వినియోగ నియమాలు - బంగారం

సమాచార సాంకేతికత చట్టం, 2000, ఎప్పటికప్పుడు దానికి చేసిన సంస్కరణలు, వివిధ  నియమాలకు లోబడి ఎలక్ట్రానిక్ రికార్డులకు సంబంధించిన అంశాలు, వర్తించే నియమాలకు తదనుగుణంగా, సమాచార సాంకేతిక చట్టం, 2000 సంస్కరించిన చట్టానికి తగినట్లుగా ఈ డాక్యుమెంట్ ఒక ఎలక్ట్రానిక్ రికార్డుగా పరిగణించబడుతుంది. ఇది కంప్యూటర్ ద్వారా జెనరేట్ చేయబడిన ఎలక్ట్రానిక్ రికార్డ్ కాబట్టి దీనికి భౌతిక, డిజిటల్ సంతకాలు ఏవీ అవసరం లేదు.
ఈ వినియోగ నియమాల (“నియమాలు”)లో, “PhonePe”/ “మేము”/ “మాకు”/ “మా” అని సంబోధిస్తే అది కంపెనీల చట్టం, 1956 కింద ఆఫీస్-2, 5వ అంతస్తు, A వింగ్, A బ్లాక్, సలార్‌పురియా సాఫ్ట్‌జోన్, బెల్లందూర్ విలేజ్, వర్తూర్ హొబ్లి, ఔటర్ రింగ్ రోడ్, బెల్లందూర్, బెంగళూరు సౌత్, కర్ణాటక, ఇండియా- 560103లో కార్యాలయంతో రిజిస్టర్ అయిన PhonePe ప్రైవేట్ లిమిటెడ్ అని అర్థం. పేమెంట్ మరియు సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007 ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ‘పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్’గా ప్రీపెయిడ్ అవసరాల కోసం PhonePe అధీకృతం చేయబడింది. ఏకీకృత పేమెంట్ ఇంటర్‌ఫేస్ (“UPI”), ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, వాలెట్, ఇతర ఆర్థిక సేవల ద్వారా సాంకేతిక చెల్లింపుల బిజినెస్‌లో PhonePe పనిచేస్తోంది. 

PhonePe వారి సేవను ఉపయోగించడానికి కొనసాగుతున్నారంటే, మీరు ఈ నియమాలను అలాగే https://www.phonepe.com/terms-conditions/ వద్ద ఉన్న PhonePe నియమ, నిబంధనలు (“PhonePe T&Cs”), https://www.phonepe.com/privacy-policy/ వద్ద ఉన్న గోప్యతా పాలసీ, ఇంకా PhonePe వారు ఎప్పటికప్పుడు జారీ చేసే వర్తించే నియమాలు, పాలసీలు, మార్గదర్శకాలను అంగీకరిస్తున్నారని అర్థం. ఏదైనా సందర్భంలో “కస్టమర్”/ “వినియోగదారు”/ “మీరు”/ “మీ” అని వస్తే, మా పేమెంట్ టెక్నాలజీ సొల్యూషన్‌లను బంగారం కొనడానికి పేమెంట్ చేసేందుకు, బంగారం డెలివరీ తీసుకోవడం కోసం అభ్యర్థన చేయడానికి, గోల్డ్ పార్ట్‌నర్‌కు తిరిగి బంగారం అమ్మి, దానికి తగిన సొమ్ము అందుకోవడానికి ఉపయోగిస్తున్న మీలాంటి వినియోగదారు అని అర్థం. PhonePeను డౌన్‌లోడ్ చేయడం, యాక్సెస్ చేయడం లేదా వాడటం ద్వారా, మీరు కింది నియమాలకు కట్టుబడి ఉండి, వాటిని అనుసరించడానికి అంగీకరిస్తున్నారని అర్థం:

1. సందర్భాన్ని బట్టి ఏదైనా విరుద్ధమైన అర్థం ఉంటే తప్ప, ఈ కింద తెలిపిన పదాలు, పదబంధాలకు, ఇచ్చిన అర్థాలు కింది విధంగా ఉంటాయి:

