలను విధించే హక్కు DGIPLకు ఉంది. అలాగే వీటిని ఎప్పటికప్పుడు మార్చే హక్కు కూడా ఉంది. నిర్దేశించిన రేటు ప్రకారం ప్రతి నెలా బంగారం బ్యాలన్స్‌లో కొంత శాతం భాగాన్ని తగ్గించడం ద్వారా ఈ ఛార్జీలు విధించబడతాయి. ఈ నిల్వ ఛార్జీల గురించి అర్థం చేసుకోవడానికి మీరు తరచుగా ప్లాట్‌ఫామ్‌ను సందర్శించాల్సిందిగా సూచించడమైనది.
13.5. మీ వినియోగదారు బంగారం కోసం సరసమైన ధరను ఆఫర్ చేసేందుకు కృషి చేసినప్పటికీ, మీకు అందించే ధర, మార్కెట్‌లో ఉన్న ఇతర అందుబాటు ధరలకు సమానంగా గానీ లేదా దగ్గరగా ఉంటుందని గానీ గ్యారంటీ లేదు.
14. మోసపూరిత లావాదేవీలు
14.1. ఏదైనా థర్డ్ పార్టీతో ఉద్దేశపూర్వకంగా గానీ లేదా అనుకోకుండా గానీ వినియోగదారులు వారి మొబైల్ వాలెట్ వివరాలను, వ్యక్తిగత UPI పిన్‌ను లేదా OTPలను (“పేమెంట్ సమాచారం”) షేర్ చేయకుండా జాగ్రత్త వహించాలి. Safegold కానీ SafeGold భాగస్వామి కానీ, కాల్ ద్వారా గానీ లేదా మరేదైనా రూపంలో గానీ పేమెంట్ సమాచారాన్ని అడగదు. అటువంటి వివరాలను షేర్ చేయడం ద్వారా జరిగే మోసాలకు Safegold/SafeGold భాగస్వామి/థర్డ్ పార్టీ సేవాసంస్థలు/పేమెంట్ గేట్‌వే భాగస్వాములు బాధ్యత వహించవు.
14.2. DGIPL నుండి ప్లాట్‌ఫామ్ ద్వారా బంగారం కొనుగోలు చేయడానికి ఏదైనా వ్యక్తికి చెందిన పేమెంట్ సమాచారం లేదా పేమెంట్ సాధానాన్ని మోసపూరిత రీతిలో ఉపయోగించిన సందర్భంలో (“మోసపూరిత లావాదేవీ”), ఆ లావాదేవీకి సంబంధించిన సమాచారాన్ని బాధితులతో లేదా సంబంధిత ప్రభుత్వ సంస్థలతో DGIPL షేర్ చేస్తుంది, అయితే ఇందుకోసం SafeGold భాగస్వామి ద్వారా లేదా DGIPL వారి వినియోగదారు మద్దతు నంబర్, ఈమెయిల్ చిరునామా లాంటి సరైన విధానాల ద్వారా, సంబంధిత పబ్లిక్ అథారిటీ లేదా సైబర్ సెల్ అందించిన డాక్యుమెంటేషన్‌తో బాధితులు DGIPLను సంప్రదించాలి.
DGIPL మరియు/లేదా ప్లాట్‌ఫామ్ పార్ట్‌నర్ తమ అంతర్గత మార్గదర్శకాల మేరకు ఏదైనా లావాదేవీని గానీ లేదా వినియోగదారు ఖాతాను గానీ అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించిన సందర్భంలో, లేదా ప్లాట్‌ఫామ్‌లో ఏదైనా లావాదేవీ కోసం లేదా బంగారాన్ని కొనుగోలు చేయడానికి వినియోగదారు పేమెంట్ సమాచారాన్ని లేదా పేమెంట్ సాధనాన్ని అనధికారంగా లేదా మోసపూరిత విధానంలో ఉపయోగించినట్లు తెలిస్తే (మోసపూరిత యూజర్), DGIPLకు మరియు/లేదా ప్లాట్‌ఫామ్ భాగస్వామికి కింద పేర్కొన్న చర్యలను చేపట్టే హక్కులు ఉంటాయి:
i. అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించిన లావాదేవీని వెరిఫై చేయడానికి కావాల్సిన అదనపు KYC సమాచారాన్ని లేదా ఇతర డాక్యుమెంటేషన్‌ను యూజర్ నుండి కోరడం;
ii. అటువంటి వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉన్నప్పుడు, అలాంటి మోసపూరిత యూజర్‌ను బ్లాక్ చేయడం, మరియు/లేదా వారికి అనుబంధంగా ఉన్న ఏవైనా ఖాతాలను ఫ్రీజ్ చేయడం;
iii. చెలామణీ అవుతోన్న బంగారం రేటును బట్టి మోసపూరిత యూజర్ కొనుగోలు చేసిన బంగారం అమ్మకంతో సహా వీలైనంత మేరకు అటువంటి మోసపూరిత లావాదేవీని తిరిగి వెనక్కి మార్చడం; అలాగే
iv. సంబంధిత అధికారులకు ఆ మోసపూరిత యూజర్ వివరాలను, ఇతర లావాదేవీల సమాచారాన్ని అందించడం.
14.3. ఏదైనా మోసపూరిత లావాదేవీ జరిగిన సందర్భంలో, ఫండ్స్‌ను రికవరీ చేయడంలో యూజర్‌కు లేదా బాధితునికి DGIPL మరియు/లేదా ప్లాట్‌ఫామ్ సేవాసంస్థ సహాయం చేస్తుంది, అయితే వారి అభ్యర్థన మేరకు, సదరు మోసాన్ని నిరూపించే సాక్ష్యం, డాక్యుమెంటేషన్‌ను అందించాలి. యూజర్‌కు లేదా బాధితునికి థర్డ్ పార్టీ పేమెంట్ సేవా సంస్థ నుండి లేదా బ్యాంక్ నుండి రావాల్సిన రీఫండ్ రాకపోతే, పేమెంట్ గేట్‌వే ఛార్జీలను తగ్గించి, మిగతా మొత్తాన్ని యూజర్‌కు లేదా బాధితునికి బదిలీ చేసే హక్కు DGIPLకు ఉంది.
