నా అద్దె పేమెంట్ పెండింగ్‌లో ఉన్నట్లు ఎందుకు చూపెడుతుంది?

PhonePeలో అద్దె పేమెంట్లు సాధారణంగా తక్షణమే జరుగుతాయి. కొన్ని అరుదైన సందర్భాల్లో, సాంకేతిక సమస్యల వల్ల, అది కాస్త ఎక్కువ సమయం తీసుకోవచ్చు. కొన్ని గంటల తర్వాత మీ PhonePe యాప్‌లోని చరిత్ర/History విభాగంలో మీ పెండింగ్ అద్దె పేమెంట్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.

మీ అద్దె చెల్లింపు విజయవంతమైతే, చెల్లింపు తేదీ నుండి 2 పనిదినాలలో డబ్బు మీ యజమాని ఖాతాలో జమ అవుతుంది. ఏదైనా కారణం వల్ల మీ చెల్లింపు విఫలమైతే, మొత్తం 7 పనిదినాలలోగా మీకు రీఫండ్ అవుతుంది.