నా సిలిండర్ బుకింగ్ కోసం నేను పే చేయడం ఎలా?
PhonePeలో భారత్ గ్యాస్, HP గ్యాస్ మరియు ఇండేన్ ద్వారా మీ గ్యాస్ సిలిండర్‌కు మీరు బుక్ చేయవచ్చు.
- రీఛార్జి మరియు బిల్లులు చెల్లించండి విభాగంలో ఒక సిలిండర్ బుక్ చేసుకోండిని ట్యాప్ చేయండి.
- మీ గ్యాస్ సేవా సంస్థను ఎంచుకోండి. మీరు కింది వాటిల్లో నుంచి సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు.:
- Bharat Gas
- HP Gas
- Indane
- సంబంధిత వివరాలను ప్రవేశపెట్టండి.
HP గ్యాస్ ద్వారా మీరు సిలిండర్‌ను బుక్ చేసుకుంటుంటే, మీ రాష్ట్రాన్ని, జిల్లాను ఎంచుకోండి. ఆ తర్వాత మీ ఏజెన్సీని ఎంచుకుని, మీ 6 అంకెల వినియోగదారు సంఖ్యను ప్రవేశపెట్టండి.
భారత్ గ్యాస్,HP గ్యాస్ మరియు ఇండేన్ ద్వారా బుకింగ్ చేసుకోవడానికి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా మీ 17 అంకెల LPG ఐడిని ప్రవేశపెట్టండి. - చెల్లించాల్సిన మొత్తం అందుకోబడుతుంది. పేమెంట్ పద్ధతిని ఎంచుకుని, పే చేయండిని ట్యాప్ చేయండి.
గమనిక: నిరంతరాయమైన అనుభవాన్ని అందించడం కోసం మెరుగుపరిచేలా మా ప్లాట్‌ఫారంలో చేసే బిల్ పేమెంట్లకోసం చిన్న ఫీజు (GST సహా)ను PhonePe మీ నుండి వసూలు చేయవచ్చు. ఇది మీరు ఉపయోగించే పేమెంట్ సాధనంతో సంబంధం లేకుండా ఈ ప్లాట్‌ఫారంను ఉపయోగించినందుకు వసూలు చేసే ఫీజు.
పేమెంట్ విజయవంతమైన మీదట, మీ స్క్రీన్ లో మీరు ఒక బుకింగ్ ఐడిని అందుకుంటారు. మీ బుకింగ్‌ను ట్రాక్ చేయడానికి లేదా డెలివరీ సంబంధిత సమస్యలను పరిష్కరించడం కోసం మీ ఏజెన్సీని సంప్రదించడానికి ఈ బుకింగ్ ఐడిని ఉపయోగించుకోండి.
ముఖ్యమైన విషయం: మీరు PhonePeలో అంతర్జాతీయ నంబర్‌తో రిజిస్టర్ చేసినట్లయితే, భారతీయ గ్యాస్ ప్రొవైడర్లకు మాత్రమే పేమెంట్లు చేయగలుగుతారు.
మీ వినియోగదారు నెంబర్/ LPG ఐడిని కనుగొనడం గురించి మరింత తెలుసుకోండి.