14.4. అయితే, మోసపూరిత లావాదేవీ ద్వారా మోసపూరిత యూజర్ ఇదివరకే బంగారాన్ని కొని, దాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నా లేదా మోసపూరిత యూజర్ కొన్న బంగారాన్ని డెలివరీ కోసం ఎంచుకున్నా ఆ లావాదేవీని తిరిగి వెనక్కి మార్చే బాధ్యత DGIPLకు లేదని స్పష్టం చేయబడింది. ఇలాంటి సందర్భంలో, DGIPL తమ శక్తి మేరకు మోసపూరిత యూజర్ గురించిన సమాచారాన్ని తెలియజేస్తుంది. ఫండ్స్ పంపించిన బ్యాంక్ ఖాతా లేదా మొబైల్ వాలెట్ ఖాతా వివరాలు, లేదా బంగారం డెలివరీ అయిన భౌతిక చిరునామా వివరాలు మొదలైన సమాచారాన్ని బాధితుడికి లేదా సంబంధిత అధికార సంస్థలకు తెలియజేస్తుంది..
15. ప్లాట్‌ఫామ్, ఇంకా సేవల వినియోగం
15.1. ఈ సేవలు మీ వ్యక్తిగత వినియోగం కోసమేనని మీరు అంగీకరిస్తున్నారు, అలాగే ప్లాట్‌ఫామ్‌లో ప్రదర్శించబడే (ప్లాట్‌ఫామ్‌కు ఉన్న యాక్సెస్ పరిధికి లోబడి) బంగారం ధరలు లేదా బంగారానికి సంబంధించి వివరాలు మరియు/లేదా ఇంకా ఏదైనా సమాచారాన్ని మీరు మరే ఇతర మాధ్యమంలోనూ ప్రచురించబోమని అంగీకరిస్తున్నారు. సేవల నుండి పొందిన ఉత్పత్తులను లేదా సేవలను మీరు మార్చడం, కాపీ చేయడం, పంపిణీ చేయడం, ట్రాన్స్‌మిట్ చేయడం, ప్రదర్శించడం, చూపించడం, మళ్లీ ఉత్పత్తి చేయడం, ప్రచురించడం, లైసెన్స్ తీసుకోవడం, కొత్త వర్క్‌లను క్రియేట్ చేయడం, బదిలీ చేయడం, లేదా ఏదైనా సమాచారాన్ని, సాఫ్ట్‌వేర్‌ను విక్రయించడం లాంటివి చేయకూడదు.
15.2. ఈ నియమాలు, గోప్యతా విధానాలకు లోబడి, కింద పేర్కొన్న చర్యలను చేపట్టేందుకు DGIPL, ప్లాట్‌ఫామ్ సేవాసంస్థకు నాన్-ఎక్స్‌క్లూజివ్, ప్రపంచవ్యాప్త, రాయల్టీ-రహిత హక్కును మీరు మంజూరు చేస్తున్నారు (a) మీకు సేవలు అందించడంలో భాగంగా అవసరమైన మేరకు మీ డేటాను సేకరించి, నిల్వ చేసి, పంపిణీ చేయడం, మరియు (b) ఇతర వ్యక్తులతో కమ్యూనికేషన్‌లో భాగంగా మీ డేటాను షేర్ చేయడం, అలాగే మీరు సూచించిన విధంగా లేదా సేవలు అనుమతించిన విధంగా సేవలను అందించడానికి మీ డేటాను పంపిణీ చేయడం, పబ్లిక్‌గా చూపించడం, ప్రదర్శించడం. మీరు బంగారం కొనుగోలు చేసే సమయంలో లేదా బంగారం కొనుగోలుకు సంబంధించి ఏదైనా సేవను పొందడానికి ప్లాట్‌ఫామ్‌ను వినియోగించిన సందర్భంలో మీరు జెనరేట్ చేసిన ఏదైనా డేటాను నియంత్రణ సంస్థలకు/ప్రభుత్వ అధికారులకు లేదా న్యాయాధికార సంస్థలకు లేదా ఈ విషయంలో SafeGold భాగస్వామి నిర్దేశించిన విధంగా ఉపయోగించడానికి మరియు/లేదా షేర్ చేయడానికి మీరు SafeGold భాగస్వామికి మీ సమ్మతిని అందిస్తున్నారు. మీ డేటాను ప్లాట్‌ఫామ్ సేవాసంస్థ, DGIPLతో షేర్ చేసుకుంటుంది, ఆపై DGIPL వారు మీ డేటాను ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్‌తో షేర్ చేస్తారు. తద్వారా కొనుగోలు చేసిన బంగారానికి సంబంధించి ట్రస్టీ అడ్మినిస్ట్రేటర్ తన బాధ్యతలను నెరవేర్చగలుగుతారు. మీ డేటా సెక్షన్ 22లో పేర్కొన్న గోప్యతా బాధ్యతల ద్వారా నిర్వహించబడటం కొనసాగుతుంది.
