కేబుల్ టీవీ బిల్ పేమెంట్ కోసం ఇన్‌వాయిస్‌ను నేను ఎలా అందుకోవాలి?

మీ కేబుల్ టివి బిల్ పేమెంట్ కోసం ఇన్‌వాయిస్ అందుకోవడానికి, మీరు సేవా సంస్థ వెబ్‌సైట్‌కు లాగిన్ కావాలి లేదంటే సేవా సంస్థ వినియోగదారు సేవా బృందాన్ని సంప్రదించి, లావాదేవీ రెఫరెన్స్ ఐడిని పంచుకోవాలి. 

PhonePeలో మీరు చేసే బిల్ పేమెంట్లు అన్నిటికీ మీరు రిజిస్టర్ చేసుకున్న ఇమెయిల్ చిరునామా (ధృవీకరించబడితే)కు పేమెంట్ రసీదు పంపబడుతుందని దయచేసి గమనించగలరు. మీ ఇమెయిల్ చిరునామాను మీరు ధృవీకరించకుంటే, మీరు కింది విధంగా చేయవచ్చు:

  1. PhonePe యాప్ హోమ్ స్క్రీన్‌లో మీ ప్రొఫైల్ చిత్రాన్ని ట్యాప్ చేయండి.
  2. ఇమెయిల్‌ను ధృవీకరించుని ట్యాప్ చేయండి.
  3. మీరు మాతో రిజిస్టర్ చేసుకున్న ఇమెయిల్ చిరునామాకు పంపిన ధృవీకరణ కోడ్‌ను ప్రవేశపెట్టి, పాపప్‌లో నిర్ధారించును ట్యాప్ చేయండి.