1.1 “గోల్డ్ పార్ట్‌నర్” అంటే PhonePe వేదికలోని సాంకేతిక ఇంటర్‌ఫేస్ ద్వారా వినియోగదారులకు/వినియోగదారుల నుండి బంగారాన్ని అమ్మే/తిరిగి కొని డెలివరీ చేసే సంస్థ అని అర్థం. అలాగే ఈ సంస్థ, మా పేమెంట్ టెక్నాలజీ సొల్యూషన్‌ల ద్వారా అలాంటి లావాదేవీలకు పేమెంట్‌లను ప్రాసెసింగ్/ఫెసిలిటేట్ చేస్తుంది. PhonePeకు దిగువ తెలిపిన రెండు (2) గోల్డ్ పార్ట్‌నర్లు భాగస్వాములుగా ఉన్నాయి:

a) Digital Gold India Private Limited అనే కంపెనీ 2013 కంపెనీల చట్టం ప్రకారం ఏర్పాటైంది. దీని రిజిస్టర్ చేయబడిన ఆఫీస్ 1902 టవర్ B, పెనిన్‌సులా బిజినెస్ పార్క్, గణపత్‌రావ్ కదమ్ మార్గ్, లోయర్ పరేల్, ముంబై, మహారాష్ట్ర 400013 చిరునామా వద్ద ఉంది. “SafeGold” అనే బ్రాండ్ పేరును కలిగి ఉంది; మరియు

b) MMTC-PAMP India Private Limited అనే కంపెనీ 2013 కంపెనీల చట్టం ప్రకారం ఏర్పాటైంది. దీని రిజిస్టర్ చేయబడిన ఆఫీస్ C-27, 3వ అంతస్తు, ఖుతుబ్ ఇనిస్టిట్యూషనల్ ఏరియా, న్యూ ఢిల్లీ - 110016 చిరునామా వద్ద ఉంది. ఈ కంపెనీ “MMTC-PAMP” బ్రాండ్ పేరును కలిగి ఉంది.

1.2 “PhonePe వేదిక” - అంటే PhonePe యాజమాన్యంలో ఉన్న/నడుస్తున్న ఏదైనా వేదిక (ఏకీకృత పేమెంట్ ఇంటర్ ఫేస్ (“UPI”), ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, వాలెట్ మరియు ఇతర ఫైనాన్స్ సేవల ద్వారా పేమెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ అందించడంలో పాలు పంచుకుంటుంది.) అని అర్థం. ఇది తమ వినియోగదారులు గోల్డ్ పార్ట్‌నర్లతో సహా, బిజినెస్ భాగస్వాములకు సేవలు అందించడం కోసం వెబ్‌సైట్‌లు, మొబైల్ అప్లికేషన్‌లు, పరికరాలు, URLలు/లింక్‌లు, నోటిఫికేషన్‌లు, చాట్‌బాట్‌లు లేదా PhonePe సంస్థలు ఉపయోగించే ఏదైనా కమ్యూనికేషన్ మాధ్యమానికి మాత్రమే పరిమితం కాదు. 

1.3 “ప్రోడక్ట్” అంటే వినియోగదారులకు డిజిటల్ మరియు భౌతిక రూపాలలో గోల్డ్ పార్ట్‌నర్ ఆఫర్ చేస్తోన్న బంగారం అని అర్థం.

2. PhonePe T&Cలలో నిర్దేశించిన అర్హతను మీరు కలిగి ఉన్నారని, మీరు PhonePe వేదికలో రిజిస్టర్ చేసుకున్న ఒక వినియోగదారు అని నిర్ధారిస్తున్నారు. 

3. పేమెంట్‌లను ప్రాసెసింగ్ చేయడం వరకే మా పాత్ర ఉంటుందని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. మేము ఒక మార్కెట్‌ప్లేస్ కాదు, అలాగే వినియోగదారులకు లేదా గోల్డ్ పార్ట్‌నర్లకు మేము అటువంటి సేవలను అందించము. మేము ప్రోడక్ట్ విక్రేతలము కాదు, అలాగే ఆర్డర్ సరిగ్గా నెరవేరేలా చేసే బాధ్యతను కూడా వహించము. 

4. గోల్డ్ పార్ట్‌నర్ల సేవలు, ప్రోడక్ట్‌ల ధరలను నిర్ణయించడం, సలహా ఇవ్వడం లేదా నియంత్రించడం లాంటివి ఏ రకంగానూ మేము చేయమని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు.