15.3. మీరు వీటికి ప్రాతినిధ్యం వహిస్తూ, వారంటీ ఇస్తున్నారు: (i) ఈ నియమాలకు లోబడి ప్లాట్‌ఫామ్ సేవాసంస్థ, DGIPLలకు హక్కులను అనుమతించడంలో భాగంగా మీ డేటాను ప్లాట్‌ఫామ్ సేవాసంస్థ, DGIPLలకు అందించడానికి కావాల్సిన అన్ని హక్కుల, రిలీజులు, అనుమతులను మీరు పొందారు మరియు (ii) ఈ నియమాలకు అనుగుణంగా మీ డేటాను, దానిని బదిలీ చేయడానికి, వినియోగించడానికి మీ నుండి అధికారం పొందిన SafeGold భాగస్వామి, అలాగే DGIPL ఏ చట్టాలనూ, థర్డ్ పార్టీ హక్కులనూ అతిక్రమించడం లేదని మీరు నిర్ధారిస్తున్నారు. ఈ హక్కులలో మేధో సంపత్తి హక్కులు, గోప్యతా హక్కులు, లేదా ప్రచార హక్కులతో పాటు ఇతర హక్కులు కూడా ఉంటాయి. అంతే కాక, ఇక్కడ మంజూరు చేయబడినట్టుగా డేటా వినియోగం, సేకరణ మరియు బహిర్గతం చేయడానికి కావాల్సిన హక్కులేవీ, వర్తించే గోప్యతా విధానాలకు విరుద్ధంగా ఉండకూడదు. ఈ నిబంధనలు మరియు గోప్యతా విధానంలో పేర్కొన్న రక్షణా బాధ్యతలు కాక, SafeGold భాగస్వామి మరియు/లేదా DGIPL మీ డేటాకు సంబంధించి ఎటువంటి బాధ్యతలకూ లోబడి ఉండబోవు. మీ డేటాకు, దానిని వినియోగించడం, బహిర్గతం చేయడం, నిల్వ చేయడం, లేదా బదిలీ చేయడం వల్ల కలిగే పరిణామాలకు మీరే మాత్రమే బాధ్యత వహిస్తారు.
15.4. SafeGold భాగస్వామి మరియు/లేదా DGIPL నియంత్రణలో లేని డేటా కరప్షన్ లేదా ఆలస్యం లేదా అనూహ్య సంఘటనల వల్ల కలిగే పనితీరు వైఫల్యాల వంటి ఏదైనా ఊహించని సంఘటనల ఫలితంగా మీరు అందించిన వివరాలు, సమాచారం, సాంకేతికమైన లేదా ఇతర రకాల డేటా గనుక నష్టానికి గురైతే, అందుకు SafeGold భాగస్వామి మరియు/లేదా DGIPL బాధ్యత వహించదు.
15.5. తన సేవలు అందించాల్సిన ప్రాంతాలు, పిన్‌కోడ్‌ల విషయంలో DGIPL స్వీయ విచక్షణతో నిర్ణయం తీసుకుంటుంది.
15.6. నిర్వహణ, రిపేర్లు, అప్‌గ్రేడ్‌లు, లేదా నెట్‌వర్క్ లేదా పరికరాల వైఫల్యాల కారణంగా సేవలకు అంతరాయం కలగవచ్చు. సేవలను నిరంతరం కొనసాగించేలా చూడటానికి SafeGold భాగస్వామి, DGIPLలు ప్రయత్నిస్తాయి; అయితే, అన్ని ఆన్‌లైన్ సేవలకు అప్పుడప్పుడు కొన్ని అంతరాయాలు ఎదురవుతూనే ఉంటాయి. వీటి ఫలితంగా మీకు కలిగే నష్టానికి SafeGold భాగస్వామి, DGIPLలు బాధ్యత వహించవు.
15.7. DGIPL ఏ సమయంలోనైనా నిర్దిష్ట ఫీచర్‌లు, కొన్ని ప్లాట్‌ఫామ్‌లు, పరికరాలకు సపోర్ట్‌ను, అలాగే కొన్ని లేదా సేవలన్నింటినీ నిలిపివేయవచ్చు.
16. బంగారం ఖాతా నిలిపివేత / మూసివేత
16.1. ఖాతాలో ఏదైనా మోసపూరిత లేదా అనుమానాస్పద యాక్టివిటీ ఉన్నట్లు కనిపిస్తే, DGIPL, SafeGold భాగస్వామితో కలిసి తన విచక్షణ మేరకు వినియోగదారుల బంగారం ఖాతాను నిలిపివేయవచ్చు. మీరు చట్టబద్దం కాని యాక్టివిటీల్లో భాగమయ్యారని లేదా బంగారం ఖాతాను చట్టబద్దం కాని అవసరాలకు ఉపయోగిస్తున్నారని SafeGold భాగస్వామి మరియు/లేదా DGIPL అభిప్రాయపడితే, మీ మీద అన్ని రకాల చర్యలు తీసుకునే హక్కు SafeGold భాగస్వామి మరియు/లేదా DGIPLకు ఉంది. ఇందులో ప్లాట్‌ఫామ్ సేవలను ఉపయోగించకుండా మిమ్మల్ని బ్లాక్-లిస్ట్ చేయడం లేదా బ్లాక్ చేయడం లేదా ప్లాట్‌ఫామ్ ద్వారా సేవలకు ఉన్న మీ యాక్సెస్‌ను బ్లాక్ చేయడం లేదా చట్టబద్దం కాని మీ యాక్టివిటీల గురించి సంబంధిత అధికారులకు తెలియజేయడం లాంటివి ఉంటాయి.
16.2. DGIPL, SafeGold భాగస్వామి మధ్య ఒప్పందం రద్దయినా లేదా DGIPLతో సంబంధాన్ని కొనసాగించకూడదని SafeGold భాగస్వామి నిర్ణయించుకున్నా మీ బంగారం ఖాతా మూసివేయబడుతుంది. అలాంటి సందర్భంలో, SafeGold భాగస్వామి మరియు DGIPL సమీకరించిన బంగారాన్ని తిరిగి విక్రయించవచ్చు/ సమీకరించిన బంగారాన్ని తిరిగి రీడీమ్ చేయవచ్చు లేదా మీ బంగారం ఖాతా కొనసాగింపును నిర్ధారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవచ్చు.
16.3. ప్లాట్‌ఫామ్‌లో ఏదైనా సాంకేతిక వైఫల్యం / సమస్య మరియు / లేదా వారికి సంబంధం లేని చర్యలు / లోపాల కారణంగా తలెత్తే నష్టం / హానికి SafeGold భాగస్వామి, DGIPL ఎటువంటి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించవు/జవాబుదారీగా ఉండవు.
