PhonePeలో ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ చేసుకోవడం ఎలా?
ప్రీపెయిడ్ మొబైల్ నెంబర్‌ను రీఛార్జ్ చేయడానికి, కింది దశలను అనుసరించండి:
- PhonePe యాప్ హోమ్ స్క్రీన్‌లోని రీఛార్జ్ మరియు బిల్లు పేమెంట్ విభాగం కింద మొబైల్ రీఛార్జ్‌ను నొక్కండి
- మీరు రీఛార్జ్ చేయాలనుకుంటున్న మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి. మీ కాంటాక్ట్‌ల జాబితాను శోధించి, దానినుంచి కూడా ఒక కాంటాక్ట్‌ను ఎంచుకోవచ్చు
- ఆపరేటర్ పేరు, సర్కిల్‌ను సరి చూసుకుని, అవసరమైతే, వాటిని సవరించండి.
- మీరు రీఛార్జి చేయాలనుకుంటున్న అమౌంట్‌ను ఎంటర్ చేయండి. అందుబాటులో ఉన్న ప్లాన్లను చూసేందుకు ప్లాన్లను చూడండిని నొక్కి, ఒక ప్లాన్‌ను ఎంచుకోండి.
- రీఛార్జ్‌ను నొక్కండి. ఒక పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకుని, పేమెంట్ చేయండి.
యాప్‌లో పేమెంట్‌ను విజయవంతంగా చేసిన తర్వాత, రీఛార్జ్ చేసిన నెంబర్‌కు సేవా సంస్థ SMS ద్వారా నిర్ధారణ సందేశాన్ని పంపుతుంది. అలాగే PhonePe నుంచి ఇమెయిల్ కూడా మీకు పంపించబడుతుంది. మీరు మీ రీఛార్జ్‌ను అందుకోకుంటే, నిర్ధారణ స్క్రీన్‌లో మీకు కనిపించే ఆపరేటర్ రెఫరెన్స్ ఐడితో ఆపరేటర్‌ను సంప్రదించండి.
గమనిక: మీరు PhonePeలో అంతర్జాతీయ నంబర్‌తో రిజిస్టర్ చేసినట్లయితే, భారతీయ మొబైల్ నంబర్లకు మాత్రమే రీఛార్జ్ చేయగలరు.