5. లావాదేవీల ప్రాసెసింగ్‌‌ ప్రయోజనాల కోసం, మీరు క్రమంగా అందిస్తోన్న సమాచారాన్ని యాక్సెస్ చేయడం, తీసుకోవడం, షేర్ చేయడం, స్టోర్ చేయడం, ఉపయోగించడం వంటివి చేయడానికి మీరు మాకు అధికారాన్ని ఇస్తున్నారు. మీ సమాచారం ఖచ్చితత్వంతో ఉండటం చాలా ముఖ్యం, అలాగే మీరు మాకు అందించే సమాచార ఖచ్చితత్వానికి పూర్తి బాధ్యత మీదేనని మీరు అర్థం చేసుకున్నారు. మీరు మాకు అందించిన సమాచారంలో ఏదైనా లోపం ఉందని మీరు భావిస్తే, వెంటనే మీరు మాకు ఆ విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేయాలి, అలాగే వెనువెంటనే సరైన/అప్‌డేట్‌ చేసిన సమాచారాన్ని మాకు అందించాలి. మీరు అందించిన డేటాను/సమాచారాన్ని మేము సమీక్షించవచ్చని, దానిపై రిస్క్ మేనేజ్‌మెంట్‌ చేయడంతో పాటు ఇతర అవసరమైన తగు చర్యలు(డ్యు డిలిజెన్స్‌) తీసుకోవచ్చని మీరు అంగీకరిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. మీకు సంబంధించి, బహిరంగంగా అందుబాటులో ఉన్న లేదా మా వ్యాపార భాగస్వాములు లేదా సేవా ప్రదాతల ద్వారా అందుబాటులో ఉన్న ఇతర వనరుల నుండి కూడా మేము డేటాను డ్యు డిలిజెన్స్‌ మరియు రిస్క్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా పొందవచ్చు. తప్పు సమాచారం సమర్పించడం వల్ల మీకు ఏదైనా నష్టం గానీ, డ్యామేజీ గానీ కలిగితే దానికి మేము బాధ్యత వహించము. 

6. బంగారం ధరలను కోట్ చేయడం, ప్రోడక్ట్‌ను మీకు అమ్మడం/డెలివరీ చేయడం, ఆర్డర్‌ను ఫుల్‌ఫిల్‌ చేయడం, మీరు కొనుగోలు చేసిన ప్రోడక్ట్‌ను భౌతికంగా/డిజిటల్ రూపంలో నిల్వ చేయడం మరియు మీ నుండి ప్రోడక్ట్‌ను తిరిగి కొనుగోలు చేయడం వంటి వాటికి సంబంధిత గోల్డ్‌ పార్టనర్‌ మాత్రమే బాధ్యత వహిస్తారని మీరు అంగీకరిస్తున్నారు, అర్థం చేసుకున్నారు. గోల్డ్ పార్టనర్, ప్రోడక్ట్‌ యొక్క అమ్మకందారుడు, మరియు ప్రోడక్ట్‌ యొక్క డెలివరీకి మరియు గోల్డ్ పార్టనర్ అందించే ప్రోడక్ట్‌ మరియు/లేదా సేవల్లో ఏదైనా లోపం తలెత్తితే దానికి పూర్తిగా ఆ గోల్డ్‌ పార్టనరే బాధ్యత వహిస్తారు. గోల్డ్ పార్టనర్ అందించే ప్రోడక్ట్‌ మరియు/లేదా సేవల్లో ఏదైనా లోపానికి PhonePe ఏ రకంగానూ బాధ్యత వహించదు. ప్రోడక్ట్‌కు సంబంధించి ఏదైనా నాణ్యత/పరిమాణానికి సంబంధించిన సమస్యలకు లేదా గోల్డ్ పార్టనర్ ద్వారా వచ్చే ఉత్పత్తి డెలివరీకి/డెలివరీలో ఆలస్యానికి PhonePe బాధ్యత వహించాలని మీరు కోరకూడదు. 

7. అమ్మకం ద్వారా అందించే ఉత్పత్తి యొక్క నాణ్యత (స్వచ్ఛత మరియు అన్ని సంబంధిత అంశాలు), బరువు, కొలత, బంగారం కంటెంట్ లేదా డెలివరీ చేయాల్సిన ఉత్పత్తి యొక్క చక్కదనం మరియు మీరు పేర్కొన్న చిరునామాకు డెలివరీ చేసే సమయంలో ఉత్పత్తి స్వభావం మరియు ఖచ్చితత్వానికి గోల్డ్ పార్టనర్ మాత్రమే పూర్తిగా బాధ్యత వహిస్తారని మీరు అంగీకరిస్తున్నారు, అర్థం చేసుకున్నారు. 