16.4. మీ బంగారం ఖాతాలో ఏవైనా అవకతవకలు లేదా సమస్యలు ఉంటే, లావాదేవీ జరిగిన వెంటనే మీరు తెలియజేయాలి. ఏదైనా సందర్భంలో లావాదేవీ జరిగిన తేదీ నుంచి గరిష్ఠంగా 10 (పది) రోజుల వరకే గడువు ఉంటుంది. అలా చేయడంలో విఫలమైతే ఖాతాలో ఎటువంటి అవకతవకలు లేదా సమస్యలు లేవని భావించబడుతుంది. వినియోగదారు వద్ద ఉన్న రికార్డులు కాకుండా, ఈ నియమాలకు లోబడి SafeGold భాగస్వామి మరియు/లేదా DGIPL వినియోగదారు సూచనలు, ఇతర వివరాల (పేమెంట్ చేసిన లేదా అందుకున్న పేమెంట్‌లకు మాత్రమే పరిమితం కాకుండా) గురించి ఎలక్ట్రానిక్ లేదా డాక్యుమెంటరీ రూపంలో నిర్వహిస్తున్న అన్ని రికార్డులు, ఆయా సూచనలకు సంబంధించిన అంతిమ సాక్ష్యంగా ఉపయోగించబడతాయి.
17. ఫీజు
17.1. ప్లాట్‌ఫామ్, అలాగే సేవల వినియోగానికి అనుబంధమై ఉన్న అన్ని ఫీజులు, ఛార్జీలకు బాధ్యత మీదేనని మీరు అంగీకరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, చెల్లించాల్సిన ఫీజుల వివరాలు (ఆయా ఫీజులకు సంబంధించిన నియమాలు, ఆ ఫీజు మొత్తాలకు మాత్రమే పరిమితం కాకుండా), ప్లాట్‌ఫామ్‌లో ఇవ్వబడ్డాయి. ఫీజులు, ఛార్జీలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉంటుందని దయచేసి గమనించండి, ఎప్పటికప్పుడు చెల్లించాల్సిన ఫీజులు, ఛార్జీల గురించి తెలుసుకోవడానికి తరచుగా ప్లాట్‌ఫామ్‌ను సందర్శించడం మీ బాధ్యత.
17.2. ఒక్కసారి చెల్లించిన ఫీజులు, ఛార్జీలు, రీఫండ్ చేయబడవని స్పష్టం చేయడమైనది.
17.3. ప్లాట్‌ఫామ్ వినియోగంలో భాగంగా మీరు చేసే అన్ని పేమెంట్‌లు మరియు/లేదా బంగారం కొనుగోలు కోసం చేసే పేమెంట్‌లు తప్పనిసరిగా భారతీయ రూపాయలలోనే చేయాలి.
17.4. సేవలు పొందడంలో భాగంగా ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న ఏదైనా పేమెంట్ విధానాన్ని/విధానాలను ఉపయోగిస్తున్నప్పుడు,కింద పేర్కొన్న కారణాల వల్ల మీకు పరోక్షంగా గానీ లేదా ప్రత్యక్షంగా గానీ ఏదైనా నష్టం లేదా హాని జరిగితే అందుకు SafeGold భాగస్వామి, DGIPLలు ఏ బాధ్యతా వహించవు:
a. ఏవైనా లావాదేవీ/లకు అధికారం లేకపోవడం, లేదా
b. చెల్లింపు చేయడంలో మీకు, మీరు ఉపయోగించే బ్యాంకు/లకు మరియు/లేదా ఇతర సంస్థలకు మధ్య పరస్పరం అంగీకరించిన ప్రస్తుత పరిమితిని అధిగమించడం, లేదా
c. లావాదేవీ పేమెంట్ విషయంలో ఏదైనా సమస్యలు రావడం, లేదా
d. ఏదైనా ఇతర కారణం(ల) వల్ల లావాదేవీ తిరస్కరణకు గురవడం.
17.5. మీరు చెల్లించాల్సిన ఫీజులు ఏవైనా బాకీ ఉంటే, బంగారం ఖాతాను DGIPL తాత్కాలికంగా/శాశ్వతంగా నిలిపివేయవచ్చు/రద్దు చేయవచ్చు లేదా యాక్సెస్‌ను తిరస్కరించవచ్చు. DGIPL వద్ద అందుబాటులో ఉండే ఇతర హక్కులకు, పరిష్కారాలకు మాత్రమే పరిమితం కాకుండా, అటువంటి విషయాలపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు DGIPLకు ఉంది.
18. సభ్యుల అర్హత
భారత కాంట్రాక్ట్ చట్టం 1872 ద్వారా చట్టబద్దంగా కాంట్రాక్ట్‌లకు కట్టుబడి ఉండగల, భారతదేశ నివాసితులకు మాత్రమే ప్లాట్‌ఫామ్ మరియు/లేదా సేవలు అందుబాటులో ఉంటాయి. భారత కాంట్రాక్ట్ చట్టం 1872లో చెప్పినట్లుగా "కాంట్రాక్ట్ కోసం అనర్హులు"గా పరిగణించబడే వారు అంటే మైనర్‌లు, డిశ్చార్జ్ చేయబడని దివాళా తీసిన వారు, మానసిక స్థితి సరిగా లేని వ్యక్తులు మొదలైన వారు ప్లాట్‌ఫామ్‌ను లేదా సేవలను ఉపయోగించుకోవడానికి అర్హులు కాదు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఏ వ్యక్తి అయినా ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేయకూడదు మరియు ఏదైనా సేవలకు సంబంధించి ప్లాట్‌ఫారమ్‌లో లావాదేవీలు చేయకూడదు లేదా ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించకూడదు. ఎవరైనా ఒక వ్యక్తి తన ప్లాట్‌ఫామ్‌ను మరియు/లేదా ఏదైనా సేవను అర్హత లేకుండా వినియోగిస్తున్నారని DGIPL దృష్టికి వస్తే, లేదా DGIPL తనంతట తాను అలా జరుగుతోందని కనుగొంటే ప్లాట్‌ఫామ్‌కు మరియు/లేదా సేవలకు సదరు వ్యక్తి యాక్సెస్‌ను తిరస్కరించే మరియు/లేదా ఆ వ్యక్తి సభ్యత్వాన్ని రద్దు చేసే హక్కు DGIPLకు ఉంది.
