రీఛార్జ్ విజయవంతమైన తర్వాత కూడా నా DTH సర్వీస్ ఇంకా ఎందుకు యాక్టివేట్ కాలేదు?
మీ DTH సర్వీస్ యాక్టివేట్ కాకపోయినా లేదా PhonePeలో రీఛార్జ్ విజయవంతమైంది అని మార్క్ చేసిన తర్వాత కూడా రీఛార్జ్ ప్రయోజనాలు వర్తించకపోయినా ఈ కింది వాటిని గమనించండి:
- రీఛార్జ్ పూర్తయిన తరువాత యాక్టివేట్ కావడానికి 20 నిమిషాల వరకు సమయం పట్టవచ్చు. 20 నిమిషాలు వేచి ఉండి చెక్ చేయమని మేము అభ్యర్థిస్తున్నాము.
- సెట్-టాప్ బాక్స్‌లో DTH కార్డును సరిగ్గా ఇన్‌సర్ట్ చేసి ఉండాలి.
- రీఛార్జ్ చేసే సమయంలో సెట్-టాప్ బాక్స్, అలాగే టీవీ తప్పనిసరిగా ఆన్ చేసి ఉండాలి.
దయచేసి DTH కార్డును తీసి మరలా ఇన్‌సర్ట్ చేయండి, టీవీ ఇంకా సెట్-టాప్ బాక్స్‌ను ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి.
మీరు ఇప్పటికీ రీఛార్జ్ ప్రయోజనాలను పొందనట్లయితే సపోర్ట్ కోసం మీ DTH సేవా సంస్థను సంప్రదించండి.