8. గోల్డ్ పార్టనర్ అందించే ప్రోడక్టులు మరియు సేవలు, వాటి పరిస్థితి, ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం దాని ఫిట్‌నెస్ మొదలైన వాటికి సంబంధించి PhonePe ఎటువంటి ప్రాతినిధ్యాలు లేదా వారెంటీలు (ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ) ఇవ్వదు. 

9. ఇన్వాయిస్(లు), వారంటీ కార్డ్, అమ్మకం అనంతరం అందించే సపోర్ట్, మొదలైన వాటికి సంబంధించి సంబంధిత గోల్డ్ పార్టనర్ మాత్రమే పూర్తిగా బాధ్యత వహిస్తారని మీరు అంగీకరిస్తున్నారు మరియు గుర్తిస్తున్నారు. ఇందుకు సంబంధించి PhonePe ఏ విధంగానూ బాధ్యత వహించదు. గోల్డ్ పార్టనర్ యొక్క ప్రొడక్ట్‌లు/సేవలకు సంబంధించి అన్ని వివాదాలను/ఫిర్యాదులను (డెలివరీ, ఫుల్‌ఫిల్‌ చేయకపోవడం, వస్తువుల నాణ్యత, సేవల్లో లోపం, అమ్మకం అనంతరం అందించే సపోర్ట్, మొదలైన వాటికి సంబంధించినవి) మీరే గోల్డ్ పార్టనర్ దృష్టికి తీసుకెళ్లాలి. అయితే, బంగారం అమ్మకం/కొనుగోలు కోసం చెల్లింపును ప్రాసెస్ చేయడంలో ఏదైనా లోపాన్ని/లోపం వల్ల తలెత్తే సమస్యలను, ఫిర్యాదులను పరిష్కరించడంలో మేము సహకరిస్తాము. 

10. వివాదం లేదా ఫిర్యాదు కారణంగా తలెత్తే అన్ని క్లెయిమ్‌లు, డిమాండ్లు మరియు డ్యామేజ్‌ల విషయంలో (వాస్తవంగా మరియు పర్యవసానంగా) అన్ని రకాలుగా PhonePe, దాని అనుబంధ సంస్థలు, గ్రూప్‌ కంపెనీలు, వాటి డైరెక్టర్లు, ఏజెంట్లు, అధికారులు, ఉద్యోగులు మరియు కాంట్రాక్టర్లను బాధ్యత నుండి విముక్తి చేయడానికి మీరు అంగీకరిస్తున్నారు. గోల్డ్ పార్ట్‌నర్‌తో ఏదైనా లావాదేవీకి సంబంధించిన లేదా ఏదైనా సంబంధిత వ్యాజ్యం లేదా వివాదంలోకి PhonePeను తీసుకు రావడం చేయబోమని మీరు అంగీకరిస్తున్నారు.

11. PhonePe వేదికలోని గోల్డ్ పార్ట్‌నర్‌తో మీ లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని మేము యాక్సెస్ చేయవచ్చు, నిల్వ చేయవచ్చు, ప్రదర్శించవచ్చు మరియు ఉపయోగించవచ్చని మీరు అంగీకరిస్తున్నారు, అర్థం చేసుకున్నారు. గోల్డ్ పార్టనర్ అందించడానికి అవకాశం ఉన్న మరియు/లేదా అప్‌డేట్‌ చేసిన సమాచారాన్ని మేము ఎప్పటికప్పుడు PhonePe వేదికపై ప్రదర్శించే అవకాశం ఉందని మీరు అంగీకరిస్తున్నారు. అటువంటి సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా ప్రామాణికతకు మేము లయబిలిటీ తీసుకోము, బాధ్యత వహించము.

12. SafeGold మరియు/లేదా MMTC-PAMP పేర్కొన్న నియమాలు మరియు షరతులు (ఒకవేళ అవసరం అయితే) గోల్డ్ పార్ట్‌నర్‌తో మీ సంబంధాన్ని నియంత్రిస్తాయని మీరు అంగీకరిస్తున్నారు, అర్థం చేసుకున్నారు. గోల్డ్ పార్ట్‌నర్‌తో ఏదైనా లావాదేవీని ప్రారంభించడానికి ముందు అటువంటి వర్తించే నియమాలు మరియు షరతులను జాగ్రత్తగా చదువుతారని అంగీకరిస్తున్నారు. అయితే, SafeGold మరియు/లేదా MMTC-PAMP నియమాలకు మరియు గోల్డ్ పార్టనర్ పేర్కొన్న నియమాలు మరియు షరతుల మధ్య ఏదైనా వివాదం ఏర్పడినప్పుడు, రెండు పత్రాల మధ్య విభేదం పరిధి మేరకు మాత్రమే ఈ నియమాలు అమలవుతాయి.