19. సంబంధం లేకపోవడం
19.1. బంగారం కొనడం/విక్రయించడం గురించి నిర్ణయం తీసుకోవడంలో మీకు సరైన అవగాహన, అనుభవం ఉన్నాయని మీరు, SafeGold భాగస్వామికి, DGIPLకు హామీ ఇస్తూ అందుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బంగారం కొనుగోలు లేదా తిరిగి-విక్రయించడానికి సంబంధించి మీ నిర్ణయాలు మీరే తీసుకుంటున్నారని, అలాగే మీరు SafeGold భాగస్వామి లేదా DGIPL వారు అందించే ఏ సమాచారం మీద కూడా ఆధారపడటం లేదని, అలాగే SafeGold భాగస్వామి లేదా DGIPL వారు మీకు ఎలాంటి సిఫారసు చేయడం లేదని అంగీకరిస్తున్నారు. విక్రేత-కొనుగోలుదారు సంబంధం తప్ప మీకు, SafeGold భాగస్వామికి లేదా DGIPLకి మధ్య ఏజెంట్-ప్రిన్సిపాల్ సంబంధం, సలహాదారు-సలహాగ్రహీత సంబంధం, ఉద్యోగి-యాజమాన్య సంబంధం, ఫ్రాంచైజీ-ఫ్రాంచైజీకర్త సంబంధం, ఉమ్మడి వెంచర్ సంబంధం లేదా ఏదైనా భాగస్వామ్య సంబంధం లాంటి వాటికే పరిమితం కాకుండా మరే ఇతర సంబంధం లేదని మీరు అంగీకరిస్తున్నారు.
19.2. DGIPL, అలాగే SafeGold భాగస్వామి ఏ ఇన్వెస్ట్‌మెంట్ ఉత్పత్తినీ అందించడం లేదని / డీల్ చేయడం లేదని / ఆఫర్ చేయడం లేదని, అలాగే ఏ గ్యారంటీ / కచ్చితమైన రిటర్న్స్ ఆఫర్ చేయడం లేదని మీరు గుర్తిస్తున్నారు. అలాగే బంగారం విలువ వివిధ కారణాలు, ప్రభావాల మీద ఆధారపడి మారుతూ ఉంటుందని మీరు గుర్తిస్తున్నారు.
20. ఎలక్ట్రానిక్ ఆర్డర్ సంబంధిత రిస్కులు
వాణిజ్యపరమైన ఇంటర్నెట్ సేవా సంస్థల పనితీరు 100% ఆధారపడేలా ఉండదు, వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సేవా సంస్థలు విఫలమైతే దాని ప్రభావం ఇంటర్నెట్-ఆధారిత ఆర్డర్ ఎంట్రీ మీద పడవచ్చు. ఆర్డర్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఒక ఎలక్ట్రానిక్ మెకానికల్ సిస్టమ్ అని, కాబట్టి దానిలో వచ్చే వైఫల్యం SafeGold భాగస్వామి లేదా DGIPL పరిధిలో ఉండదని మీరు గుర్తిస్తున్నారు. కాబట్టి, నిర్లక్ష్యం, తప్పిదాలు, ఆర్డర్‌లను అమలు చేయలేకపోవడం, ట్రాన్స్‌మిషన్‌లో ఆలస్యాలు, ట్రాన్స్‌మిషన్ లేదా కమ్యూనికేషన్ పరికరాల్లో (ప్లాట్‌ఫామ్‌కు కనెక్ట్ అయ్యేందుకు ఉపయోగించిన ఏదైనా పరికరంతో సహా) వైఫల్యం కారణంగా ఆర్డర్ అమలు కాకపోవడం లేదా డెలివరీ జరగకపోవడం, లేదా పంపిణీ భాగస్వామి లేదా DGIPL నియంత్రణా పరిధిలో లేని మరేదైనా కారణాలకు SafeGold భాగస్వామి లేదా DGIPL బాధ్యత వహించదు.
21. ఫీడ్‌బ్యాక్
21.1. ప్లాట్‌ఫామ్, యూజర్ అనుభూతిని మెరుగుపరిచే ఉద్దేశంతో మీ అనుభవాన్ని, రివ్యూను పోస్ట్ చేసే అవకాశాన్ని ప్లాట్‌ఫామ్ కల్పించవచ్చు ("రివ్యూలు").
21.2. రివ్యూను రాసే వ్యక్తిగా, మీరు అప్‌లోడ్ చేసే, పోస్ట్ చేసే, ప్రచురించే, ట్రాన్స్‌మిట్ చేసే లేదా ప్లాట్‌ఫామ్‌లో మరో విధంగా అందుబాటులో ఉంచే రివ్యూలకు మీరే బాధ్యులు. మీ రివ్యూలన్నీ వర్తించే చట్టాలన్నింటికీ లోబడి ఉండేలా మీరు ప్రాతినిధ్యం వహిస్తారు. అలాగే SafeGold భాగస్వామి మరియు/లేదా DGIPL ప్లాట్‌ఫామ్‌లో ఏ రివ్యూలనూ ఆమోదించడం లేదనీ, ఏ రివ్యూలకూ బాధ్యత వహించడం లేదా జవాబుదారీగా ఉండదని మీరు గుర్తిస్తున్నారు. ప్లాట్‌ఫామ్‌లో రివ్యూలకు యాక్సెస్‌ను తీసివేసే హక్కు ప్లాట్‌ఫామ్ సేవాసంస్థకు ఉంది.
21.3. ప్రింట్, ప్రసార, ఆన్‌లైన్ మాధ్యమాలలోనే కాక SafeGold భాగస్వామి ఆధీనంలోని ఇతర వెబ్‌సైట్‌లలో మరియు ప్లాట్‌ఫామ్‌లలో ఈ రివ్యూలను వినియోగించడానికి, కాపీ చేయడానికి, పంపిణీ చేయడానికి, ప్రదర్శించడానికి, ప్రచురించడానికి, ట్రాన్స్‌మిట్ చేయడానికి, అందుబాటులో ఉంచడానికి, తిరిగి ఉపయోగించుకోవడానికి, మార్చడానికి, అడాప్ట్ చేసుకోవడానికి మరియు SafeGold భాగస్వామి మరియు/లేదా DGIPL తమ విచక్షణ ప్రకారం ఏ పద్ధతిలోనైనా అవసరానికి తగ్గట్టు వినియోగించడానికి SafeGold భాగస్వామికి మరియు/లేదా DGIPLకు ఒక నిరంతర, ఉపసంహరించుకోలేని, ప్రపంచవ్యాప్తంగా వర్తించే, పరిహారం వర్తించని, సబ్-లైసెన్సింగ్ చేయగల హక్కును మీరు మంజూరు చేస్తున్నారు.
