నా బిల్లు పేమెంట్ ఎందుకు పెండింగ్‌లో ఉంది?

సాధారణంగా, PhonePe ద్వారా చేసిన బిల్లు పేమెంట్లు వెంటనే పూర్తవుతాయి. అయితే అరుదైన సందర్భాలలో మీ బిల్లు పేమెంట్లు పూర్తవడానికి కొంత సమయం పట్టవచ్చు. PhonePeలో మీ బిల్లు పేమెంట్ పెండింగ్‌లో ఉన్నట్లు మీరు గమనిస్తే, మీ విద్యుత్ సేవా సంస్థ నుండి పేమెంట్ నిర్ధారణ కోసం మేము వేచి ఉన్నాము అని అర్థం. 

మీ పేమెంట్ పూర్తవడానికి కొన్ని గంటలు వేచి ఉండి, ఆపై మీ యాప్‌లో ఉన్న చరిత్ర విభాగంలో ఈ బిల్లు పేమెంట్‌కు సంబంధించిన చివరి స్టేటస్‌ను చెక్ చేయమని మేము సిఫార్సు చేస్తున్నాము. 

ముఖ్య గమనిక: మీ విద్యుత్తు బిల్లు పేమెంట్ విఫలమైనట్లయితే, మీరు ఉపయోగించిన పేమెంట్ పద్ధతి ఆధారంగా మీ మొత్తం మీకు రీఫండ్ చేయబడుతుంది. UPI ద్వారా చేసిన పేమెంట్లకు 3 నుండి 5 రోజులలో, డెబిట్/క్రెడిట్ కార్డు ద్వారా చేసిన పేమెంట్లకు 7 నుండి 9 రోజులలో, వాలెట్ లేదా గిఫ్ట్ కార్డు ద్వారా చేసిన పేమెంట్లకు 24 గంటలలో, మీ మొత్తం మీకు రీఫండ్ చేయబడుతుంది.