13.ఎప్పటికప్పుడు, పూర్తిగా మా స్వీయ విచక్షణ మేరకు, మా గోల్డ్ పార్ట్‌నర్‌లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం PhonePe వేదిక ద్వారా పేమెంట్ చేయడంపై, పేమెంట్ చేసిన ఉత్పత్తిని పోగు చేసుకోవడంపై, లేదా ఆ ఉత్పత్తిని బదిలీ చేయడంపై మీకు గరిష్ఠ వ్యక్తిగత/క్యుములేటివ్‌ పరిమితులను మేము విధించవచ్చు. అంతే కాకుండా, అటువంటి పరిమితులను అధిగమించిన ఏ ఆర్డర్‌ను అయినా తిరస్కరించడానికి, నిరోధించడానికి లేదా రద్దు చేయడానికి హక్కు మాకు మాత్రమే ఉంటుంది. ఇటువంటి పరిమితులు PhonePe యొక్క అంతర్గత రిస్క్‌ మదింపునకు లోబడి ఉంటాయి. అలాంటి పేమెంట్ పరిమితులను మేము మార్చవచ్చు/సవరించవచ్చు. అంతే కాక కాంట్రాక్టును రద్దు చేసుకోవడానికి అవకాశం ఇచ్చే విధంగా తగిన కూలింగ్‌ పీరియడ్‌ను వర్తింపజేయవచ్చు. పైన పేర్కొన్న చర్యను అమలు చేసే ముందు మేము మీకు తెలియజేయవచ్చు లేదా తెలియజేయకపోవచ్చు అని మీరు అర్థం చేసుకుంటున్నారు. 

14. ప్రతి పేమెంట్ ఇన్‌స్ట్రక్షన్‌ కోసం ఖచ్చితమైన సమాచారాన్ని అందించడానికి మీరు మాత్రమే బాధ్యత వహించాలి. మీ సూచనల ప్రకారం పేమెంట్‌ను ప్రారంభించిన తర్వాత మేము దానిని రివర్స్ చేయలేమని మీరు అంగీకరిస్తున్నారు మరియు అర్థం చేసుకుంటున్నారు. మీ పేమెంట్ ఇన్‌స్ట్రక్షన్‌లకు అనుగుణంగా మా చేత ప్రాసెస్ చేయబడిన లావాదేవీల ఫలితంగా మీకు ఏదైనా నష్టం జరిగితే దానికి మేము బాధ్యత వహించము.

15. మీరు తప్పు మొత్తానికి చెల్లింపును పొరపాటుగా ప్రాసెస్ చేసిన సందర్భంలో (ఉదాహరణకు మీ  వైపు నుంచి టైపింగ్‌లో తప్పు నొక్కడం), మీకు ఉన్న ఏకైక సమస్య పరిష్కార మార్గం గోల్డ్ పార్ట్‌నర్‌ను సంప్రదించడం మాత్రమే. పొరపాటున తప్పుగా చెల్లించిన మొత్తాన్ని PhonePe మీకు తిరిగి చెల్లించదు, మీరు తప్పుగా చేసిన చెల్లింపును రివర్స్ చేయదు.

16. ఆన్‌లైన్ లావాదేవీల వల్ల ఉత్పన్నమయ్యే అన్ని నష్టాలను మీరు మాత్రమే భరిస్తారని మీరు అంగీకరిస్తున్నారు. PhonePe వేదిక నిరంతరాయంగా పని చేస్తుందని, లోపం లేకుండా ఉంటుందని లేదా వైరస్‌లు లేదా ఇతర హానికరమైన కంపోనెంట్లు లేకుండా ఉంటుందని మేము హామీ ఇవ్వలేము. PhonePe వేదికలో అందుబాటులో ఉన్న మొత్తం డేటా, “ఉన్నది ఉన్నట్టుగా”, “అందుబాటులో ఉన్నట్టుగా” మరియు “అన్ని లోపాలతో” అనే ప్రాతిపదికన, స్పష్టమైన లేదా అంతర్లీనంగా సూచించిన వారెంటీలు లేదా గ్యారంటీలు ఏవీ వర్తించకుండా అందించడమైనది. వర్తించే చట్టం ప్రకారం పూర్తి స్థాయిలో అనుమతించదగిన మేరకు, చట్టబద్ధమైన, స్పష్టంగా చెప్పిన లేదా అంతర్లీనంగా సూచించిన అన్ని వారెంటీలను లేదా హామీలను PhonePe నిరాకరిస్తుంది. వీటిలో వర్తకత్వం, ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ఫిట్‌నెస్, మరియు యాజమాన్య హక్కులను ఉల్లంఘించకపోవడం వంటివి కూడా ఉంటాయి. PhonePe వేదికలో గోల్డ్ పార్టనర్ అందించిన మొత్తం సమాచారం యొక్క ఖచ్చితత్వం, పరిపూర్ణత మరియు ఉపయోగాన్ని అంచనా వేసుకోవాల్సిన బాధ్యత మీదే.