21.4. ప్లాట్‌ఫామ్‌లో రివ్యూలను పోస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి అభ్యంతరకరమైన, పరువుప్రతిష్ఠలకు భంగం కలిగించేలా, ఎదుటి వారిని తక్కువ చేసి చూపేలా, ద్వేషపూరితమైన లేదా జాతి వివక్షను ప్రోత్సహించే భాషను ఉపయోగించడం లేని మీరు హామీ ఇస్తూ, అందుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదనంగా, ప్లాట్‌ఫామ్‌లో అశ్లీల, లైంగిక సంబంధిత కంటెంట్‌ను, మహిళల గురించి తప్పుడు ప్రాతినిధ్యం (నిషేధ) చట్టం, 1986 ప్రకారం “మహిళలను తప్పుగా చూపించే” కంటెంట్‌ను పోస్ట్ చేయకూడదు.
22. గోప్యత
గోప్యతా విధానంలో వివరించినట్లుగా, మీ వ్యక్తిగత సమాచారంతో పాటు రహస్యంగా ఉంచాల్సిన మొత్తం సమాచారాన్ని SafeGold భాగస్వామి, DGIPLలు రహస్యంగా ఉంచుతాయి. చట్టపరంగా అవసరమైతే తప్ప ఈ సమాచారాన్ని బయటికి రానివ్వరు, అలాగే ఈ రహస్యమైన సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి, తమ సొంత రహస్య సమాచారాన్ని భద్రంగా ఉంచడానికి తీసుకునే భద్రతా చర్యలు, రక్షణా చర్యలను పాటిస్తారు. నిర్దేశించిన అవసరాల కోసమే ఈ రహస్య సమాచారాన్ని తమ ఉద్యోగులు, డైరెక్టర్‌లు, ఏజెంట్లు, కాంట్రాక్టర్‌లు ఉపయోగిస్తారని SafeGold భాగస్వామి, DGIPLలు అంగీకరిస్తున్నాయి. వారి ఉద్యోగులు, డైరెక్టర్‌లు, కాంట్రాక్టర్‌లు రహస్యంగా ఉంచడానికి సంబంధించిన నియమాలకు లోబడి, ఈ నియమాలకు అనుగుణంగా ప్రవర్తించేలా, అంగీకరించేలా SafeGold భాగస్వామి, DGIPLలు అన్ని రకాలుగా కృషి చేస్తాయి.
23. కంటెంట్ మరియు మేధోసంపత్తి హక్కులు
23.1. ప్లాట్‌ఫామ్‌లో ప్రదర్శించబడే/యాక్సెస్ చేయబడే, DGIPL అందించే సేవలకు సంబంధించి కాపీరైట్‌లు, ట్రేడ్‌మార్క్‌లు, సర్వీస్ మార్క్‌లు, లోగోలు, ట్రేడ్‌నేమ్‌లు, ఇంకా మేధోసంపత్తి, ప్రొప్రయిటరీ హక్కులపై పూర్తి, యాజమాన్య హక్కు కేవలం DGIPLకు మాత్రమే ఉంది, అలాగే ఈ హక్కు భారత చట్టాల ప్రకారం రక్షించబడుతోంది.
23.2. ఈ సేవలు ఒరిజినల్ వర్క్‌లనీ, వీటిని DGIPL రూపొందించి, కంపైల్ చేసి, తయారు చేసి, రివైజ్ చేసి, ఎంపిక చేసి, అమర్చిందనీ, పెద్ద మొత్తంలో సమయాన్ని, కృషిని, ధనాన్ని వెచ్చించి రూపొందించి వర్తించే విధానాలను, మూల్యాంకన ప్రమాణాలను రూపొందించి వాటిని వర్తింపజేసిందనీ, తద్వారా DGIPL మరియు ఇతరులకు చెందిన విలువైన మేధో సంపత్తులనీ మీరు అంగీకరిస్తున్నారు. ఈ నియమాల గడువు ముగియక ముందు, గడువు ముగిసిన తర్వాత DGIPL ప్రొప్రయిటరీ హక్కులను రక్షించడానికి మీరు అంగీకరిస్తున్నారు. కాపీరైట్ నోటీసులను చేర్చకుండా ఈ ప్లాట్‌ఫామ్‌లోని భాగాలను మీరు ప్రత్యేకంగా డౌన్‌లోడ్ చేయకూడదు. ఈ నియమాల ద్వారా ఉద్దేశించిన అవసరాలకు మాత్రమే మీరు మెటీరియల్ డౌన్‌లోడ్ చేయవచ్చు.
23.3. ఏదైనా ఉల్లంఘన జరిగితే, ఆ దేశంలో వర్తించే చట్టాల ప్రకారం అందుబాటులో ఉన్న పరిష్కారాల నిమిత్తం మీపై తగిన ఫోరంలో తగిన న్యాయ ప్రొసీడింగ్‌లకు దారితీయవచ్చు.
