పేమెంట్ స్థితులు

మీ PhonePe వాలెట్ ఉపయోగించి చేసే పేమెంట్లు వేగంగా, తక్షణమే జరుగుతుంటాయి.

అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో, వివిధ కారణాలతో ఈ పేమెంట్లు సాధారణంకన్నా ఎక్కువ సమయం తీసుకోవచ్చు లేదా విఫలం కావచ్చు.

వివిధ పేమెంట్ స్థితుల గురించి మీరు తెలుసుకోవాల్సినవి: 

విజయవంతమైంది

ఈ స్క్రీన్ మీకు కనిపిస్తే, PhonePe వాలెట్ ను ఉపయోగించి చేసిన మీ పేమెంట్ విజయవంతంగా పూర్తయింది అని అర్థం. 

మీ పేమెంట్ మొత్తం మీ PhonePe వాలెట్ నుంచి డెబిట్ చేయబడింది
వ్యాపారి లేదా బిల్లర్ బ్యాంకు మీ పేమెంట్ అంగీకరించింది
వ్యాపారి లేదా బిల్లర్ బ్యాంకు వ్యాపారి లేదా బిల్లర్ బ్యాంకు ఖాతాలోకి మొత్తాన్ని డిపాజిట్ చేసింది
వ్యాపారి లేదా బిల్లర్ మీ అభ్యర్థనను ప్రాసెస్ చేస్తారు

గమనిక:వ్యాపారులు లేదా బిల్లర్లు లేదా సేవా సంస్థలకు పేమెంట్లు చేసే విషయంలో, మీ అభ్యర్థనను వ్యాపారులు లేదా బిల్లర్లు లేదా సేవా సంస్థలు నిర్వచించిన కాలక్రమం ప్రకారం  ప్రాసెసింగ్ చేస్తాయి.వ్యాపారులు లేదా బిల్లర్లు లేదా సేవా సంస్థలకు పేమెంట్లుగురించి మరింత తెలుసుకోండి. 

పెండింగ్

ఈ స్క్రీన్ మీకు కనిపిస్తే, PhonePe వాలెట్ ను ఉపయోగించి చేసిన మీ పేమెంట్ పెండింగ్ లో పడిందని అర్థం.

మీ PhonePe వాలెట్ నుంచి మీ పేమెంట్ మొత్తం డెబిట్ చేయబడింది
వ్యాపారి/బిల్లర్ బ్యాంకు మీ పేమెంట్ ను అంగీకరించారు 
వ్యాపారి లేదా బిల్లర్ బ్యాంకు వ్యాపారి లేదా బిల్లర్ బ్యాంకు ఖాతాలోకి మొత్తాన్ని డిపాజిట్ చేసింది 
వ్యాపారి లేదా బిల్లర్ మీ అభ్యర్థనను ప్రాసెస్ చేస్తారు

మీ పెండింగ్ పేమెంట్ తుది స్థితిని అప్ డేట్ చేసేందుకు వ్యాపారి లేదా బిల్లర్ కు 5నిమిషాల నుంచి 2 రోజులు సమయం పట్టవచ్చు.  ఇది పూర్తిగా వ్యాపారి లేదా బిల్లర్ పైన ఆధారపడి ఉంటుంది.

ముఖ్య గమనిక: మీ డబ్బు పూర్తి సురక్షితంగా ఉంది. మీ పేమెంట్ విఫలమైతే రీఫండ్ చేయబడుతుంది.

తుది స్థితి అప్ డేట్ అయితే, మీ పేమెంట్ కింది విధంగా గుర్తు పెట్టబడుతాయి:
విజయవంతమైంది - మీ మొత్తం వ్యాపారి లేదా బిల్లర్ యొక్క ఖాతాకు చేరుతుంది. మీ అభ్యర్థన ప్రాసెస్ చేయబడుతుంది. 
విఫలమైంది - మీరు మళ్లీ పేమెంట్ చేయవచ్చు. PhonePe వాలెట్ మీ మొత్తం డెబిట్ చేయబడితే, అది వెంటనే మీ వాలెట్ కు రీఫండ్ చేయబడుతుంది. రీఫండ్లు.గురించి మరింత తెలుసుకోండి.

విఫలమైంది

మీకు ఈ స్క్రీన్ కనిపిస్తే,  PhonePe వాలెట్ ను ఉపయోగించి చేసిన మీ పేమెంట్  విఫలమైంది అని అర్థం.

విఫలం కావడానికి కారణాలు కొన్ని కింద ఇవ్వబడ్డాయి: 
మీ వాలెట్ లోతగినంత బ్యాలెన్స్ లేకపోవడం 
సాంకేతిక లేదా నెట్ వర్క్ సమస్యలు
భద్రతా కారణాలు

 PhonePe వాలెట్ ను ఉపయోగించి చేసిన పేమెంట్ విఫలమైతే, మీ డబ్బు డెబిట్ కావచ్చు.  మీ డబ్బు సురక్షితంగా ఉంది అని, అది మీ వాలెట్ లోకి రీఫండ్ చేయబడుతుందని దయచేసి తెలుసుకోండి. 

రీఫండ్లు.గురించి మరింత తెలుసుకోండి.