17. షెడ్యూల్ చేసిన తేదీ వారాంతంలో వచ్చినా లేదా బ్యాంక్ శెలవు రోజు అయినా, మీ నెలవారీ SIP కోసం అవసరమైన మొత్తం మీ ఖాతానుండి ఆ తేదీన తీసివేయబడుతుంది. షెడ్యూల్ చేసిన SIP తేదీన దానిని పూర్తి చేసేందుకు ప్రయత్నించినప్పుడు ఏవైనా సాంకేతిక సమస్యల కారణంగా మీ పేమెంట్ ఆలస్యమైతే, ఆ సమస్య పరిష్కారమయ్యే దాన్ని బట్టి, అదే నెలలో తర్వాతి రోజున మాకు వీలైనంతగా కృషి చేసి, మీ పేమెంట్ డెబిట్ చేసేందుకు ప్రయత్నిస్తాము. దానికి తగ్గట్టు వాస్తవంగా డెబిట్ చేసిన తరుణంలో బంగారం వాస్తవ ధర పైన పేర్కొన్న బంగారం SIP కొనుగోలుపై దానికి తగిన గ్రాముల బంగారాన్ని కేటాయించడానికి వర్తింపజేయబడుతుంది.

18. బ్యాంక్ డౌన్ టైమ్ లేదా మన సహేతుకమైన నియంత్రణలో లేని మరేదైనా ఇతర సాంకేతిక సమస్య కారణంగా బంగారం SIP లావాదేవీని మేము ప్రాసెస్ చేయలేకుంటే, బంగారం కొనుగోలుకోసం ఏదైనా PhonePe బాధ్యత వహించదు.

19.  బంగారం SIP UPI ఆటోపే మేండేట్ రిజిస్టర్ అయిన మీ బ్యాంక్ ఖాతాలో మీ బంగారం SIP గడువు తేదీలో తగినంత బ్యాలెన్స్ ఉంచాలని మీకు సూచిస్తున్నాము. బంగారం SIP గడువు తేదీన లేదా ఆ తేదీకి ఇటుఅటుగా మేము డెబిట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో, తగినంత బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్ లేని కారణంగా పేమెంట్ విఫలమైతే, మేము మీ బ్యాంక్ ఖాతాను డెబిట్ చేసేందుకు మళ్లీ ప్రయత్నించము. అలాంటి పేమెంట్ వైఫల్యం కారణంగా నేరుగా లేదా పర్యవసానంగా తలెత్తే నష్టాలు లేదా ఏదైనా బ్యాంక్ ఛార్జీల భారానికి PhonePe కానీ లేదా దాని భాగస్వాములు కానీ బాధ్యత వహించరు.

20. బంగారం SIP కొనుగోళ్లకు, SIP మొత్తం GST మరియు ఇతర వర్తించే పన్నులతో కూడి ఉంటుంది. బంగారం పరిమాణం SIP మొత్తం నుండి వర్తించే పన్నులను సర్దుబాటు చేసిన తర్వాత కేటాయించబడుతుంది.

21. బంగారం SIP ద్వారా మదుపు చేయడం కొనసాగించవద్దనుకుంటే మీరు మీ బంగారం SIPను తొలగించుకోవచ్చు. మీ వైపునుండి బంగారం SIP తొలగింపు కారణంగాతలెత్తే ఎలాంటి నష్టాలకూ PhonePe కానీ లేదా దాని బంగారం భాగస్వామ్య సంస్థలు కానీ ఎలాంటి బాధ్యతా వహించదు.