24. థర్డ్-పార్టీల వెబ్‌సైట్‌లు/అప్లికేషన్‌లకు/నుండి లింక్‌లు
థర్డ్ పార్టీల వెబ్‌సైట్‌లతో ఇంటరాక్ట్ అవడం కోసం లింక్‌లు, ఇంటరాక్టివ్ ఫంక్షనాలిటీ ప్లాట్‌ఫామ్‌లో ఉండవచ్చు. అలాంటి వెబ్‌సైట్‌ల పనితీరు, చర్యలు, కార్యకలాపాలు, గోప్యతా సెట్టింగ్‌లు, గోప్యతా విధానాలు, నియమాలు, లేదా కంటెంట్‌పై SafeGold భాగస్వామికి గానీ, లేదా DGIPLకి గానీ ఏ బాధ్యత లేదా జవాబుదారీతనం ఉండదు. ఆయా వెబ్‌సైట్‌లతో కమ్యూనికేట్ చేయడం లేదా అలాంటి వెబ్‌సైట్‌లను సందర్శించడంలో భాగంగా షేర్ చేసుకునే సదుపాయాలను ఎనేబుల్ చేయడానికి ముందు, అటువంటి ప్రతి థర్డ్-పార్టీ వెబ్‌సైట్‌కు చెందిన నియమ, నిబంధనలు, గోప్యతా విధానాలు, సెట్టింగ్‌లు, సమాచార-షేరింగ్ సదుపాయాల గురించి మీరు రివ్యూ చేసి, అర్థం చేసుకోవాలని DGIPL బలంగా సిఫార్సు చేస్తోంది.
25. బాధ్యత నుండి విముక్తి చేయడం
ఇక్కడ తెలిపిన కారణాల వల్ల SafeGold భాగస్వామి మరియు/లేదా DGIPL మరియు/లేదా వారి ఉద్యోగులు, ఏజెంట్‌లు, వర్కర్లు లేదా ప్రతినిధులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎప్పుడైనా ఏదైనా బాధ, నష్టం, హాని కలిగించే చర్యలు, క్లెయిమ్‌లు, డిమాండ్‌లు, ప్రొసీడింగ్‌లు, నష్టాలు, ప్రమాదాలు, వ్యక్తిగత హాని, ధరలు, ఛార్జీలు, ఖర్చుల ("నష్టాలు") నుండి SafeGold భాగస్వామిని, DGIPLను జవాబుదారీ బాధ్యత నుండి విముక్తిని మంజూరు చేస్తున్నారని, ఈ మేరకు వినియోగదారు అంగీకరిస్తున్నారు: (i) ప్లాట్‌ఫామ్ వినియోగం మరియు/లేదా ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేయడానికి వినియోగదారు ఉపయోగించే ఏదైనా పరికరం; (ii) వినియోగదారు సూచనల మేరకు SafeGold భాగస్వామి మరియు/లేదా DGIPL వారు సహృదయంతో చర్య తీసుకోవడం లేదా చర్య తీసుకోవడానికి నిరాకరించడం లేదా చర్య తీసుకోవడం నుండి మినహాయింపు ఇవ్వడం కారణంగా, అలాగే వినియోగదారు నిర్లక్ష్యం, తప్పిదం లేదా తప్పుడు ప్రవర్తన వల్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం కావడం; (iii) బంగారం ఖాతాకు సంబంధించి నియమాల ఉల్లంఘన లేదా వాటిని పాటించకపోవడం; మరియు/లేదా (iv) వినియోగదారు చేసే ఏదైనా లావాదేవీలో మోసం జరగడం లేదా నిజాయతీ లేకపోవడం.
26. వారంటీల నిరాకరణ
26.1. ప్లాట్‌ఫామ్ ద్వారా మీకు అందించబడే సమాచారం, కంటెంట్, మెటీరియల్స్, ఇంకా చేర్చబడిన ఇతర సేవలు (అన్నీ కలిపి, "కంటెంట్‌లు") DGIPL, SafeGold భాగస్వామి ద్వారా ఏ ప్రాతినిధ్యాలు లేదా వారంటీలు లేకుండా "ఉన్నవి ఉన్నట్లుగా," "అందుబాటును బట్టి" అనే ప్రాతిపదికన అందజేయబడతాయి. ప్లాట్‌ఫామ్ ఆపరేషన్ గురించి, కంటెంట్ కచ్చితత్వం లేదా సంపూర్ణత్వం గురించి, అలాగే సమాచార కచ్చితత్వం గురించి DGIPL మరియు/లేదా SafeGold భాగస్వామి ఏ ప్రాతినిధ్యాలను లేదా వారంటీలను ప్రకటించడం లేదు. ఏదైనా కంటెంట్, మెటీరియల్స్, డాక్యుమెంట్ లేదా సమాచారాన్ని డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీ కంప్యూటర్ సిస్టమ్‌కు హాని కలిగినా లేదా డేటా నష్టం జరిగినా లేదా ప్లాట్‌ఫామ్ వినియోగం వల్ల మరేదైనా నష్టాలు తలెత్తినా అందుకు DGIPL మరియు/లేదా SafeGold భాగస్వామి బాధ్యత వహించవు. మీ స్వంత రిస్కుకు లోబడి మీరు ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నట్లు మీరు ప్రత్యేకంగా అంగీకరిస్తున్నారు. ప్లాట్‌ఫామ్ వినియోగం వల్ల లేదా సేవలు లేదా కంటెంట్‌లు ముఖ్యంగా ప్రత్యక్ష, పరోక్ష, పరిణామాత్మక, సందర్భానుసార నష్టాలకు మాత్రమే పరిమితం కాకుండా, లిఖితపూర్వకంగా తెలియజేస్తే మినహా కలిగే ఏ నష్టానికి కూడా DGIPL మరియు/లేదా SafeGold భాగస్వామి బాధ్యత వహించదు. చట్టం అనుమతించిన పరిధి మేరకు, ప్లాట్‌ఫామ్ (లేదా దానిలోని ఏదైనా భాగం)కు మరియు దాని కంటెంట్‌లకు సంబంధించి వ్యక్తీకరణగా ఉన్న లేదా సూచనాత్మకంగా ఉన్న ఏదైనా మరియు అన్ని ప్రాతినిధ్యాలను, వారంటీలను DGIPL మరియు/లేదా SafeGold భాగస్వామి నిరాకరిస్తోంది. ఈ నిరాకరణ కేవలం టైటిల్ వారంటీలు, మర్చంటబిలిటీ, అలాగే నిర్దిష్ట అవసరం లేదా వినియోగ ఫిట్‌నెస్‌లకు మాత్రమే పరిమితం కాదు.