22. బంగారం SIP ద్వారా పోగు చేసిన బంగారం PhonePe వేదికలోని ఒక్కో భాగస్వామ్య సంస్థకోసం నిర్వహిస్తున్న బ్యాలెన్స్ లో కనిపిస్తుంది.

23. బంగారం SIP ద్వారా పోగు చేసిన బంగారం పరిమాణం విలువ ప్రస్తుతమున్న మార్కెట్ ధరను బట్టి ఉంటుంది. PhonePe కానీ, దాని బంగారం భాగస్వామ్య సంస్థలు కానీ బంగారం లావాదేవీలపై స్థిరమైన ప్రతిఫలాలపై ఎలాంటి హామీలు ఇవ్వవు. 

24. బంగారం SIP డెబిట్ ఆటోపే పై మీ బ్యాంక్ నుండి మేము మొత్తం తీసుకుంటున్నసమయంలో ఉన్న బంగారం ధర మాత్రమే బంగారం దామాషా పరిణామాన్ని కేటాయించేందుకు వర్తింపజేయబడుతుంది.

25. లాభాలు లేదా ఆదాయాలను కోల్పోవడం, వ్యాపార అంతరాయం, వ్యాపార అవకాశాలు కోల్పోవడం, డేటా కోల్పోవడం లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాల నష్టం వాటిల్లడం, అలాగే వీటికి మాత్రమే పరిమితం కాని నష్టాలతో సహా ఏదైనా పరోక్ష, పర్యవసాన, యాదృచ్ఛిక, ప్రత్యేక లేదా శిక్షార్హమైన నష్టాలకు PhonePe ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఈ నష్టాలు కాంట్రాక్ట్, నిర్లక్ష్యం, అపరాధం లేదా ఇతరత్రా, అందించిన సమాచారాన్ని ఉపయోగించడం లేదా ఉపయోగించలేకపోవడం వల్ల ఉత్పన్నం కావొచ్చు. లేదా మరో రకంగా ఉత్పన్నం కావొచ్చు. కాంట్రాక్ట్, అపరాధం, నిర్లక్ష్యం, వారంటీ లేదా ఇతరత్రా వాటివల్ల కూడా ఉత్పన్నం కావచ్చు, వాటికి కారణం కావచ్చు.

26. ఏ విధంగానైనా గోల్డ్ పార్టనర్‌ల నుండి  నియమాల ఉల్లంఘన కారణంగా మరియు/లేదా ప్రోడక్ట్‌లను కొనుగోలు చేయడం/సేవలను పొందడం ద్వారా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ కలగడానికి అవకాశం ఉన్న ఏదైనా మరియు అన్ని నష్టాలు, డ్యామేజ్‌లు, చర్యలు, క్లెయిమ్‌లు మరియు లయబిలిటీల (చట్టపరమైన ఖర్చులతో సహా) విషయంలో PhonePe, దాని అనుబంధ సంస్థలు, గ్రూప్ కంపెనీలు, వాటి డైరెక్టర్లు, అధికారులు, ఏజెంట్లు, ఉద్యోగులు మరియు ప్రతినిధులకు ఎటువంటి బాధ్యతా లేదని మీరు అంగీకరిస్తున్నారు. 

27. మీకు ముందస్తు రాతపూర్వక నోటీసు ఇవ్వకుండా, ఈ  నియమాల యొక్క భాగాలను మా స్వంత విచక్షణానుసారం మార్చడానికి, సవరించడానికి, జోడించడానికి లేదా తొలగించడానికి మేము హక్కును కలిగి ఉన్నాము. అప్‌డేట్లు/మార్పులకు సంబంధించి ఈ  నియమాలను క్రమానుగతంగా సమీక్షించడం మీ బాధ్యత. PhonePe వేదికను మీరు నిరంతరంగా వినియోగిస్తున్నారు అంటే సవరించిన  నియమాలను మీరు అంగీకరిస్తున్నారని మరియు ధృవీకరిస్తున్నారని పరిగణించబడుతుంది.

28. అధిక-రిస్క్ గల లేదా మోసపూరితమైన లావాదేవీలు ఏవైనా చోటు చేసుకుంటున్నాయేమోనని తెలుసుకోవడానికి మేము మీ లావాదేవీ(ల)ని పర్యవేక్షించవచ్చు. మేము చేసే లావాదేవీల పర్యవేక్షణ ఆధారంగా, మేము లావాదేవీలను నిలుపుదల చేయవచ్చు, నిరోధించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. PhonePeలోని మీ ఖాతా ద్వారా కొంత అనుమానాస్పద లేదా అసాధారణమైన యాక్టివిటీ జరిగిందని లేదా జరుగుతోందని మేము భావిస్తే PhonePe వేదికకు మీ యాక్సెస్‌ను మేము పూర్తిగా లేదా పాక్షికంగా నిరోధించవచ్చు.

29. PhonePe, తన అంతర్గత విధానాలు, నియంత్రణలు మరియు చట్టబద్ధమైన మార్గదర్శకాల ఆధారంగా, ఏవైనా లావాదేవీలను అనుమానాస్పదంగా లేదా మోసపూరితంగా నిర్ధారించినట్లయితే వాటి గురించి సంబంధిత ప్రభుత్వ అధికారులకు రిపోర్ట్ చేయవచ్చని మీరు అంగీకరిస్తున్నారు మరియు అర్థం చేసుకుంటున్నారు, అంతే కాక తప్పనిసరిగా మేము చేయాల్సిన అటువంటి రిపోర్టింగ్ వల్ల మీకు ఏదైనా నష్టం కలిగితే దానికి మేము బాధ్యత వహించము. అటువంటి లావాదేవీ తరువాతి దశలో సక్రమమైనది అని మరియు చట్టబద్ధమైనది అని గుర్తించబడినప్పటికీ కూడా ఏదైనా నష్టం జరిగితే దానికి మేము బాధ్యత వహించము.

30. PhonePe, తన స్వంత విచక్షణానుసారం, PhonePe వేదికకు మీ యాక్సెస్‌ను ఎలాంటి నోటీసు లేకుండా ఎప్పుడైనా తాత్కాలికంగా లేదా శాశ్వతంగా సస్పెండ్‌ చేయవచ్చు/పూర్తిగా నిలిపివేయవచ్చు. అంతేకాకుండా, ఏదైనా లావాదేవీ అనుమానాస్పదమైనది, సక్రమమైనది కాదు, చట్టవిరుద్ధమైనది లేదా మోసపూరితమైనదని మేము భావించినప్పుడు మీ లావాదేవీలలో దేనినైనా మేము పరిశీలించి, దర్యాప్తు చేయవచ్చు.

31. మోసపూరిత వినియోగదారుడు మోసపూరిత లాావాదేవీ ద్వారా కొనుగోలు చేసిన బంగారాన్ని ఇప్పటికే విక్రయించి ఉన్నా, అలాంటి విక్రయం ద్వారా నిధులు అందుకుని ఉన్నా లేదా అలా కొనుగోలు చేసిన బంగారాన్ని డెలివరీ చేయించుకోవాలని మోసపూరిత వినియోగదారు ఎంచుకున్నా, అలాంటి లావాదేవీనీ వెనక్కు మళ్లించే బాధ్యత PhonePeకు ఉండదని వివరణ ఇవ్వబడుతోంది. ఇలాంటి సందర్భంలో, PhonePe తనకున్న సామర్థ్యం మేరకు, బాధితునికి లేదా సంబంధిత అధికారులకు నిధులు సెటిల్ చేసిన బ్యాంక్ ఖాతా లేదా మొబైల్ వాలెట్ ఖాతా సహా మోసపూరిత వినియోగదారుకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది.

32. ఈ నిబంధనలను భారత ప్రభుత్వ చట్టాలు తమ న్యాయ సూత్రాలకు భంగం వాటిల్లకుండా పర్యవేక్షిస్తాయి. ఈ నియమాలకు సంబంధించి మీకు, PhonePeకు మధ్య తలెత్తే ఏదైనా వివాదం పూర్తిగా కానీ, లేదా పాక్షికంగా కానీ బెంగళూరులోని న్యాయ వివాదాల అధికార పరిధిలో విచారణ ద్వారా తీర్పు నిర్ణయించబడుతుంది.

33. యూజర్‌ రిజిస్ట్రేషన్, గోప్యత, యూజర్‌ బాధ్యతలు, నష్టపరిహారం, వర్తించే చట్టం, లయబిలిటీ, మేథో సంపత్తి, కాన్ఫిడెన్షియాలిటీ మరియు సాధారణ ప్రొవిజన్స్‌ వంటి అన్ని ఇతర  నియమాలు PhonePe T&Cలను సూచించడం ద్వారా ఈ  నియమాలలో పొందుపరచబడినట్లుగా పరిగణించబడుతుంది.