27. బాధ్యత పరిమితి
లాభం లేదా ఆదాయానికి ఏదైనా ప్రత్యేక, పర్యవసాన, సంఘటనాత్మక, ఎగ్జంప్లరీ లేదా దండనాత్మక నష్టాలు తలెత్తితే, అందుకు DGIPL మరియు/లేదా SafeGold భాగస్వామి (దాని డైరెక్టర్‌లు, ఉద్యోగులు, ఏజెంట్‌లు లేదా భాగస్వాములు, అలాగే వీరు మాత్రమే కాదు) మీకు జవాబుదారీగా ఉండవని మీరు అంగీకరిస్తున్నారు. ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేయడంలో మీకు తలెత్తిన అసమర్థత వల్ల, లేదా ప్లాట్‌ఫామ్ సేవలను యాక్సెస్ చేయడంలో మీ ఇబ్బంది వల్ల, ఏదైనా థర్డ్ పార్టీ ద్వారా ప్లాట్‌ఫామ్ నుండి లేదా ప్లాట్‌ఫామ్‌కు చేరే ఏవైనా బగ్స్, వైరస్‌లు, ట్రోజన్ హార్స్‌ల వల్ల, మీ డేటా నష్టం వల్ల, మీ డేటాకు సంబంధించిన క్లెయిమ్ వల్ల, లేదా సేవల నుండి మీ కంటెంట్ వల్ల మరియు/లేదా మీరు మీ బంగారం ఖాతా సమాచారాన్ని సురక్షితంగా, గోప్యంగా ఉంచడంలో విఫలమవడం వల్ల, అలాగే వాటికి సంబంధించిన కారణాల వల్ల జరిగే నష్టాలకు DGIPL మరియు/లేదా SafeGold భాగస్వామి బాధ్యత వహించవు. బంగారం కొనుగోలు కోసం పేమెంట్‌లను స్వీకరించడానికి / సేకరించడానికి గాను SafeGold భాగస్వామి నియమించిన / నామినేట్ చేసిన వ్యక్తి ఎవరైనా గానీ, లేదా మీరు గానీ, ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేయడానికి ఉపయోగించిన పరికర ఓనర్‌తో పాటు, వారికి మాత్రమే పరిమితం కాకుండా, ఎవరైనా ఇతర మధ్యవర్తులు SafeGold భాగస్వామి ద్వారా చేయబడే అన్ని చర్యలు లేదా లోపాలకు DGIPL ఎటువంటి బాధ్యతా వహించదని మీరు అదనంగా అంగీకరిస్తున్నారు. అదేవిధంగా, ఏదైనా థర్డ్ పార్టీ, DGIPL లేదా ఇతర మధ్యవర్తుల చర్యలకు SafeGold భాగస్వామి ఏ రకంగానూ బాధ్యత వహించదు.
28. నియమాల సవరణలు, అంగీకారం
28.1. ఈ నియమాలలో కొంత భాగాన్ని ఎప్పుడైనా మార్చే, సవరించే, జోడించే లేదా తొలగించే హక్కు DGIPLకు ఉంది. ఆ మార్పులు ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేయబడతాయి. ఏ వైరుధ్యం తలెత్తకుండా ఉండటానికి వీలుగా, ఈ నియమాలను ఎప్పటికప్పుడు రివ్యూ చేయాల్సిన బాధ్యత వినియోగదారుపై ఉంటుంది, ప్లాట్‌ఫామ్ వినియోగాన్ని కొనసాగించడం ద్వారా పోస్ట్ చేసిన సవరణలు, సవరించిన నియమాలను అంగీకరించినట్లు పరిగణించబడుతుంది.
28.2. ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం, యాక్సెస్ చేయడం, బ్రౌజ్ చేయడం ద్వారా ఈ నియమాలలోని అన్ని నియమ, నిబంధనలు మీరు అంగీకరిస్తున్నట్లు పరిగణించబడుతుంది. కొనసాగడానికి ముందు మీరు ఈ నియమాలను జాగ్రత్తగా చదవాలని సలహా ఇస్తున్నాం. ఈ నియమాలను పరోక్షంగా లేదా నేరుగా అంగీకరించడం ద్వారా, మీరు అన్ని విధానాలను అంగీకరిస్తున్నారని అర్థం. వీటిలో ఎప్పటికప్పుడు సవరించబడే SafeGold భాగస్వామి, DGIPLలకు చెందిన గోప్యతా విధానాలకు (“గోప్యతా విధానం”) మాత్రమే పరిమితం కాకుండా ఇతరాలు కూడా ఉంటాయి. SafeGold భాగస్వామి గోప్యతా విధానాన్ని మీరు ప్లాట్‌ఫామ్‌లోను, DGIPL గోప్యతా విధానాన్ని www.safegold.com వద్ద చూసి, చదవవచ్చు.
28.3. మీరు నియమాలను అంగీకరించకపోయినా లేదా మీరు నియమాలకు కట్టుబడి లేకపోయినా మీరు ప్లాట్‌ఫామ్‌ను గానీ లేదా సేవలను గానీ ఉపయోగించకూడదు. ప్లాట్‌ఫామ్‌కు మీ యాక్సెస్, వినియోగం లేదా ప్లాట్‌ఫామ్ ఉపయోగించి ఏవైనా సేవలు పొందాలంటే, ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించేటప్పుడు వర్తించే అన్ని చట్టాలు, నిబంధనలను అంగీకరిస్తున్నారు. బంగారం ఖాతాను మీరు చట్టవ్యతిరేక అవసరాల కోసం ఉపయోగిస్తున్నట్లు DGIPL అభిప్రాయపడితే, అందుబాటులో ఉన్న చర్యలను తీసుకునే హక్కు DGIPLకు ఉంది. వీటిలో ప్లాట్‌ఫామ్ ద్వారా సేవలను ఉపయోగించడం నుండి మిమ్మల్ని బ్లాక్-లిస్ట్ లేదా బ్లాక్ చేయడం, లేదా మీ చట్టవ్యతిరేక కార్యకలాపాల గురించి సంబంధిత అధికారులకు తెలియజేయడం లాంటివి ఉంటాయి.